సంస్కరణ మిథ్య.. హిందుత్వ ఎజెండా సత్యం?
అవలోకనం
ద ఎకానమిస్ట్ మోదీపై చెప్పిన తీర్పు నిజమైతే, మనం మనకున్న కొద్దిపాటి ఆర్థిక సానుకూలతలను కోల్పోయిన తరుణంలో ఉన్నాం. ఆ పత్రిక వేలెత్తి చూపిన సమస్యలలో కొన్నింటి విషయంలోనైనా ప్రభుత్వం తన తప్పులను కాకున్నా, బలహీనతలనైనా అంగీకరించడం సహాయకరంగా ఉంటుంది. దురదృష్టవశాత్తూ అది జరుగుతున్నట్టుగా కనబడటం లేదు.
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళుతున్న ఈ వారంలో ‘ద ఎకానమిస్ట్’ పత్రిక ఆయనకు రుచించని ప్రతి కూలమైన ముఖచిత్ర కథనాన్ని ప్రచురించింది. అది, వ్యాపార వర్గాలకు అనుకూలమైన, మితవాద వార పత్రిక. అందువలన ఆ కథనానికి ప్రాముఖ్యత ఉంది. ఆర్థిక వ్యవ హారాలకు సంబంధించి ప్రపంచ నేతలు ఆ పత్రికను ప్రామాణికమైనదిగా చూస్తారు, తొందరపడి నిర్ధారణలు చేయదని భావిస్తుంటారు. కాబట్టి దాని వ్యాఖ్యలు, ప్రత్యే కించి మోదీపై చేసిననవి ఆయనకు నష్టాన్ని కలిగించేవి.
ఆ కథనానికి వేసిన ముఖ చిత్రం కొంత అసమంజ సమైనదనీ, మోదీ, భారత్‌ల పట్ల మరీ కటువుగా ఉన్నదని నా అభిప్రాయం. ముఖ చిత్ర పుటపై కాగితపు పులిపై స్వారీ చేస్తున్న మోదీ చిత్రం, దానిమీద ‘‘మోదీ భారతం: భ్రమా త్మక సంస్కరణ’’ అనే శీర్షిక ఉంది. ఆ కథనంలో చాలా ఆరో పణలు ఉన్నాయి. సంస్కర్తకాగల సామర్థ్యం మోదీకి లేదని దానికి నమ్మకం ఏర్పడటం అన్నిట్లోకీ బాగా చెరుపు చేసేది.
‘‘ఆర్థిక వ్యవస్థకు పగ్గాలు వేసి ఉంచుతున్న మౌలిక సమ స్యల పరిష్కారం కోసం ఒక క్రమపద్ధతిలో కృషి చేయడా నికి సంబంధించి (మోదీ) పనితీరు ఏమంత బాగా లేదు’’ అని ఆయన రికార్డు చెబుతోందని అది భావిస్తోంది. క్రమ పద్ధతికి బదులుగా ‘‘వ్యాపార సంస్థలను వాటి సమస్యల నుంచి గట్టెక్కించడం.. ఫలానా ఫ్యాక్టరీకి భూమిని వెతికి పెట్టడం, లేదా ఓ విద్యుత్ కేంద్ర నిర్మాణం వేగంగా జరి గేలా చూడటం వంటి పనులే వ్యాపారానికి అనుకూలునిగా ఆయనకున్న ప్రతిష్టంతటికీ మూలం.’’
ప్రస్తుతం ఆయన, తన పాలన నాలుగో ఏట అమలు లోకి తెస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వంటి భావనలు చాలా వరకు మునుపటి ప్రభుత్వల కృషి ఫలితాలే తప్ప, ఆయన సొంతం కావనేదాన్ని అది అందుకు నిదర్శనంగా చూపింది. మోదీ శక్తిమంతమైన వారని ఆ పత్రిక అంగీ కరిస్తోంది గానీ, ‘‘వస్తు తయారీ నుంచి మరుగుదొడ్ల నిర్మాణం వరకు ప్రతిదాని గురించి ఆర్భాటపు పథకాలను ప్రారంభించడం’’లో ఆయన తలమునకలై ఉన్నారు.
ధైర్య వంతుడే అయినా దిశంటూ లేని వారు. పెద్ద నోట్ల రద్దు ‘‘ధైర్యం’’తో కూడిన చర్యేగానీ, ‘‘ఆరోగ్యకరమైన ఆర్థిక విధానం’’ కాదు, ఆ విషయంలో ‘‘ప్రణాళిక లోపించడం, అస్పష్టమైన లక్ష్యాలు అంటే ఆ చర్య ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసిందనే అర్థం. ‘‘ప్రభుత్వం ‘ఏదో చేస్తున్నట్టు’ రుజువు చేసుకోవాలనే లక్ష్యాలతో మరిన్ని తప్పుడు నిర్ణయాలను తీసుకోవచ్చు’’ అని ఆ పత్రిక భయాలు వ్యక్తం చేసింది.
