
'నాయకీ'కి పుట్టిన రోజు శుభాకాంక్షలు
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం పూర్తి చేసుకున్న త్రిష తెలుగు, తమిళ్తో పాటు బాలీవుడ్ లోనూ నటించింది. ఇటీవల కెరీర్లో లాంగ్ గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన త్రిష ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి ఫాంలో ఉంది.
33 వ ఏట అడుగుపెడుతున్న ఈ ముద్దుగుమ్మకు ఛార్మీ, పూరి జగన్నాథ్, హన్సిక, తాప్సీ, జయం రవి, సిద్దార్థ్, రాధిక లాంటి సౌత్ స్టార్స్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న నాయకీ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్కు రెడీ అవుతుండగా, మరో మూడు చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.
Happiest Bday my partner in crime @trishtrashers