నాయకీ... సందడే లేదు | trisha next movie nayaki update | Sakshi
Sakshi News home page

నాయకీ... సందడే లేదు

Published Tue, Jun 28 2016 4:03 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

నాయకీ... సందడే లేదు

నాయకీ... సందడే లేదు

ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన త్రిష, రీ ఎంట్రీలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతోంది. పెళ్లి ఆగిపోవటంతో తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టిన చెన్నై చిన్నది మంచి కమర్షియల్ హిట్ ఇవ్వటంలో మాత్రం ఫెయిలవుతోంది. ఒక్క లయన్ తప్ప రీ ఎంట్రీలో ఈ బ్యూటి నటించిన ఏ సినిమా కూడా భారీ కమర్షియల్ హిట్ అనిపించుకోలేకపోయింది.

తాజాగా రూట్ మార్చిన ఈ బ్యూటి గ్లామర్ రోల్స్ను పక్కన పెట్టి లేడి ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. చాలా కాలంగా తన దగ్గర మేనేజర్గా పనిచేస్తున్న గిరిధర్ నిర్మాణంలో నాయకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 8న రిలీజ్కు రెడీ అవుతోంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రం వేగం పెంచలేదు. ఇప్పటికే ఆడియో రిలీజ్ అయినా మీడియాలో నాయకీ సందడి కనిపించటం లేదు. చీకటి రాజ్యం సినిమా తరువాత వెండితెర మీద కనిపించని త్రిష నాయకీ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది. కానీ చిత్రయూనిట్ ప్రమోషన్ విషయంలో వ్యవహరిస్తున్న తీరుతో త్రిష గుర్రుగా ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement