మోహినిగా త్రిష, దెయ్యమా..? దేవతా..? | trisha mohini movie first look | Sakshi
Sakshi News home page

మోహినిగా త్రిష, దెయ్యమా..? దేవతా..?

Published Wed, Oct 19 2016 10:13 AM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

మోహినిగా త్రిష, దెయ్యమా..? దేవతా..?

మోహినిగా త్రిష, దెయ్యమా..? దేవతా..?

సీనియర్ హీరోయిన్ త్రిష ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి పీటల దాకా వెళ్లి వెనక్కి వచ్చిన ఈ బ్యూటి రీ ఎంట్రీ మరింత జోరు చూపిస్తోంది. విజయాలు సాధించటంలో వెనకపడుతున్నా... అందాలతో ఆకట్టుకోవటంలో మాత్రం కుర్ర హీరోయిన్ లకు కూడా పోటీ వస్తోంది. ఇటీవల హార్రర్ జానర్ లో తెరకెక్కిన అరణ్మనై 2, నాయకీ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది త్రిష.

ఈ రెండు సినిమాలు ఆశించిన స్ధాయి ఫలితాలు ఇవ్వకపోయినా మరోసారి అదే జానర్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. మోహిని పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో టైటిల్ రోల్ లో నటిస్తోంది ఈ చెన్నై బ్యూటి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విఠలాచార్య సినిమాల్లో దెయ్యాలు వేసే తరహా స్కిన్ టైట్ డ్రెస్ లో తలపై కిరీటం, ఎనిమిది చేతులలో ఆయుధాలు.. చూస్తుంటే.. ఈజిప్ట్ దేవతలా కనిపిస్తోంది.

ఎక్కువ భాగం లండన్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాకు ఆర్ మాదేష్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్రిష కెరీర్ కు మంచి బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాతో పాటు ధనుష్ హీరోగా తెరకెక్కిన కోడి సినిమాలోనూ నటిస్తోంది ఈ బ్యూటి. మరి ఈ సినిమాలైనా త్రిషకు బ్రేక్ ఇస్తాయేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement