రంజాన్‌కు నాయకి? | Trisha Starrer Nayaki Release Date Revealed? | Sakshi
Sakshi News home page

రంజాన్‌కు నాయకి?

Published Sun, Jun 26 2016 2:14 AM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

రంజాన్‌కు నాయకి?

రంజాన్‌కు నాయకి?

రంజాన్ పండుగ సందర్భంగా నాయకి చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నట్లు తాజా సమాచారం. ఇప్పటి వరకూ అధికంగా హీరోల చుట్టూ తిరుగుతూ డ్యూయెట్లకే పరిమితమైన త్రిష తాజాగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల నాయకిగా మారిపోయారు. ఈ చెన్నై చిన్నది ఇటీవలే మోహినీ అవతారమెత్తి లండన్‌లో షూటింగ్ చేసొచ్చారు.
 
 ఇది క్రైమ్ థ్రిల్లర్ ఇతివృత్తంతో కూడిన హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం. అంతకు ముందే నాయకి చిత్రంలో నటించారు. ఇదీ ఆ తరహా హారర్ కథా చిత్రమే. ఇందులో చెన్న చిన్నది త్రిష ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఒక పాత్ర వినోదభరితంగా, మరో పాత్ర రౌద్రభరితంగానూ ఉంటాయట. ఈ రెండు పాత్రలకు చక్కని వేరియేషన్స్ చూపిస్తూ చెన్నై చిన్నది సూపర్‌గా నటించారట.
 
  తన మేనేజర్ తమిళం, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ హక్కుల్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ పొందినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని రంజాన్ పండగ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
Advertisement