దృష్టి కేంద్రీకరణ, వ్యూహం కొరవడటం అంటే మూడేళ్ల క్రితం కంటే ఆర్థిక వ్యవస్థ తక్కువ వేగంగా వృద్ధి చెందుతోందని అర్థం. ‘‘క్లుప్తంగా చెప్పాలంటే మోదీ సువర్ణా వకాశాన్ని చేజార్చుకోవడం’’ వల్ల చమురు ధరలు తక్కు వగా ఉండటం, యువ జనాభా ఉండటం అనే అనుకూలత లను మనం కోల్పోయాం.ప్రభుత్వ రికార్డుకు సంబంధించి తీవ్ర నిరాశామయ పరిస్థితుల్లో ఆశలురేపే అంశాలు పెద్దగా లేవు.
మోదీ ‘‘ఆర్థిక సంస్కర్త ముసుగులోని హిందూ మత త్వవాదా లేక హిందూ మతతత్వవాది ముసుగులోని ఆర్థిక సంస్కర్తా’’అనే ప్రశ్నకు సమాధానం దొరికిందని ‘ద ఎకా నమిస్ట్’ నిర్ధారణకు వచ్చేసింది. ‘‘ఆయన ఆర్థిక నిపుణునిగా కంటే ఎక్కువగా (మత) దురహంకారి’’ అని విశ్వసిస్తోంది. ప్రభుత్వం ‘‘వేగంగా వృద్ధి చెందుతున్న గొడ్డు మాంసం ఎగుమతుల వ్యాపారంలో ఉపద్రవాన్ని సృష్టించడం’’ను అది అందుకు నిదర్శనంగా చూపింది.
ఆ తర్వాత అది ప్రత్యేకించి గట్టి భాషను ప్రయోగిం చింది. అది ప్రభుత్వంలోని పలువురికి, దాని మద్దతుదార్లకు ఆందోళన కలిగించేది. ‘‘మోదీ పాలనలో, ప్రభుత్వ విధానం పైన, ప్రత్యేకించి మత సంబంధాలపైన చర్చ క్షీణించి పోయింది. హిందూ జాతీయవాద మూకలు.. ప్రభుత్వం తన లౌకివాద సంప్రదాయం నుంచి వైదొలగినందుకు మందలించేవారిని, లేదా కశ్మీర్ నిరసనలపై తక్కువ అణచి వేత చర్యలను సూచించే వారిని వేధింపులకు గురి చేçస్తు న్నారు.’’ ఇక మోదీ తానే స్వయంగా ‘‘ప్రశంసలను కోరే వ్యక్తి పూజా సంస్కృతికి కేంద్రంగా మారారు.
’’ ఇటీవలి వివాదాలను గమనిస్తే మత అసహనానికి సంబంధించి అది చేసిన ఇతర నిర్ధారణలు ఆశ్చర్యం కలిగించవు. మోదీని, ఆయన ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికి ఆ కథనం ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఆ తీర్పే నిజమైతే, మనం మనకున్న కొద్దిపాటి ఆర్థిక సానుకూలతలను కోల్పో యిన తరుణంలో ఉన్నాం, మనం దృష్టిని నిలపాల్సింది దానిపైనే తప్ప, వేలెత్తి చూపడంపై కాదు. ఈ సమస్యలలో కొన్నింటి విషయంలో ప్రభుత్వం తన తప్పులను కాకపో యినా బలహీనతలనైనా అంగీకరించడం సహాయకరంగా ఉంటుంది. దురదృష్టవశాత్తూ మోదీ తన పదవీ కాలంలోని చివరి రెండేళ్లలోకి అడుగిడుతుండగా కూడా అది జరుగు తున్నట్టు కనబడటం లేదు.
కొసమెరుపు: అసహనానికి సంబంధించిన సమస్య లలో చాలా వాటికి కాంగ్రెస్ కారణమని రెండు వారాల క్రితం ఈ కాలమ్‌లోనే రాశాను. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) గురించి నేడు చిదంబరం ఏమి చేయాలంటున్నారో వాటిని అధికారంలో ఉండగా సరి దిద్దగలిగేవారు అన్నాను. దానిపట్ల నిరుత్సాహంతో ఆయన సందేశాన్ని పంపారు. ‘‘ఏఎఫ్‌ఎస్‌పీఏను రద్దు చేయాలని, కనీసం దానిలోని తీవ్ర నిబంధనలను సరించడమైనా చేయా లని నేను కోరాను. ఇది మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది.
జాతీయ భద్రత సలహాదారు, నేను సవరణల ముసాయిదాను తయారుచేశాం. ప్రధాని మద్దతు తెలిపినా, రక్షణ మంత్రిని ఒప్పించడంలో నేను విఫలమయ్యాను.. కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఏఎఫ్‌ఎస్‌పీఏను ఎత్తివేయాలనే ప్రతిపాదన గురించి నేను, ఒమర్ అబ్దుల్లా కలసి సైన్యంతో పలుమార్లు చర్చించాం. రక్షణ బలగాలు, రక్షణ శాఖ ఒప్పు కోలేదు. ఇదంతా బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారమే. మీ దృష్టికి రానట్టుంది.’’
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
ఆకార్ పటేల్
ఈ–మెయిల్ :aakar.patel@icloud.com