మనిషిని అధిగమించిపోనున్న కృత్రిమ మేధస్సు | aakar patel writes on computers | Sakshi
Sakshi News home page

మనిషిని అధిగమించిపోనున్న కృత్రిమ మేధస్సు

Published Sun, Apr 30 2017 12:57 AM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

మనిషిని అధిగమించిపోనున్న కృత్రిమ మేధస్సు

మనిషిని అధిగమించిపోనున్న కృత్రిమ మేధస్సు

అవలోకనం
రాబోయే 25 ఏళ్లలో అన్ని విధాలా మనిషిని మించిన మేధస్సు గల కంప్యూటర్లు ప్రవేశిస్తాయని అంచనా. ప్రస్తుతం, కంప్యూటర్‌ మేధస్సు మనిషి కంటే వేగంగా తనను తాను మెరుగుపరు చుకుంటోంది. ఆ తర్వాత దాని మెరుగుదల వేగం విస్ఫోటనాత్మకమైనదిగానే ఉంటుంది. ఆవిర్భవించనున్న ఆ మహా మేధస్సు ఏ విధంగా పురోగమిస్తుందో మనకు ఎలాంటి అంచనా లేదు. కాకపోతే అది ఉద్దేశపూర్వకంగా మనకు హాని చేయాలనుకోకపోవచ్చని ఊహిస్తున్నారు. కానీ, తనను తాను మెరుగుపరుచుకునే క్రమంలో అది మనల్ని విస్మరిస్తుంది. అలా జరిగితే ఎలా?

ప్రపంచంలోకెల్లా అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన అమెరికా విచిత్రమైన ఒక సమస్య గురించి చర్చిస్తోంది. దాని గురించి పుస్తకాలు రాస్తున్నారు, ఉపన్య సిస్తున్నారు (యూట్యూబ్‌ ద్వారా అవి అందుబాటులో ఉన్నాయి). కానీ ఆ సమస్యకు సంబంధించి ఎలాంటి చర్యా తీసుకోలేదు. త్వరలోనే తగు చర్యను చేపడతారని ఆశిస్తున్నారు.  

కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) మనిషి కంటే తెలివైనదిగా మారుతుండటమే ఆ సమస్య. భారత్‌లోని మనకు అదేమీ అంతగా ఆలోచిం చాల్సిన సమస్య కాదనిపిస్తోంది. మనకు కంప్యూటర్లంటే మన అదుపులో ఉండే ఉపకరణాలు. ల్యాప్‌టాప్‌ లేదా మొబైల్‌ఫోన్‌ మన చేతిలోని పనిముట్టు, మన సేవకుడు. అంతేగానీ అది మన యజమాని కాదు. అయితే అమెరికాలో సాంకేతిక పరిజ్ఞాన రంగంలో కృషిచేస్తున్న అత్యంత బుద్ధిశాలురైన కొందరు మాత్రం... కృత్రిమ మేధస్సు, అంటే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లు మానవుని ఆలోచనా శక్తిని అధిగమించిపోతే ఏమి జరుగుతుందని యోచిస్తున్నారు.

రెండు కారణాల రీత్యా వారు ఈ సమస్యను గురించి ఆలోచిస్తున్నారు. ఒకటి, ‘మేధస్సు’ అంటే ఏమిటనే విషయంలో ఏకాభిప్రాయం ఉంది. మనిషి మెదడు పని చేసే తీరుకు సంబంధించి అంతుబట్టనిది ఏదీ లేదు. శాస్త్రీయ, జీవ శాస్త్ర సంబంధ పదజాలంతో ఆలోచనను అతి కచ్చితంగా వివరించవచ్చు. మేధస్సు అంటే సమాచారమూ, దానితో ఏమి చేయగలమో తెలుసుకోగల శక్తి. గత 20 ఏళ్లలో, ప్రత్యేకించి గత మూడేళ్లలో మేధస్సు విషయంలో కంప్యూటర్లు బాగా మెరుగుపడ్డాయి.

అమెరికాలోని స్వయం చోదక కార్లను అందుకు అత్యంత ప్రాథమిక స్థాయి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పూర్తి స్వతంత్రమైన కారు ఆవిష్కరణకు రెండేళ్లకు మించి పట్టకపోవచ్చని అంచనా. అంటే, కార్లో కూర్చున్నాక మీరు హాయిగా నిద్రపోవచ్చు లేదా పేపర్‌ చదువుకోవచ్చు. కారే మిమ్మల్ని మీ గమ్యానికి చేరుస్తుంది.  మనం చేయగల అన్ని పనులను... ఇంజన్‌ను స్టార్ట్‌ చేయడం, గేర్లను మార్చడం, అవసరమైతే బ్రేక్‌ వేయడం, వేగం పెంచడం అదే చేసేస్తుంది. అంతే కాదు, మనం చేయలేని పనులను కూడా చేస్తుంది. మానవులకు సాధ్యంకాని స్థాయిలో అది ముందు, వెనుక, పక్కల ఉన్న ముప్పులను కనిపెట్టగలుగుతుంది. ఇంధన వినియోగం అత్యుత్తమంగా ఉండేలా కారు వేగాన్ని అభిలషణీయంగా నియంత్రించగలుగుతుంది. ఇతర కార్లతో అనుసంధానం కావడం ద్వారా రోడ్డుకు వందల కిలోమీటర్ల ముందూ, వెనుకా ఉన్న రహదారి పరిస్థితులను అది తెలుసు కోగలుగుతుంది. ఇది నేను ముందే చెప్పినట్టుగా అత్యంత ప్రాథమిక స్థాయిలోని కంప్యూటర్‌ మేధ ఇప్పటికే చేయగలుగుతున్న పనులకు ఉదాహరణ.

కృత్రిమ మేధస్సు మెరుగుపడుతూనే ఉంటుంది, మరింత వేగంగా మెరుగు పడుతుంది. ఎందుకు? మనషులమైన మనకు చాలా సమస్యలను పరిష్కరించ డానికి సాంకేతికత అవసరం. వ్యాధులకు చికిత్సను కనిపెట్టడం నుంచి వ్యాపార వ్యవస్థల అభివృద్ధి వరకు సాంకేతికత సహాయం మనకు అవసరం. ఆధునిక ప్రపంచంలో ప్రతి దానికీ కంప్యూటర్‌ మేధస్సును ఉపయోగించడం అవసరమౌ తోంది. ఈ పరిస్థితి మారబోవడమూ లేదు. ఈ కంప్యూటర్‌ మేధో విస్పోటన వేగంతో సమానంగా మానవ మే«ధ విక సించలేకపోతుందని అంగీకరించడం మొదలైంది. ఎందువల్ల? మన మెదడు పరి మాణం స్థిరమైనది, మనకు గుర్తుంచుకునే, ఆలోచించే శక్తినిచ్చే మెదడులోని సెరిబ్రల్‌ కార్టెక్స్, సహాయక పదార్ధాలు పరిమిత మొత్తంలోనే ఉంటాయి.
 
కృత్రిమ మేధస్సుకు అలాంటి పరిమితులేవీ లేవు. పెద్ద భవనం అంతటి కంప్యూటర్‌ మేధస్సును నిర్మించడం సాధ్యమే. కాకపోతే దానివల్ల మనం వూహిం చని ప్రమాదాలు ముంచుకు రావచ్చని భావిస్తున్నారు.  అలాంటి అంత పెద్ద లేదా శక్తివంతమైన కంప్యూటర్‌ను ఎవరైనా ఎందుకు  నిర్మిస్తారనేదే ప్రశ్న. సాంకేతిక పురోగతి విషయంలోనే కంపెనీలు, సైన్యాలు ప్రపంచ స్థాయిలో పోటీ పడుతు న్నాయి అనేదే అందుకు సమాధానం. కొంత కాలం క్రితమే ప్రారంభమైన ఈ పోటీ విరామం లేకుండా కొనసాగుతూనే ఉంటుంది. మరింత తెలివైన, మరింత శక్తివంతమైన, మరింత మేధోశక్తి కలిగిన కంప్యూటర్లను, కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ లను కార్పొరేషన్లు, సైన్యాలు నిర్మిస్తూనే ఉంటాయి. మనిషి ఈ కృత్రిమ మేధ స్సుతో సమానంగా సాగలేడు కాబట్టి దానికి స్వయం ప్రతిపత్తిని ఇవ్వాల్సి వస్తుంది. ఇరవై ఏళ్ల క్రితం, ప్రపంచంలోని అత్యుత్తమ చదరంగం క్రీడాకారుడు గారీ కాస్పరోవ్‌ ఒక కంప్యూటర్‌ చేతిలో ఓడిపోయాడు. గత రెండు దశాబ్దాలలో కంప్యూటర్లు చాలా చాలా ఎక్కువ రెట్లు తెలివైనవిగా మారాయి.

ఇంచుమించు రాబోయే 25 ఏళ్ల కాలంలో అన్ని విధాలా మనిషిని మించిన మేధస్సు గల కంప్యూటర్లు అందుబాటులోకి వస్తాయని అంచనా. ప్రస్తుతం, కంప్యూటర్‌ మేధస్సు మనిషి కంటే వేగంగా తనను తాను మెరుగుపరచుకుం టోంది. ఆ తర్వాత దాని మెరుగుదల వేగం విస్ఫోటనాత్మకమైనదిగా ఉంటుంది. మానవులకు ఉండే జీవ–రసాయనిక ప్రక్రియల పరమైన పరిమితులు కంçప్యూ టర్లకు లేవు. కాబట్టి అవి మనకంటే వేగంగా సమాచారాన్ని విశ్లేషిస్తాయి.

ఆ మహా మేధస్సు ఆవిర్భవించాక అది ఏ విధంగా పురోగమిస్తుందనే విష యంపై మనకు ఎలాంటి అంచనా లేదు. కాకపోతే ఆవిర్భవించనున్న ఆ మహా మేధస్సు దుర్మార్గమైనది కాకపోవచ్చునని ఊహిస్తున్నారు. అంటే అది ఉద్దేశ పూర్వకంగా మనకు హాని చేయాలని కోరుకోకపోవచ్చునని అర్థం. కానీ, తనను తాను మెరుగుపరుచుకునే క్రమంలో అది మనల్ని విస్మరిస్తుంది. అలా జరగడం గురించే అమెరికాలో వాళ్లు ఆలోచిస్తున్నది. అది మనం సైతం ఎంతో కాలం విస్మ రించలేని సమస్య.


వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
ఆకార్‌ పటేల్‌
aakar.patel@icloud.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement