10న తెరపైకి నాయకి | Trisha 'Nayaki' On June 10th | Sakshi
Sakshi News home page

10న తెరపైకి నాయకి

Published Sat, May 21 2016 2:02 AM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

10న తెరపైకి నాయకి

10న తెరపైకి నాయకి

ఎవర్‌గ్రీన్ హీరోయిన్ త్రిష జూన్ 10వ తేదీన నాయకిగా తెరపైకి రానున్నారన్న విషయం ఆమె అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఎన్నైఅరిందాల్,భూలోకం,తూంగావనం వంటి వరుస విజయాలు కథానాయకిగా త్రిష స్థానాన్ని సుస్థిరం చేశాయని చెప్పవచ్చు.ఆ తరువాత వచ్చిన అరణ్మణై-2 చిత్రం పెద్దగా విజయం సాధించక పోయినా త్రిష క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.తాజాగా నటిస్తున్న నాయకి చిత్రంపై ఇటు కోలీవుడ్‌లోనూ అటు టాలీవుడ్‌లో మంచి అంచనాలే నెలకొన్నాయి.

కారణం త్రిష ఇందులో తొలి సారిగా ద్విపాత్రాభినయం చేయడం.ఇది లేడీ ఓరియెంటెడ్ హారర్ కథా చిత్రం కావడం లాంటి పలు విశేషాలు చోటు చేసుకోవడం అని పేర్కొనవచ్చు.తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిషకు జంటగా గణేశ్‌వెంకట్రామ్ నటించారు.ఇతర ముఖ్య పాత్రల్లో సుష్మాస్వరాజ్,మనోబాలా,కోవైసరళ,జయప్రకాశ్ తదితరులు నటించారు.

టాలీవుడ్ దర్శకుడు గోవి దర్శకత్వం వహించిన నాయకి చిత్రం జూన్ 10వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోందని సినీ వర్గాల సమాచారం.ప్రస్తుతం త్రిష ధనుష్ సరసన కొడి చిత్రంలో నటిస్తున్నారు.దీని తరువాత మరో హారర్ చిత్రంలో ఇంకోసారి ద్విపాత్రాభినయం చేయడానికి  సిద్ధం అవుతున్నారు.అధిక భాగం విదేశాలలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి మాదేష్ దర్శకత్వం వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement