న్యూఢిల్లీ: దేశ ఆహార భద్రత అవసరాలకు అనుగుణంగా ప్రపంచ వాణిజ్య సంస్కరణల ఒప్పందానికి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) అంగీకారం తెలపడంలో భారత్ విజయం సాధించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పైగా ఎలాంటి షరతులు, రాయితీలు లేకుండానే ఈ ఒప్పందం కుదిరిందని నొక్కి చెప్పింది. ఈ మేరకు జెనీవాలో గురువారం రాత్రి చరిత్రాత్మక ఒప్పందం జరిగిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభకు తెలిపా రు. దీనిప్రకారం రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించే విధానాన్ని ఇకపైనా భారత్ కొనసాగించవచ్చని, దీనికి డబ్ల్యూటీవో ఆమోదం తెలిపిందన్నారు.
ఆహార భద్రతపై అంతర్జాతీయ ఒప్పందం
Published Sat, Nov 29 2014 3:15 AM | Last Updated on Wed, Oct 17 2018 5:55 PM
Advertisement