పార్లమెంట్ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ గురువారమిక్కడ సమావేశమైంది. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు నేటితో ముగియనున్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ : పార్లమెంట్ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ గురువారమిక్కడ సమావేశమైంది. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు నేటితో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పార్లమెంట్ సమావేశాల పొడిగింపు అంశంపై చర్చ జరుపుతున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు హాజరయ్యారు.
కాగా వస్తు సేవల బిల్లు (జీఎస్టీ)ను ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాకాల సమావేశాల ఆఖరి రోజైన ఇవాళ జీఎస్టీ బిల్లు రాజ్యసభలో గట్టెక్కకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశమే మార్గమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.