పాటపాడిన నాయకి | Trisha Ready to Sing A song in nayaki | Sakshi
Sakshi News home page

పాటపాడిన నాయకి

Published Wed, Mar 9 2016 2:12 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

పాటపాడిన నాయకి

పాటపాడిన నాయకి

ప్రస్తుతం టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు.. కమెడియన్లు కూడా గాయకులుగా మారిపోతున్నారు. టాప్ ఇమేజ్ ఉన్న స్టార్స్ నుంచి కొత్త తారల వరకు అందరూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. అదే బాటలో గొంతు సవరించుకుంటోంది ఓ సీనియర్ హీరోయిన్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం దాటిపోతున్న తరుణంలో కెరీర్ను కాపాడుకునేందుకు అన్నిరకాలుగా కష్టపడుతోంది త్రిష.

కెరీర్ పెద్ద బిజీగా లేకపోయినా ఆసక్తికరమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్న త్రిష.. మరో డిఫరెంట్ పాత్రలో నాయకి సినిమాలో నటిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో భారీగా రూపొందుతున్న ఈ సినిమా కోసం గాయనిగా కూడా మారింది ఈ బ్యూటీ. ఈ సినిమా తెలుగు వర్షన్ కోసం రఘు కుంచె సంగీత సారథ్యంలో ఓ పాట పాడింది. ఇప్పటి వరకు తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకోని ఈ బ్యూటీ ఏకంగా పాట పాడేయటంతో ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement