వస్తుసేవల పన్ను(జీఎస్టీ) చట్టాల ముసాయిదాపై చర్చించేందుకు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు నవంబర్ 20న ఢిల్లీలో భేటీ కానున్నారు.
న్యూఢిల్లీ: వస్తుసేవల పన్ను(జీఎస్టీ) చట్టాల ముసాయిదాపై చర్చించేందుకు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు నవంబర్ 20న ఢిల్లీలో భేటీ కానున్నారు. కేంద్ర జీఎస్టీ, రాష్ట్ర జీఎస్టీ, అంతరాష్ట్ర వస్తుసేవలకు సంబంధించిన ఏకీకృత జీఎస్టీ(ఇంటిగ్రేటెడ్)ల ముసాయిదాలను కేంద్రం ఈ నెల మొదట్లో అభిప్రాయాల కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రులకు పంపింది.
ఆదర్శ జీఎస్టీ చట్టం ఆధారంగా కేంద్ర జీఎస్టీని రూపొందిస్తారని, రాష్ట్రాలూ దాని ఆధారంగా తమ మినహాయింపుల తగ్గట్టు చిన్నచిన్న మార్పులతో తమ జీఎస్టీలను రూపొందించుంటాయి.