నటి హాట్‌ ఫోటో.. అసెంబ్లీలో దుమారం | Assam Assembly Rocks with Priyanka Chopra Hot Photo | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 22 2018 9:25 AM | Last Updated on Thu, Feb 22 2018 1:08 PM

Assam Assembly Rocks with Priyanka Chopra Hot Photo - Sakshi

ప్రియాంక చోప్రా (ఫైల్‌ ఫోటో)

గువాహటి : నటి ప్రియాంక చోప్రా హాట్‌ ఫోటో అస్సాం అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్ర పర్యాటక శాఖకు ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టూరిజం క్యాలెండర్‌ కోసం చేసిన ఫోటో షూట్‌లో ఆమె హాట్‌ హాట్‌గా ఫోజులిచ్చింది. 

క్లీవేజ్‌ షోతో ఉన్న ఆమె ఫోటోలు రాష్ట్రం మొత్తం అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం లేవనెత్తింది. ‘అది(ఆమె ధరించిన గౌన్‌) అస్సామీ సంప్రదాయానికి వ్యతిరేకం. ఆదాయం కోసం ప్రభుత్వం మరీ ఇంత దిగజారాలా?. నటీమణులు పద్ధతైన దుస్తుల్లో కనిపించాలే తప్ప.. ఇలా అర్ధనగ్న ప్రదర్శనలకు దిగటం ఏంటి? అంటూ విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యేలు నందితా దాస్‌, రుప్‌జ్యోతి కుర్మిలు అసెంబ్లీలో చర్చ లేవనెత్తి వెంటనే ప్రియాంకను అంబాసిడర్‌ నుంచి తొలగించాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. 

దీనిపై అస్సాం పర్యాటక శాఖా మంత్రి హిమంత బిస్వా వివరణ ఇస్తూ ప్రియాంకను వెనకేసుకొచ్చారు. ‘కాంగ్రెస్‌ చీప్‌ పబ్లిసిటీకి పాల్పడుతోంది. అసలు ఆ ఫోటోల్లో అసభ్యత ఎక్కుడుందో తెలీటం లేదు. ఏదైనా సంప్రదాయక వేడుకలు జరిగినప్పుడు ధోవతి, చీరలు అంటూ అంతే పద్ధతితో కనిపించాలి. కానీ, ఇది పర్యాటక శాఖకు సంబంధించిన అంశం. విదేశీయులు కూడా వస్తుంటారు. అలాంటి వారికి ఆహ్వానం ఆకర్షణీయంగా ఉండాలి. చీరల్లో పిలిస్తే ఎవరూ రారు. అయినా అస్సామీ చిత్రాల్లో నటించే హీరోయిన్లు కూడా అన్ని రకాల దుస్తులు ధరిస్తుంటారన్న విషయం విమర్శలు చేసేవారికి కూడా తెలిసే ఉంటుంది’ అంటూ తెలిపారు. వెంటనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు.. మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.

కాగా, గతంలో బెర్లిన్‌ నగరంలో  ప్రియాంక.. ప్రధాని మోదీని కలిసిన సమయంలో అసభ్యకరమైన దుస్తులు, కాలి మీద కాలేసుకుని కూర్చోని ఉన్న ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా..  ఆమెపై విమర్శలు వినిపించాయి.


                                                   విమర్శలకు దారి తీసిన ఫోటో ఇదే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement