హీరోగా మరో హాస్యనటుడు | comedian satyam rajesh turns hero | Sakshi
Sakshi News home page

హీరోగా మరో హాస్యనటుడు

Published Tue, Dec 8 2015 9:15 AM | Last Updated on Sun, Sep 3 2017 1:42 PM

హీరోగా మరో హాస్యనటుడు

హీరోగా మరో హాస్యనటుడు

హాస్యనటులుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన తరువాత హీరోగా మారిన వారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అయితే ఇలా హీరోగా మారిన నటులు సక్సెస్ అయిన దాఖలాలు మాత్రం చాలా తక్కువ. ఇప్పుడు ఇదే బాటలో మరో హాస్య నటుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. సత్యం సినిమాతో కమెడియన్గా అందరి దృష్టిని ఆకర్షించి, ఆ తరువాత కుర్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న 'సత్యం రాజేష్' త్వరలోనే హీరోగా అలరించనున్నాడు.

త్రిష లీడ్ రోల్లో నటిస్తున్న లేడి ఓరియంటెడ్ సినిమా నాయకీ సినిమా ద్వారా రాజేష్ హీరోగా మారుతున్నాడు. అయితే ఈ సినిమాలో రాజేష్, త్రిషకు జంటగా నటించడంలేదు. రెండు జంటల ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజేష్కు జోడిగా సుష్మారాజ్ నటించనుంది. త్రిష జోడిగా డమరుకం ఫేం వెంకట్రామన్ కనిపించనున్నాడు. 1980లలో జరిగే కథగా తెరకెక్కనున్న ఈ సినిమాను హార్రర్ జానర్లో రూపొందిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాకు గోవర్థన్ రెడ్డి దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement