సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమా రిలీజ్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ముందుగా అనుకున్నట్టుగా కబాలి జూలై 15న మాత్రం రిలీజ్ కావటం లేదంటూ ఫిక్స్ అయ్యారు. అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఇదే ఆలోచనతో తమ సినిమాలను లైన్ లో పెడుతున్నారు. స్టార్ హీరోలు రిస్క్ చేయకపోయినా చిన్న సినిమా నిర్మాతలు మాత్రం గ్యాప్ ను వాడేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ మరోసారి సెల్పీ రాజాగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను జూలై 15న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న లేడి ఓరియంటెడ్ మూవీ నాయకీ. తొలిసారిగా గ్లామర్ హీరోయిన్ త్రిష ఓ లేడిఓరియంటెడ్ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇన్నాళ్లు రిలీజ్ డేట్ విషయంలో ఆలోచన చేస్తూ వచ్చిన నాయకీ టీం కూడా కబాలి రిలీజ్ వాయిదా పడుతుందన్న ఆలోచనతో జూలై 15నే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆ గ్యాప్ వాడేసుకుంటున్నారు
Published Tue, Jul 5 2016 12:16 PM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM
Advertisement
Advertisement