సాక్షి, విజయవాడ: సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల థియేటర్ల యజమానులు పాల్గొన్నారు. ఆన్‌లైన్ టికెట్ విధానం, సినిమాటోగ్రఫీ చట్టంలోని సవరణలపై చర్చ జరిపారు. అన్ని సినిమాలపై టికెట్ ధర ఒకే విధంగా ఉండేలా కొత్త విధానం, థియేటర్ల సమస్యలపైన సమావేశంలో చర్చించారు.
ఆన్‌లైన్ టికెట్ విధానానికి అందరూ అంగీకారం: అంబికా కృష్ణ
ఆన్‌లైన్ టికెట్ విధానానికి అందరూ అంగీకరించారని అంబికా కృష్ణ తెలిపారు. చిన్న ఊర్లలోని థియేటర్లలో గ్రేడింగ్ సిస్టమ్ పెట్టాలని థియేటర్ యజమానులకు మంత్రి పేర్ని నాని సూచించారని ఆయన తెలిపారు
చదవండి: హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment