parliamentary committee meeting
-
విమానాలకు వరుస బాంబు బెదిరింపులు.. అనుమానితుల జాడ గుర్తింపు
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన పలు విమానాలకు వరుస బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 12 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనలు అటు విమానయాన సంస్థలు, ఇటు ప్రయాణికుల్లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి.అయితే విమానాల్లో బాంబు బెదిరింపులును కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇదే అంశంపై చర్చిందేందుకు రవాణాపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బుధవారం భేటీ అయ్యింది.తొలుత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రిత్వ శాఖ అధికారులు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ఈ అంశంపై చర్చించి ఆ వివరాలను కమిటీకి వెల్లడించారు. ఈ ఘటనల్లో కొంతమంది అనుమానితుల జాడ గుర్తించినట్లు, కీలక సమాచారాన్ని సేకరించామని చెప్పినట్లు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అబద్దపు బెదిరింపు కాల్స్ చేసిన వారిని 'నో-ఫ్లై లిస్ట్'లో చేర్చాలని, అదేవిధంగా విమానాల్లో ఎయిర్ మార్షల్స్ సంఖ్యను పెంచడం వంటి చర్యలను ప్రబుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.48 గంటల్లో 10 విమానాలకు బాంబు బెదిరింపులుకాగా బుధవారం బెంగళూరు వెళ్తున్న అకాశా ఎయిర్ ఫ్లైట్, ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇకమంగళవారం ఏకంగా పలు సంస్థలకు చెందిన ఏడు విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానం, జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దమ్మం-లక్నో ఇండిగో విమానం, దర్భంగా-ముంబై స్పైస్‌జెట్ విమానం, సిలిగురి-బెంగళూరు అకాశ ఎయిర్ విమానం, అలయన్స్ ఎయిర్ అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ విమానం, మధురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సహా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.సోమవారం రెండు ఇండిగో, ఎయిరిండియా విమానాలకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు పోలీసులతో కలిసి బెదిరింపుల వెనుక ఉన్న నిందితులను కనిపెట్టడానికి పని చేస్తోంది -
హ్యాండిచ్చిన ట్విటర్ అధికారులు
సాక్షి, న్యూఢిల్లీ : సమాచార సాంకేతికపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ సమావేశానికి ట్వీటర్ సీఈవో, ఇతర అధికారులు గైర్హాజరు కానున్నారు. కమిటీ ముందు హాజరు కావడానికి తమకు సమయం తక్కువగా వుందంటూ ఈ ప్రతిపాదనను ట్విటర్ అధికారులు తిరస్కరించారు. ఈ మేరకు ట్విటర్ ప్రతినిధి విజయా గద్దే ఫిబ్రవరి 7న బీజేపీ ఎంపి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ పార్లమెంటరీ కమిటీకి ఒక లేఖ రాశారు. సామాజిక మాధ్యమ వేదికల్లో పౌరుల హక్కుల రక్షణ కోసం లోక్‌సభ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో ఒక కమిటీనీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు ట్విటర్ సీఈవో జాక్ డోర్సే సహా మరోటాప్ అధికారి హాజరు కావాలని పార్లమెంటరీ ఐటీ కమిటీ సమన్లు జారీ చేసింది. వీరితో ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధును కమిటీ ఆదేశించింది. ఫిబ్రవరి 1న సమావేశానికి హాజరు కావాలని కమిటీ అధికారిక లేఖ రాసింది. ఫిబ్రవరి 7వ తేదీన జరగనున్న సమావేశం అజెండాను ఠాకూర్ ట్వీట్ చేశారు. ఈ అంశంపై సాధారణ ప్రజల అభిప్రాయాలు, సమీక్షలను కూడా కోరతామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ తరువాత ఈ సమాశం ఫిబ్రవరి 11వ తేదీకి వాయిదా పడింది. కాగా సోషల్ మీడియా వేదికల్లో యూజర్ల డేటా భద్రతపై చెలరేగుతున్న ఆందోళనలు, రానున్న ఎన్నికలు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు ట్విటర్ డేటా భద్రతపై గ్లోబల్‌గా విచారణను ఎదుర్కొంటోంది. ఈ కోవలో అమెరికా, సింగపూర్, ఈయూ తర్వాత, ఇండియా నాలుగదేశంగా నిలిచింది. -
పార్లమెంటు సమావేశాల పొడిగింపు లేనట్లే!
న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు పొడిగింపు లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సమావేశాలు పొడిగింపుపై చర్చించేందుకు భేటీ అయినా... పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఏర్పాటుపై నిర్ణయం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలతో ముగియనున్నట్లు సమాచారం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించన తర్వాతే ప్రభుత్వం నిర్ణయచం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశం ముగిసింది. మధ్యాహ్నం మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. -
పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ
న్యూఢిల్లీ : పార్లమెంట్ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ గురువారమిక్కడ సమావేశమైంది. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు నేటితో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పార్లమెంట్ సమావేశాల పొడిగింపు అంశంపై చర్చ జరుపుతున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు హాజరయ్యారు. కాగా వస్తు సేవల బిల్లు (జీఎస్టీ)ను ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాకాల సమావేశాల ఆఖరి రోజైన ఇవాళ జీఎస్టీ బిల్లు రాజ్యసభలో గట్టెక్కకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశమే మార్గమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.