nayaki
-
అచ్చిరాని హర్రర్
తమిళసినిమా: కోలీవుడ్‌లో హర్రర్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. నిర్మాతలకు మంచి లాభదాయకంగా ఉండడమే అందుకు కారణం కావచ్చు. అంతే కాదు అగ్రనటిగా రాణిస్తున్న నయనతారకు హర్రర్ ట్రెండీ వర్కౌట్ అయ్యింది. మాయ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి హెల్ప్ అయ్యిందని చెప్పక తప్పదు. అయితే అదే బాటలో పయనించాలని భావించిన నటి త్రిషకు వర్కౌట్ కాలేదు. కమర్శియల్ చిత్రాల నాయకిగా వెలుగుతున్న త్రిష. నాయకి చిత్రంలో హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల నాయకిగా రాణించాలని ఆశ పడింది. అయితే అది మొదట్లోనే గండి పడింది. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినా మరో ప్రయత్నం చేద్దామని చేసిన మోహిని చిత్రం త్రిషను పూర్తిగా నిరాశ పరచింది. ఇందులో తను తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసింది కూడా. ఈ చిత్ర విడుదలకు ముందు పత్రికల వారితో తనకు హర్రర్ చిత్రాలంటే ఇష్టం అని, అదీ దెయ్యాలంటే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇకపై కూడా హర్రర్ కథా చిత్రాలు చేస్తానని పేర్కొంది. అలాంటిది ఇప్పుడు చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందట. అదేమై ఉంటుందో ఊహించగలరా? నాయకి, మోహిని చిత్రాలు ఘోరంగా నిరాశపరచడంతో ఇకపై ఇలాంటి హర్రర్ కథా చిత్రాలను చేయనన్నదే ఆ నిర్ణయం. అంతే కాదు మోహినీ చిత్ర దెబ్బకు త్రిష వారం రోజుల పాటు ఏకాంతం కోరుకుంది. తన చిత్రాలకు సంబంధించిన అన్ని పనులకు దూరంగా ఉంటుందట అవును ఈ విషయాన్ని ఒక వీడియో ద్వారా పేర్కొని దాన్ని తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. కొత్త చిత్ర కథా చర్చలపై ప్రత్యేక దృష్టి సారించడానికే ఈ విరామం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. ఈ అమ్మడి చేతిలో విజయ్‌సేతుపతితో నటిస్తున్న 96, లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న గర్జన, 1818, అరవిందస్వామి సరసన నటిస్తున్న చతురంగవేట్టై 2 చిత్రాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ షూటింగ్, నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయన్నది గమనార్హం. ప్రస్తుతం ఫ్లాప్‌ల్లో ఉన్న త్రిషకు నిర్మాణంలో ఉన్న ఏ చిత్రం విజయానందాన్ని ఇస్తుందో చూడాలి. -
నాయకి
-
మోహినిగా త్రిష, దెయ్యమా..? దేవతా..?
సీనియర్ హీరోయిన్ త్రిష ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి పీటల దాకా వెళ్లి వెనక్కి వచ్చిన ఈ బ్యూటి రీ ఎంట్రీ మరింత జోరు చూపిస్తోంది. విజయాలు సాధించటంలో వెనకపడుతున్నా... అందాలతో ఆకట్టుకోవటంలో మాత్రం కుర్ర హీరోయిన్ లకు కూడా పోటీ వస్తోంది. ఇటీవల హార్రర్ జానర్ లో తెరకెక్కిన అరణ్మనై 2, నాయకీ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది త్రిష. ఈ రెండు సినిమాలు ఆశించిన స్ధాయి ఫలితాలు ఇవ్వకపోయినా మరోసారి అదే జానర్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. మోహిని పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో టైటిల్ రోల్ లో నటిస్తోంది ఈ చెన్నై బ్యూటి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విఠలాచార్య సినిమాల్లో దెయ్యాలు వేసే తరహా స్కిన్ టైట్ డ్రెస్ లో తలపై కిరీటం, ఎనిమిది చేతులలో ఆయుధాలు.. చూస్తుంటే.. ఈజిప్ట్ దేవతలా కనిపిస్తోంది. ఎక్కువ భాగం లండన్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాకు ఆర్ మాదేష్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్రిష కెరీర్ కు మంచి బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాతో పాటు ధనుష్ హీరోగా తెరకెక్కిన కోడి సినిమాలోనూ నటిస్తోంది ఈ బ్యూటి. మరి ఈ సినిమాలైనా త్రిషకు బ్రేక్ ఇస్తాయేమో చూడాలి. -
దానికి ఓ కారణం ఉంది: త్రిష
'నేను నా సినిమా గురించి మాట్లాడకపోవడం, ప్రమోషన్లో పాల్గొనకపోవడం వెనుక విలువైన కారణాలున్నాయి. నన్ను ప్రశ్నలు అడుగుతున్న మీడియా స్నేహితులకు, అభిమానులకు నా క్షమాపణలు. త్వరలో నేను వ్యక్తిగతంగా అన్ని విషయాలను వివరిస్తాను. మీరందించిన సపోర్ట్ కు, చూపిస్తున్న ప్రేమకు నా ధన్యవాదాలు' అంటూ హీరోయిన్ త్రిష ట్వీట్ చేసింది. ఇంతకీ ఈ చెన్నై చిన్నది దేని గురించి మాట్లాడుతుంది అంటే... 'నాయకి' సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండటం గురించి. త్రిష ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో హారర్ కామెడీగా 'నాయకి' రిలీజైన సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్లకు ఆమె డేట్స్ ఇవ్వలేదు సరి కదా.. మొత్తం ప్రచారానికి దూరంగా ఉంది. దీంతో చిత్ర అపజయంలో పరోక్షంగా తను కూడా ఓ కారణమంటూ వినిపిస్తున్న వార్తలకు ఆమె ఆలస్యంగా స్పందించింది. త్రిషకు మేనేజర్‌గా వ్యవహరించిన గిరిధర్ నిర్మాతగా మారి 'నాయకి' సినిమాను తీశారు. గోవి దర్శకత్వం వహించిన ఈ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కావడం, త్రిష ప్రమోషన్లకు దూరంగా ఉండటంతో.. కావాలిసినంత ప్రచారం లభించక సినిమా ఆశించినంత విజయం సాధించలేదనేది త్రిషపై వినిపిస్తున్న ఫిర్యాదులు. If I am not talking about or promoting my film,there are valid reasons for it.Apologies to my media friends and fans who have been asking me — Trisha Krishnan (@trishtrashers) 15 September 2016 I will personally make sure it is explained soon.Thank u all for the consistent support and love — Trisha Krishnan (@trishtrashers) 15 September 2016 -
ఈ శుక్రవారం కామెడీదా.. హర్రర్దా?
శుక్రవారం రాగానే సినీ ప్రియులకు గుర్తొచ్చేది కొత్త సినిమా. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇండస్ట్రీ ఏదైనా సినిమా రిలీజ్ మాత్రం దాదాపుగా శుక్రవారమే. ఫ్రై డే అంటేనే ఫిల్మీ డే. తాజాగా ఈ శుక్రవారం రెండు తెలుగు సినిమాలు ధియేటర్లలో సందడి చేయనున్నాయి. ఒకటి చానాళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న యంగ్ హీరో అల్లరి నరేష్ చిత్రం 'సెల్ఫీ రాజా' కాగా, రెండవది చెన్నై చిన్నది త్రిష నటించిన ద్విభాషా చిత్రం 'నాయకి'. 'సెల్ఫీ రాజా'గా అల్లరి నరేష్ తనకలవాటైన కామెడీతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, త్రిష 'నాయకి'గా భయపెట్టేందుకు 'వన్ ఉమన్ షో'కి సిద్ధమైంది. ఈ సినిమాలు సక్సెస్ టాక్ తెచ్చుకోవడం అటు అల్లరి నరేష్‌కి, ఇటు త్రిష కెరీర్‌కి కూడా చాలా ముఖ్యం. మరి తెలుగు ప్రేక్షకులు కామెడీకి కమిట్ అవుతారో లేక భయానికి భళా అంటారో తెలియాలంటే ఒక్క రోజు ఆగాల్సిందే. ఏదేమైనా ఈ రెండు సినిమాల కలెక్షన్లకు ఈ వారం కీలకం కానుంది. ఎందుకంటే వచ్చే వారం సూపర్ స్టార్ రజనీ 'కబాలి' ధియేటర్లపై దాడి చేయనుంది. -
ఆ గ్యాప్ వాడేసుకుంటున్నారు
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమా రిలీజ్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ముందుగా అనుకున్నట్టుగా కబాలి జూలై 15న మాత్రం రిలీజ్ కావటం లేదంటూ ఫిక్స్ అయ్యారు. అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఇదే ఆలోచనతో తమ సినిమాలను లైన్ లో పెడుతున్నారు. స్టార్ హీరోలు రిస్క్ చేయకపోయినా చిన్న సినిమా నిర్మాతలు మాత్రం గ్యాప్ ను వాడేసుకోవడానికి రెడీ అవుతున్నారు. బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ మరోసారి సెల్పీ రాజాగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను జూలై 15న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న లేడి ఓరియంటెడ్ మూవీ నాయకీ. తొలిసారిగా గ్లామర్ హీరోయిన్ త్రిష ఓ లేడిఓరియంటెడ్ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇన్నాళ్లు రిలీజ్ డేట్ విషయంలో ఆలోచన చేస్తూ వచ్చిన నాయకీ టీం కూడా కబాలి రిలీజ్ వాయిదా పడుతుందన్న ఆలోచనతో జూలై 15నే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. -
నాయకీ... సందడే లేదు
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన త్రిష, రీ ఎంట్రీలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతోంది. పెళ్లి ఆగిపోవటంతో తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టిన చెన్నై చిన్నది మంచి కమర్షియల్ హిట్ ఇవ్వటంలో మాత్రం ఫెయిలవుతోంది. ఒక్క లయన్ తప్ప రీ ఎంట్రీలో ఈ బ్యూటి నటించిన ఏ సినిమా కూడా భారీ కమర్షియల్ హిట్ అనిపించుకోలేకపోయింది. తాజాగా రూట్ మార్చిన ఈ బ్యూటి గ్లామర్ రోల్స్‌ను పక్కన పెట్టి లేడి ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. చాలా కాలంగా తన దగ్గర మేనేజర్‌గా పనిచేస్తున్న గిరిధర్ నిర్మాణంలో నాయకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 8న రిలీజ్‌కు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రం వేగం పెంచలేదు. ఇప్పటికే ఆడియో రిలీజ్ అయినా మీడియాలో నాయకీ సందడి కనిపించటం లేదు. చీకటి రాజ్యం సినిమా తరువాత వెండితెర మీద కనిపించని త్రిష నాయకీ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది. కానీ చిత్రయూనిట్ ప్రమోషన్ విషయంలో వ్యవహరిస్తున్న తీరుతో త్రిష గుర్రుగా ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
రంజాన్‌కు నాయకి?
రంజాన్ పండుగ సందర్భంగా నాయకి చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నట్లు తాజా సమాచారం. ఇప్పటి వరకూ అధికంగా హీరోల చుట్టూ తిరుగుతూ డ్యూయెట్లకే పరిమితమైన త్రిష తాజాగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల నాయకిగా మారిపోయారు. ఈ చెన్నై చిన్నది ఇటీవలే మోహినీ అవతారమెత్తి లండన్‌లో షూటింగ్ చేసొచ్చారు. ఇది క్రైమ్ థ్రిల్లర్ ఇతివృత్తంతో కూడిన హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం. అంతకు ముందే నాయకి చిత్రంలో నటించారు. ఇదీ ఆ తరహా హారర్ కథా చిత్రమే. ఇందులో చెన్న చిన్నది త్రిష ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఒక పాత్ర వినోదభరితంగా, మరో పాత్ర రౌద్రభరితంగానూ ఉంటాయట. ఈ రెండు పాత్రలకు చక్కని వేరియేషన్స్ చూపిస్తూ చెన్నై చిన్నది సూపర్‌గా నటించారట. తన మేనేజర్ తమిళం, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ హక్కుల్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ పొందినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని రంజాన్ పండగ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
10న తెరపైకి నాయకి
ఎవర్గ్రీన్ హీరోయిన్ త్రిష జూన్ 10వ తేదీన నాయకిగా తెరపైకి రానున్నారన్న విషయం ఆమె అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఎన్నైఅరిందాల్,భూలోకం,తూంగావనం వంటి వరుస విజయాలు కథానాయకిగా త్రిష స్థానాన్ని సుస్థిరం చేశాయని చెప్పవచ్చు.ఆ తరువాత వచ్చిన అరణ్మణై-2 చిత్రం పెద్దగా విజయం సాధించక పోయినా త్రిష క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.తాజాగా నటిస్తున్న నాయకి చిత్రంపై ఇటు కోలీవుడ్‌లోనూ అటు టాలీవుడ్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. కారణం త్రిష ఇందులో తొలి సారిగా ద్విపాత్రాభినయం చేయడం.ఇది లేడీ ఓరియెంటెడ్ హారర్ కథా చిత్రం కావడం లాంటి పలు విశేషాలు చోటు చేసుకోవడం అని పేర్కొనవచ్చు.తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిషకు జంటగా గణేశ్వెంకట్రామ్ నటించారు.ఇతర ముఖ్య పాత్రల్లో సుష్మాస్వరాజ్,మనోబాలా,కోవైసరళ,జయప్రకాశ్ తదితరులు నటించారు. టాలీవుడ్ దర్శకుడు గోవి దర్శకత్వం వహించిన నాయకి చిత్రం జూన్ 10వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోందని సినీ వర్గాల సమాచారం.ప్రస్తుతం త్రిష ధనుష్ సరసన కొడి చిత్రంలో నటిస్తున్నారు.దీని తరువాత మరో హారర్ చిత్రంలో ఇంకోసారి ద్విపాత్రాభినయం చేయడానికి సిద్ధం అవుతున్నారు.అధిక భాగం విదేశాలలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి మాదేష్ దర్శకత్వం వహించనున్నారు. -
'నాయకీ'కి పుట్టిన రోజు శుభాకాంక్షలు
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం పూర్తి చేసుకున్న త్రిష తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్ లోనూ నటించింది. ఇటీవల కెరీర్లో లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి ఫాంలో ఉంది. 33 వ ఏట అడుగుపెడుతున్న ఈ ముద్దుగుమ్మకు ఛార్మీ, పూరి జగన్నాథ్, హన్సిక, తాప్సీ, జయం రవి, సిద్దార్థ్, రాధిక లాంటి సౌత్ స్టార్స్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న నాయకీ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌కు రెడీ అవుతుండగా, మరో మూడు చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. Happiest Bday my partner in crime @trishtrashers -
త్రిష పాట వింటారా..
అడపాదడపా సినీ హీరోలు తమ గొంతు సవరించుకుని పాటలు పాడుతుంటారు. ఈ మధ్య కాలంలో అయితే అలాంటి పాటలు చాలానే ఉన్నాయి. సినిమా ప్రమోషన్స్ లో ఆ పాటల వీడియోలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇక ఇప్పుడు హీరోయిన్ల వంతు. తాజాగా నాజూకు అందాల సుందరి త్రిష 'నాయకి' సినిమా కోసం తొలిసారి తెలుగులో ఓ పాట పాడింది. ఎప్పుడెప్పుడు ఆమె గాత్రాన్ని విందామా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం యూ ట్యూబ్ లో ఆ పాట అలరించనుంది. 'నాయకి' కోసం స్వయంగా త్రిష పాడిన పాటను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్... యూ ట్యూబ్ ద్వారా రిలీజ్ చేశారు. రఘుకుంచె, సాయి కార్తీక్ లు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. పాటను లాంచ్ చేసినందుకు మురిసిపోతూ 'థాంక్యూ మై ఫ్రెండ్.. బిగ్ బిగ్ బిగ్ హగ్' అంటూ పూరీని ఉద్దేశించి ట్వీట్ చేసింది మన నాయకి. త్రిష గొంతు విన్న పూరీ 'లవ్ యువర్ వాయిస్' అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మరి మీరూ వినేయండి.. https://t.co/aEXHC1Effd N telugu it is.....❤️ #Nayaki — Trisha Krishnan (@trishtrashers) 11 April 2016 Thank u so much my friend @purijagan for launching my song..Big big biggg hug. pic.twitter.com/ZRisJp5g1d — Trisha Krishnan (@trishtrashers) 11 April 2016 -
నాయికలు పాటలకే పరిమితం కాకూడదు!
‘‘ఈ చిత్రం టీజర్ చూస్తే సినిమా బాగుంటుందనిపిస్తోంది. గిరిధర్ నిర్మించిన ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రానికి మించిన విజయాన్ని ఈ చిత్రం సాధించాలి. హీరోయిన్ను కేవలం పాటల కోసమే తీసుకుంటున్న ఈ రోజుల్లో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేస్తున్న దర్శకుడు గోవికి నా అభినందనలు’’ అని డాక్టర్ దాసరి నారాయణరావు అన్నారు. త్రిష, గణేశ్ వెంకట్రామన్ ప్రధానపాత్రల్లో రాజ్ కందుకూరి సమర్పణలో గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడి పల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మించిన ‘నాయకి’ చిత్రం టీజర్‌ను దాసరి విడుదల చేశారు. ‘‘నాకిది ఫస్ట్ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. ఈ చిత్రంలో ఓ పాట కూడా పాడాను’’ అని త్రిష తెలిపారు. హీరో గణేశ్ వెంకట్రామన్, నిర్మాత గిరిధర్, దర్శకుడు గోవి, చిత్ర సమర్పకుడు రాజ్ కందుకూరి, సంగీత దర్శకుడు రఘు కుంచె, లైన్ ప్రొడ్యూసర్ ఎం. వెంకటసాయి సంతోష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాంబాబు కుంపట్ట, కెమేరామ్యాన్ జగదీశ్ చీకటి తదితరులు మాట్లాడారు. -
త్రిష తెలుగు పాట పాడిందోచ్!
త్రిష హీరోయిన్గా వచ్చి 13 ఏళ్లయింది. ఈ తమిళ పొణ్ణు తెలుగులో టాప్‌స్టార్‌గా ఎదిగింది. అగ్ర హీరోలు చిరంజీవి నుంచి మహేశ్‌బాబు వరకూ అందరితోనూ నటించిన ఈ భామ ఇప్పటి దాకా తెర మీద తెలుగులో గొంతు విప్పలేదు. బయట కూడా పొడి పొడి తెలుగే వచ్చు. ఇప్పటివరకూ డబ్బింగ్ చెప్పని త్రిష ఏకంగా పాటే పాడేశారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాయకి’. గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి, ఎం. పద్మజ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న నాయకి కోసం రెండు భాషల్లోనూ త్రిష పాడడం విశేషం. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున సంగీత దర్శకుడు రఘు కుంచె సారథ్యంలో త్రిష ఈ పాట రికార్డింగ్ పూర్తిచేశారు. -
పాటపాడిన నాయకి
ప్రస్తుతం టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు.. కమెడియన్లు కూడా గాయకులుగా మారిపోతున్నారు. టాప్ ఇమేజ్ ఉన్న స్టార్స్ నుంచి కొత్త తారల వరకు అందరూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. అదే బాటలో గొంతు సవరించుకుంటోంది ఓ సీనియర్ హీరోయిన్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం దాటిపోతున్న తరుణంలో కెరీర్‌ను కాపాడుకునేందుకు అన్నిరకాలుగా కష్టపడుతోంది త్రిష. కెరీర్ పెద్ద బిజీగా లేకపోయినా ఆసక్తికరమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్న త్రిష.. మరో డిఫరెంట్ పాత్రలో నాయకి సినిమాలో నటిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో భారీగా రూపొందుతున్న ఈ సినిమా కోసం గాయనిగా కూడా మారింది ఈ బ్యూటీ. ఈ సినిమా తెలుగు వర్షన్ కోసం రఘు కుంచె సంగీత సారథ్యంలో ఓ పాట పాడింది. ఇప్పటి వరకు తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకోని ఈ బ్యూటీ ఏకంగా పాట పాడేయటంతో ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. -
హీరోగా మరో హాస్యనటుడు
హాస్యనటులుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన తరువాత హీరోగా మారిన వారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అయితే ఇలా హీరోగా మారిన నటులు సక్సెస్ అయిన దాఖలాలు మాత్రం చాలా తక్కువ. ఇప్పుడు ఇదే బాటలో మరో హాస్య నటుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. సత్యం సినిమాతో కమెడియన్‌గా అందరి దృష్టిని ఆకర్షించి, ఆ తరువాత కుర్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న 'సత్యం రాజేష్' త్వరలోనే హీరోగా అలరించనున్నాడు. త్రిష లీడ్ రోల్లో నటిస్తున్న లేడి ఓరియంటెడ్ సినిమా నాయకీ సినిమా ద్వారా రాజేష్ హీరోగా మారుతున్నాడు. అయితే ఈ సినిమాలో రాజేష్, త్రిషకు జంటగా నటించడంలేదు. రెండు జంటల ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజేష్‌కు జోడిగా సుష్మారాజ్ నటించనుంది. త్రిష జోడిగా డమరుకం ఫేం వెంకట్రామన్ కనిపించనున్నాడు. 1980లలో జరిగే కథగా తెరకెక్కనున్న ఈ సినిమాను హార్రర్ జానర్లో రూపొందిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాకు గోవర్థన్ రెడ్డి దర్శకుడు. -
విద్యాబాలన్ ప్లేస్‌లో త్రిష
హీరోయిన్గా ఇక కెరీర్ ముగిసినట్టే అనుకున్న సమయంలో వరుస అవకాశాలతో సత్తా చాటుతోంది చెన్నై చంద్రం త్రిష. పెళ్లి వార్తలతో ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పినట్టే అని అభిమానులంతా భావిస్తున్న సమయంలో, నిశ్చితార్థం క్యాన్సిల్ కావటంతో మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ చేయాల్సిన పాత్రను త్రిష సొంతం చేసుకుంది. ధనుష్ హీరోగా ధురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్‌లో ఛాన్స్ కొట్టేసింది త్రిష. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తొలుత విద్యాబాలన్‌ను సంప్రదించారు. నరసింహా సినిమాలో నీలాంబరి క్యారెక్టర్ తరహాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్ర, సినిమాకు చాలా కీలకం కావటంతో, ఆ పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్యారెక్టర్లో నటించడానికి విద్యాబాలన్ ఓకె చెప్పినా ప్రెగ్నెన్సీ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో ఈ క్రేజీ ఆఫర్ చెన్నై చంద్రం త్రిష చేతికి వెళ్లింది. నాయకీ పేరుతో లేడి ఓరియంటెడ్ సినిమాలో నటిస్తున్న త్రిషకు ధనుష్ సరసన చేస్తున్న ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారు. ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో షామిలీ హీరోయిన్గా నటిస్తోంది. గ్లామర్ రోల్స్‌తో ఆకట్టుకున్న త్రిష నెగెటివ్ రోల్లో ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి. -
త్రిష అప్పటి నాయకి
హార్రర్ చిత్రాలు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. త్రిష కూడా ఆ ట్రెండ్ ఫోలో అవుతూ ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమైపోయారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాయకి’. గణేశ్ వెంకట్రామన్, సత్యం రాజేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గిరిధర్ హౌస్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోవి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరించారు. త్రిష మాట్లాడుతూ- ‘‘ఈ సినిమా దర్శకుడు గోవి అయిదు నిమిషాలు కథ చెప్పగానే హిట్ అనిపించింది. 1980లో జరిగే కథ ఇది. నా ఫేవరేట్ జోనర్ అయిన హార్రర్ చిత్రంలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. దర్శకుడు గోవి మాట్లాడుతూ- ‘‘నా కథకు తగ్గట్టుగా 18 ఏళ్ల అమ్మాయి కావాలి, అలాగే మెచ్యూర్డ్ అమ్మాయి కూడా కావాలి. ఇలా రె ండు విభిన్న కోణాలున్న పాత్రలకు ఎవరు సెట్ అవుతారా అని ఆలోచిస్తే, టక్కున త్రిష పేరు ఫ్లాష్ అయింది. ఒక త్రిష ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది’’ అని అన్నారు. ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, కెమెరా: జగదీశ్ చీకటి సంగీతం: రఘు కుంచె, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాంబాబు కుంపట్ల. -
గాయనిగా 'నాయకి'
హైదరాబాద్: హీరోయిన్ త్రిష తన గొంతు సవరించుకోనుంది. తాజాగా ఆమె నటిస్తున్న 'నాయకి' చిత్రంలో ఓ పాట పాడనుంది. ఈ మేరకు ఆ చిత్ర దర్శకుడు గోవి ఆదివారం హైదరాబాద్‌లో వెల్లడించారు. చిత్రం ప్రారంభమైన వెంటనే టైటిల్స్ పడుతున్నప్పుడు ఆమె పాడిన ఈ గీతం వినపడుతుందని తెలిపారు. ఈ పాటకు త్రిషా గొంతు ఖచ్చితంగా సరిపోతుందని నాయకి సంగీత దర్శకుడు రఘు కుంచె అభిప్రాయపడ్డారని చెప్పారు. దాంతో వెంటనే త్రిషను కలసి వివరించామని చెప్పారు. దాంతో ఆమె వెంటనే అంగీకరించారన్నారు. 1980 నాటి కథాంశంతో హరర్, కామెడీ బ్యాక్‌డ్రాప్‌తో నాయకి తెరకెక్కిస్తున్నామని తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఆక్టోబర్ నాటికి పూర్త అవుతుందని గోవి చెప్పారు. గోవి దర్శకత్వంలో లవ్ యు బంగారం చిత్రం ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. -
ఆహా అనుష్క.. ఓహో త్రిష!
బాహుబలి రెండో భాగం షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా కాస్త సమయం ఉన్నట్టుంది.. అందుకే దర్శకుడు రాజమౌళి మిగిలిన సినిమాలు ఎలా ఉన్నాయో, వాటిలో ఎవరెవరు ఎలా చేస్తున్నారో బాగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సైజ్ జీరో సినిమాలో డీ గ్లామరస్‌గా, లావుగా కనిపిస్తున్న అనుష్కను, నాయకి సినిమాలో ఒక చేత్తో కత్తి పట్టుకున్న త్రిషను ఆయన పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రస్తుతం రెండు సినిమాలు బాగా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయని రాజమౌళి ట్వీట్ చేశారు. ఆ రెండు సినిమాల పోస్టర్లు చూస్తుంటేనే ఆసక్తి కలుగుతోందన్నారు. సైజ్ జీరో సినిమాలో స్వీటీ (అనుష్క) చాలా చక్కగా ఉందని చెప్పారు. ఇక నాయకి సినిమాలో త్రిష అయితే.. ముఖంలో చిరునవ్వులు చిందిస్తూ, కుడిచేత్తో కత్తి, ఎడమ చేత్తో పూజాసామగ్రి పట్టుకుని వెళ్తున్న గెటప్ కూడా చాలా బాగుందని వ్యాఖ్యానించారు. నాయకి పోస్టర్ గురించి రాజమౌళి అంతటి దర్శకుడు ట్వీట్ చేయడంతో.. ఆ చిత్ర దర్శకుడు గోవి గోవర్ధన్ ఎంతగానో మురిసిపోయారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. Two films are creating lot of curiosity with posters itself. One is size zero..Sweety is so adorable… -
నాయకి నా కెరీర్లో కీలకం
నాయకి చిత్రం నా కెరీర్లో కీలకం అవుతుందనే నమ్మకాన్ని నటి త్రిష వ్యక్తం చేశారు. ఈమె తాజాగా నటిస్తున్న ద్విభాషా చిత్రం నాయకి ఆమె పీఏ గిరిధర్ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో జరిగింది. నవ దర్శకుడు గోవి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రానికి రాజ్కె సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, మనోబాలా, కోవై సరళ, సత్యన్రాజేష్ ముఖ్యపాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రం గురించి త్రిష మాట్లాడుతూ తనకు పీఏ గాను నాయకి చిత్రానికి నిర్మాతగాను గిరిధర్ చాలా కష్టమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారన్నారు. గత ఆరేళ్లుగా ఆయన తనకు పీఏగా పనిచేస్తున్నారని మూడేళ్ల క్రితం ఈ చిత్రం గురించి తనకు చెప్పారని అన్నారు. దర్శకుడు గోవి ఒక గంటలో నాయకి చిత్ర కథ గురించి చెప్పారన్నారు. ఆయన నెరేట్ చేసిన విధమే తనకు బాగా నచ్చిందన్నారు. ఇది హార్రర్ కామెడీ కథా చిత్రం అని తెలిపారు. పూర్తి హార్రర్ కథా చిత్రం చేయాలన్న ఆకాంక్ష చాలా కాలంగా ఉందన్నారు. అరణ్మణై -2 చిత్రం చేస్తున్నదానికి ఈ చిత్రానికి ఎలాంటి పోలికలు ఉండవన్నారు. ఇది 1980లో జరిగే కథా చిత్రం అని చెప్పారు. ఇందులో దెయ్యం హత్యలు చేస్తుందా? లేక వ్యక్తి పగ, ప్రతీకార ఇతివృత్తమా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నారు. తానిప్పటి వరకు చాలా చిత్రాలు చేశానని వాటికి భిన్నంగా చేయాలన్న భావనే ఈ నాయకి చిత్ర తెరరూపానికి కారణం అని అన్నారు. నటి నయనతార మాయ అనే హార్రర్ కథా చిత్రంలో నటిస్తున్నారు. ఆమెకు పోటీగా మీరీ చిత్రంలో నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు తానెవరితో పోటీ పడనని నయనతార నటిస్తున్న మాయ చిత్ర కథ వేరు తాను చిత్ర కథ వేరని ఈ సందర్భంగా అన్నారు. గాయని అవతారం : కాగా నటి త్రిష ఈ చిత్రం ద్వారా గాయనిగా కూడా అవతారమెత్తనుండడం విశేషం. చిత్ర సంగీత దర్శకుడు రఘుకుంచె త్రిషతో ప్రమోషన్ సాంగ్‌ను పాడించనున్నారట. దీని గురించి త్రిష వెల్లడిస్తూ రఘు కంచె పాడమని కోరడంతో సరే నన్నానని అయితే ఇంటర్వ్యూలో రెండు లైన్లు పాడడానికే చెమటలు పట్టేశాయని అలాంటిది ఈ చిత్రంలో ఎలా పాడుతానో అన్న చిన్న సంకోచం లేకపోలేదని ఆమె అన్నారు. గాయనిగా కొనసాగుతానా అన్నది ఈ చిత్రంలో పాటకు స్పందనను బట్టి ఉంటుందని ఈ చెన్నై చిన్నది త్రిష అన్నారు.