సాక్షి, న్యూఢిల్లీ: దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంలో చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారతదేశం పక్షపాత ధోరణితో, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ యాప్స్‌ను నిషేధిందని చైనా ఆరోపించింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)ను సంప్రదిస్తామని చైనా భారత్‌ను హెచ్చరించింది. చైనా ఒకవేళ డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేసినా భారత్ నిర్ణయాన్నే ప్రపంచ వాణిజ్య సంస్థ సమర్థిస్తుంది. దానికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు చెప్పవచ్చు.
1. భారత్‌కు చైనాకు మధ్య ఈ యాప్స్ విషయంలో ద్వైపాక్షిక ఒప్పందాలు లేవు. ఇరు దేశాల మధ్య ఈ విషయంలో ఒప్పందాలు లేనప్పటికీ భారతదేశం అతిపెద్ద మార్కెట్ కావడంతో ఆ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. (చైనాకు చెక్ : మరోసారి మోదీ మార్క్)
2. దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందనుకున్నప్పుడు ఆ కంపెనీలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే హక్కు ఆయా దేశాలకు ఉంటుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలలో ఉన్న ఈ అంశం భారతదేశ నిర్ణయానికి అనుకూలంగా ఉంది. చట్టవిరుద్ధ, మోసపూరిత విధానాలు పాటించినందుకు భారతదేశం కావాలంటే చైనా మీదే డబ్ల్యూటీఓ లో ఫిర్యాదు చేయవచ్చు. ఎందుకంటే అధిక సుంకాలు తప్పించుకోవడానికి భారతదేశం ప్రాధ్యాన్యత వాణిజ్య ఒప్పందం కలిగిన సింగపూర్, హాంకాంగ్ దేశాల నుంచి చైనా తక్కువ ధరలకు ఇండియాకు వస్తువులను సరఫరా చేసేది. ఈ విషయంలో ఇండియా చైనా మీద ఫిర్యాదు చేయవచ్చు. (చైనాతో వాణిజ్య లోటు డౌన్)
3. చైనా దాదాపు అన్ని దేశాలలో పెట్టుబడులు పెట్టిన చాలా దేశాలను తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వీలు లేకుండా ఆదేశాలు జారీ చేసింది. ఫేస్‌బుక్, వాట్సాప్‌లాంటి సోషల్‌మీడియా దిగ్గజలు అన్ని దేశాలలో ఉన్నా, చైనాలో మాత్రం వాటి ఊసే ఉండదు. టెక్ దిగ్గజాలు ఎన్నో కంపెనీల మీద చైనా ఆంక్షలు విధించింది. కానీ చైనా దేశానికి చెందిన చాలా సోషల్‌మీడియా సంస్థలు వివిధ దేశాలలో అధిక పెట్టుబడులు పెట్టాయి. చైనా కూడా భారత్‌కు న్యూస్ ఏజెన్సీని చైనాలో నిషేధించింది. పైన తెలిపిన ఈ విషయంలో భారత్‌కు సానుకూలంగా ఉన్నాయి. (‘బ్యాన్ టిక్‌టాక్’ అమెరికాలోనూ..!)
Comments
Please login to add a commentAdd a comment