దానికి ఓ కారణం ఉంది: త్రిష | 'I will personally make sure it is explained soon' tweets Trisha | Sakshi
Sakshi News home page

దానికి ఓ కారణం ఉంది: త్రిష

Published Thu, Sep 15 2016 7:22 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

దానికి ఓ కారణం ఉంది: త్రిష

దానికి ఓ కారణం ఉంది: త్రిష

'నేను నా సినిమా గురించి మాట్లాడకపోవడం, ప్రమోషన్లో పాల్గొనకపోవడం వెనుక విలువైన కారణాలున్నాయి. నన్ను ప్రశ్నలు అడుగుతున్న మీడియా స్నేహితులకు, అభిమానులకు నా క్షమాపణలు. త్వరలో నేను వ్యక్తిగతంగా అన్ని విషయాలను వివరిస్తాను. మీరందించిన సపోర్ట్ కు, చూపిస్తున్న ప్రేమకు నా ధన్యవాదాలు' అంటూ హీరోయిన్ త్రిష ట్వీట్ చేసింది.

ఇంతకీ ఈ చెన్నై చిన్నది దేని గురించి మాట్లాడుతుంది అంటే... 'నాయకి' సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండటం గురించి. త్రిష ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో హారర్ కామెడీగా 'నాయకి' రిలీజైన సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్లకు ఆమె డేట్స్ ఇవ్వలేదు సరి కదా.. మొత్తం ప్రచారానికి దూరంగా ఉంది. దీంతో చిత్ర అపజయంలో పరోక్షంగా తను కూడా ఓ కారణమంటూ వినిపిస్తున్న వార్తలకు ఆమె ఆలస్యంగా స్పందించింది.

త్రిషకు మేనేజర్‌గా వ్యవహరించిన గిరిధర్‌ నిర్మాతగా మారి 'నాయకి' సినిమాను తీశారు. గోవి దర్శకత్వం వహించిన ఈ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కావడం, త్రిష ప్రమోషన్లకు దూరంగా ఉండటంతో.. కావాలిసినంత ప్రచారం లభించక సినిమా ఆశించినంత విజయం సాధించలేదనేది త్రిషపై వినిపిస్తున్న ఫిర్యాదులు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement