ప్రతిపాదిత వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లుకు కేంద్ర మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ: ప్రతిపాదిత వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లుకు కేంద్ర మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ బిల్లుకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య సోమవారం ఏకాభిప్రాయం కుదిరింది. జీఎస్‌టీ నుంచి పెట్రోలియంను మినహాయించేందుకు కేంద్రం అంగీకరించడంతో రాష్ట్రాలు దిగివచ్చి.. జీఎస్‌టీకి మద్దతు తెలిపాయి.
ప్రవేశ పన్నును జీఎస్‌టీలో కొనసాగించేందుకు అంగీకరించాయి. జీఎస్‌టీ అమలులోకి రావడం వల్ల రాష్ట్రాలకు కలిగే రెవెన్యూ నష్టాలను మూడేళ్ల పాటు భర్తీ చేసేందుకు, ఆ తర్వాత రెండేళ్ల కాలానికి కొంత మొత్తాన్ని పరిహారంగా చెల్లించేందు కేంద్రం ఒప్పుకుంది. కొత్త పన్నుల విధానం 2016 ఏప్రిల్ నుంచి అమలులోకి రానుంది.