‘జీఎస్‌టీ’ని ఆమోదించిన తొలి రాష్ట్రం అస్సాం | Assam becomes first state to ratify GST Bill | Sakshi
Sakshi News home page

‘జీఎస్‌టీ’ని ఆమోదించిన తొలి రాష్ట్రం అస్సాం

Published Fri, Aug 12 2016 9:38 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

‘జీఎస్‌టీ’ని ఆమోదించిన తొలి రాష్ట్రం అస్సాం

‘జీఎస్‌టీ’ని ఆమోదించిన తొలి రాష్ట్రం అస్సాం

గువాహటీ: వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును అస్సాం అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా అస్సాం నిలిచింది. ఇటీవలి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జీఎస్‌టీ బిల్లును రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ బిల్లును రాష్ట్రాల ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం పంపించింది.

ఈ నేపథ్యంలో జీఎస్‌టీ సవరణ బిల్లును అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వకర్మ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ‘‘పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన జీఎస్‌టీ బిల్లును అస్సాం అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం పొందింది’’ అని స్పీకర్ రంజిత్‌కుమార్ దాస్ సభలో ప్రకటించారు. ప్రతిపక్షాలు కూడా బిల్లుకు మద్దతు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement