త్రిష పాట వింటారా.. | 'Thankyou so much my friend' tweets Trisha | Sakshi
Sakshi News home page

త్రిష పాట వింటారా..

Published Mon, Apr 11 2016 7:14 PM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

త్రిష పాట వింటారా..

త్రిష పాట వింటారా..

అడపాదడపా సినీ హీరోలు తమ గొంతు సవరించుకుని పాటలు పాడుతుంటారు. ఈ మధ్య కాలంలో అయితే అలాంటి పాటలు చాలానే ఉన్నాయి. సినిమా ప్రమోషన్స్ లో ఆ పాటల వీడియోలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇక ఇప్పుడు హీరోయిన్ల వంతు. తాజాగా నాజూకు అందాల సుందరి త్రిష  'నాయకి' సినిమా కోసం తొలిసారి తెలుగులో ఓ పాట పాడింది. ఎప్పుడెప్పుడు ఆమె గాత్రాన్ని విందామా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం యూ ట్యూబ్ లో ఆ పాట అలరించనుంది. 'నాయకి' కోసం స్వయంగా త్రిష పాడిన పాటను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్... యూ ట్యూబ్ ద్వారా రిలీజ్ చేశారు. రఘుకుంచె, సాయి కార్తీక్ లు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. 
 
పాటను లాంచ్ చేసినందుకు మురిసిపోతూ 'థాంక్యూ మై ఫ్రెండ్.. బిగ్ బిగ్ బిగ్ హగ్' అంటూ పూరీని ఉద్దేశించి ట్వీట్ చేసింది మన నాయకి. త్రిష గొంతు విన్న పూరీ 'లవ్ యువర్ వాయిస్' అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు.  మరి మీరూ వినేయండి..
 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement