డిజిఫై...
ఇదో ఫైల్ షేరింగ్ అప్లికేషన్. డ్రాప్‌బాక్స్‌తో కలిసి పనిచేస్తుంది. మామూలుగానైతే డ్రాప్‌బాక్స్‌లోకి ఫైల్స్ వేసిన తరువాత వాటిని నియంత్రించలేము. డిజిఫైతో ఈ ఇబ్బంది ఉండదు. ఎవరెవరు ఫైల్స్ చూశారు... ఎవరు మార్పులు చేర్పులు చేశారు. ఎంతకాలంపాటు ఫైల్స్ డ్రాప్‌బాక్స్‌లో అందరికీ కనిపించేలా ఉంచాలి? వంటి ఫీచర్లను మీరు కంట్రోల్ చేయవచ్చు. వీటితోపాటు ఫైల్‌ను కొంతకాలం తరువాత తనంతట తానే నాశనమై పోయేలా కూడా చేయవచ్చు.
అన్ క్లౌడెడ్...
స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లలోని మెమరీతోపాటు క్లౌడ్ మెమరీ వాడకం కూడా పెరిగిపోతున్న రోజులివి. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల మెమరీ మాదిరిగానే క్లౌడ్ మెమరీని కూడా శుభ్రం చేసుకునేందుకు ఒక అప్లికేషన్ కావాలి. అన్ క్లౌడెడ్ అచ్చంగా ఇదే పని చేస్తుంది. క్లౌడ్ మెమరీలో ఎక్కువ మోతాదు ఉపయోగిస్తున్న ఫైల్స్ ఏవి? ఫోల్డర్లు ఎన్ని ఉన్నాయి? వాటిలోని ఫైళ్ల పరిస్థితి ఏమిటన్నది తెలుసుకునేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా క్లౌడ్ మెమరీకి సంబంధించినంతవరకూ ఇదో సెర్చ్ ఇంజిన్‌లా, ఫైల్స్ మేనేజర్‌లా, ఎక్స్‌ప్లోరర్‌లానూ పనికొస్తుంది ఈ అన్ క్లౌడెడ్ అప్లికేషన్.
‘డ్రాప్‌బాక్స్’ అప్‌డేట్ అయ్యింది..!
ఐ డివైజ్‌ల రూపురేఖలను మార్చేసిన ఐఓఎస్8కి అనుగుణంగా అప్లికేషన్లు కూడా అప్‌డేట్ అవుతున్నాయి. ఐ డివైజ్‌లను వాడే వారికి ఎంతో సౌకర్యమైన డ్రాప్‌బాక్స్ అప్లికేషన్‌తో ఈ అప్‌డేషన్ మొదలైంది. ఫైల్‌షేరింగ్ విషయంలో సౌకర్యంగా ఉండే డ్రాప్‌బాక్స్ అప్లికేషన్‌ను ఐఓఎస్8 ఫీచర్లకు అనుగుణంగా మార్చారు. తాజాగా ఈ అప్లికేషన్‌లో కొత్త సదుపాయాలు రావడంతో పాటు నోటిఫికేషన్‌ల ఫీచర్‌ను కూడా మొదలు పెట్టారు. ఈ నోటిఫికేషన్ ఫీచర్ ద్వారా డ్రాప్‌బాక్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్‌లోని మార్పునకు అనుగుణంగా అప్లికేషన్లను కూడా అప్‌డేట్ చేసుకోవాలని భావించే వారు ఈ మార్పును స్వాగతించవచ్చు.
భలే ఆప్స్
Published Wed, Sep 24 2014 11:21 PM | Last Updated on Tue, Oct 2 2018 4:01 PM
Advertisement
Advertisement