విద్యాబాలన్ ప్లేస్లో త్రిష | trisha replaces vidya balan in dhanush new film | Sakshi
Sakshi News home page

విద్యాబాలన్ ప్లేస్లో త్రిష

Published Tue, Nov 3 2015 12:28 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 AM

విద్యాబాలన్ ప్లేస్లో త్రిష

విద్యాబాలన్ ప్లేస్లో త్రిష

హీరోయిన్గా ఇక కెరీర్ ముగిసినట్టే అనుకున్న సమయంలో వరుస అవకాశాలతో సత్తా చాటుతోంది చెన్నై చంద్రం త్రిష. పెళ్లి వార్తలతో ఇక సినిమాలకు గుడ్బై చెప్పినట్టే అని అభిమానులంతా భావిస్తున్న సమయంలో,  నిశ్చితార్థం క్యాన్సిల్ కావటంతో మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ చేయాల్సిన పాత్రను త్రిష సొంతం చేసుకుంది.

ధనుష్ హీరోగా ధురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్లో ఛాన్స్ కొట్టేసింది త్రిష. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తొలుత విద్యాబాలన్ను సంప్రదించారు. నరసింహా సినిమాలో నీలాంబరి క్యారెక్టర్ తరహాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్ర, సినిమాకు చాలా కీలకం కావటంతో, ఆ పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్యారెక్టర్లో నటించడానికి విద్యాబాలన్ ఓకె చెప్పినా ప్రెగ్నెన్సీ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

దీంతో ఈ క్రేజీ ఆఫర్ చెన్నై చంద్రం త్రిష చేతికి వెళ్లింది. నాయకీ పేరుతో లేడి ఓరియంటెడ్ సినిమాలో నటిస్తున్న త్రిషకు ధనుష్ సరసన చేస్తున్న ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారు. ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో షామిలీ హీరోయిన్గా నటిస్తోంది. గ్లామర్ రోల్స్తో ఆకట్టుకున్న త్రిష నెగెటివ్ రోల్లో ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement