petroleum
-
అలా అయితేనే పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మూడేళ్ల కనిష్టానికి పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్లను తగ్గించొచ్చన్న అంచనాల నేపథ్యంలో దీనిపై పెట్రోలియం శాఖ సెక్రటరీ పంకజ్ జైన్ స్పష్టతనిచ్చారు.ముడి చమురు ధర కనిష్ట స్థాయి వద్ద స్థిరంగా కొనసాగితేనే పెట్రోల్, డీజిల్ రేట్ల సవరణకు అవకాశం ఉంటుందన్నారు. బ్రెంట్ చమురు బ్యారెల్ ధర మంగళవారం 70డాలర్ల దిగువకు పడిపోవడం గమనార్హం. 2021 డిసెంబర్ తర్వాత ఇంత కనిష్టానికి రావడం ఇదే మొదటిసారి. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చమురు సరఫరాపై హరీకేన్ ఫ్రాన్సిన్ ప్రభావం చూపించడంతో చమురు ధర గురువారం మళ్లీ 71 డాలర్లకు ఎగిసింది. ఈ ఏడాది కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించడం తెలిసిందే. అంతకుముందు రెండేళ్లుగా ధరల్లో ఎలాంటి సవరణ చేయలేదు. ఢిల్లీలో ఓ కార్యక్రమం సందర్భంగా మీడియా ప్రతినిధులతో పంకజ్ జైన్ ఈ అంశంపై మాట్లాడారు. అంతర్జాతీయ చమురు ధరలు కనిష్టాల వద్ద స్థిరపడితే అప్పుడు ఆయిల్ కంపెనీలు ధరల తగ్గింపుపై తగిన నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు. మరోవైపు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై మెరుగైన లాభాలు ఆర్జిస్తున్నాయని.. రేట్లపై నిర్ణయానికి ముందు మరికొంత కాలం పాటు ఇదే విధానం కొనసాగాలని కోరుకుంటున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పుడే రేట్లను తగ్గిస్తే.. మళ్లీ అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతే నష్టపోవాల్సి వస్తుందన్న అభిప్రాయంతో ఆయిల్ కంపెనీలు కొంత కాలం పాటు వేచి చూసే ధోరణిని అనుసరించాలనుకుంటున్నట్టు చెప్పాయి. మహారాష్ట్ర ఎన్నికల ముందు? ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రేట్లను తగ్గించొచ్చని బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఓ నివేదికలో తెలిపింది. ‘‘రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోలియం రేట్లను తగ్గిస్తారన్న అంచనాలు ఉన్నాయి. మేము కూడా దీన్ని తోసిపుచ్చడం లేదు. జమ్మూ కశ్మీర్, హర్యానాకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరో నెల రోజుల పాటు అమల్లో ఉంటుంది. దీంతో దీపావళి లేదా మహారాష్ట్ర ఎన్నికల ప్రవర్తా నియమావళి అమల్లోకి రావడానికి ముందు రేట్లను తగ్గించొచ్చు. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.2 వరకు తగ్గించొచ్చు. వచ్చే నెల రోజుల పాటు ఆయిల్ కంపెనీలు అసాధారణ మార్కెటింగ్ మార్జిన్లను సంపాదిస్తాయి. ఎల్పీజీపై నష్టాలను కూడా భర్తీ చేసుకోగలుగుతాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో మార్కెటింగ్ మార్జిన్ లీటర్ పెట్రోల్/డీజిల్‌పై రూ.4.7/3.8 గా ఉంటే, జూలై–సెప్టెంబర్ కాలంలో మార్కెటింగ్ మార్జిన్లు లీటర్ పెట్రోల్/డీజిల్‌పై రూ.9.7/8గా ఉండొచ్చు’’అని ఎమ్కే గ్లోబల్ వివరించింది. దేశ చమురు అవసరాల్లో 85 % దిగుమతులపైనే ఆధారపడడం తెలిసిందే. -
ఐవోసీ.. లాభాల రికార్డ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్‌లో నష్టాలను వీడి దాదాపు రూ. 12,967 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. వెరసి ఒక ఏడాదికి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ఆర్జించిన లాభాల్లో సగానికిపైగా తాజా త్రైమాసికంలో సాధించింది. ఇక గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 272 కోట్ల నికర నష్టం ప్రకటించింది. చమురు శుద్ధి మార్జిన్లతోపాటు మార్కెటింగ్ మార్జిన్లు మెరుగుపడటంతో లాభదాయకత పుంజుకుంది. ఈ కాలంలో ముడిచమురు ధరలు క్షీణించినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడం ఇందుకు సహకరించింది. దీంతో పెట్రోలియం ప్రొడక్టుల అమ్మకాల ద్వారా రూ. 17,756 కోట్ల పన్నుకుముందు లాభం సాధించింది. గత క్యూ2లో రూ. 104 కోట్ల నిర్వహణ నష్టం నమోదైంది. ఆదాయం డౌన్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఐవోసీ ఆదాయం రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.02 లక్షల కోట్లకు క్షీణించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఐవోసీ రూ. 26,718 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 2021–22 ఏడాదికి సాధించిన రికార్డ్ నికర లాభం రూ. 24,184 కోట్లకంటే అధికంకావడం విశేషం! తొలి ఆరు నెలల్లో ఒక్కో బ్యారల్ స్థూల చమురు శుద్ధి మార్జిన్లు(జీఆర్ఎం) 13.12 డాలర్లుగా నమోదైంది. ఈ కాలంలో ఎగుమతులతో కలిపి మొత్తం 47.65 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్టులను విక్రయించినట్లు కంపెనీ చైర్మన్ ఎస్ఎం వైద్య వెల్లడించారు. క్యూ2లో ఐవోసీ ఇంధనాల ఉత్పత్తి 16.1 ఎంటీ నుంచి 17.72 ఎంటీకి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 90 వద్ద ముగిసింది. -
కోనసీమలో ‘నల్ల బంగారం’
సాక్షి అమలాపురం: కోనసీమలో తయారయ్యే ‘కొబ్బరి చిప్ప బొగ్గు’ దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ సౌందర్యానికి ఫేస్‌ప్యాక్‌గా, తాగునీటిని శుద్ధిచేసేందుకు వినియోగించడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు, దేశ రక్షణకు చెందిన విడి భాగాలు, ఆటో మొబైల్ పరిశ్రమలలో కీలక విడిభాగాల తయారీలో ఈ బొగ్గు అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. తయారీదారుల ఇంట నల్ల బంగారమై మెరుస్తోంది. ఇటువంటి అత్యుత్తమమైన, నాణ్యమైన కొబ్బరి చిప్ప బొగ్గు తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిలుస్తోంది. నదీతీరంలో బొగ్గు తయారీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, అంబాజీపేట మండలాల్లో వైనతేయ నదీతీరంలో బొగ్గు తయారవుతోంది. ఇక్కడ నుంచి ఏడాదికి రూ. 2 కోట్ల విలువ చేసే 700 నుంచి 900 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడు లోని కాంగాయం, పల్లడం, కోయింబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, మన రాష్ట్రంలోని నెల్లూ రు, గూడూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రయోజనాలెన్నో.. కొబ్బరి చిప్ప బొగ్గు ప్రయోజనాలు తెలిస్తే నిజంగా నల్ల బంగారమే అంటారు. సౌందర్య పోషణకు వాడే ఫేస్‌ప్యాక్‌లతోపాటు కాస్మోటిక్స్, సబ్బులలో వాడకం అధికం. ఆటోమొబైల్‌లో కీలకమైన స్పేర్ పార్టుల తయారీ, రక్షణ రంగంలో యుద్ధ పరికరా లు, గ్యాస్ మాస్కుల తయారీలో వినియోగిస్తారు. పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తిలో అధిక శాతం రికవరీకి ఇది దోహదపడుతుంది. నీటిలోని క్లోరిన్, పురుగు మందులు, మలినాలను, వైరస్, బ్యాక్టీరియాలను నివారిస్తుంది. దీనిలో అధిక ఉష్ణ విలువ ఉంటుంది. మండించడానికి సమర్థవంతమైన ఇంధన వనరు గా ఉపయోగపడుతుంది. చిప్ప బొగ్గుతో భూమిలో వేగంగా సేంద్రియ కర్భనం ఉత్పత్తి అవుతుంది. బాగా ఆరిన కొబ్బరి చిప్ప బొగ్గు అత్యధిక ధర కేజీ రూ.35 నుంచి రూ.38 వరకు ఉండగా, ఈ ఏడాది ఆశించిన ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గిపోయింది. ప్రస్తుతం కేజీ రూ.24 నుంచి రూ.26 కాగా, తడిసిన బొగ్గు ధర రూ.19 వరకు మాత్రమే ఉంది. దీనివల్ల నష్టపోతున్నామని, ఎగుమతులు లేక సరుకు పెద్ద ఎత్తున పేరుకుపోయిందని, అక్టోబర్ నుంచి మంచి ధర వస్తుందని తయారీదారులు ఆశలు పెట్టుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం వన్ డిస్ట్రిక్ట్.. వన్ ప్రొడెక్టులో భాగంగా కోనసీమ జిల్లాను కొబ్బరికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ చిప్ప బొగ్గు తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. కోకోనట్ బోర్డు, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రూ.25 లక్షల విలువైన యూనిట్‌కు 35 శాతం వరకు రాయి తీ అందించనుంది. అంతకన్నా పెద్ద ప్రాజెక్టు పెట్టుకుంటే రూ.పది లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నా రు. జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా) ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో జిల్లాలో కోకోనట్ మిల్క్ యూనిట్‌తోపాటు కోకోనట్ చార్ కోల్ పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యానశాఖ సన్నాహాలు చేస్తోంది. మన్నిక ఎక్కువ.. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక కన్నా ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గు నాణ్యమైంది. చిప్ప దళసరి కావడంతోపాటు దీనిలో అధిక శాతం గ్యాస్ నిక్షిప్తమైనందున ఇది వేగంగా మండుతోంది. మిగిలిన రాష్ట్రాలలో ఆరు బయట బొగ్గు తయారీ ఎక్కువ. కోనసీమలో బొగ్గు తయారీ డ్రమ్ములలో చేస్తారు. దీనివల్ల బూడిద శాతం తక్కువగా ఉంటోంది. ఇక్కడ తయారయ్యే బొగ్గు ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటుంది. మార్కెట్ అవకాశాలు పెరగాలి మనం తయారు చేసే బొగ్గే అత్యంత నాణ్యమైంది. మార్కెటింగ్ అవకాశాలు పెద్దగా లేక అనుకున్న ధర రావడం లేదు. ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నుంచి బొగ్గు తీసుకెళ్లి మరింత నాణ్యంగా తయారు చేసి కేజీ రూ.50 నుంచి రూ.70 చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. మనకు మాత్రం ఆ ధర రావడం లేదు. మార్కెటింగ్ అవకాశాలు పెరిగితే మరింత ధర వచ్చే అవకాశముంది.– మట్టపర్తి రామకృష్ణ,ముంజువరం, పి.గన్నవరం మండలం అత్యంత ధృడమైంది ఇక్కడ తయారయ్యే కొబ్బరి చిప్పలో 80 నుంచి 90 శాతం మేర చిన్న చిన్న రంధ్రాలు ఉండడంతో ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటోంది. ఆటోమొబైల్, రక్షణ పరికరాలు, పెట్రోలియం ఉత్పత్తుల తయారీలో అధికంగా వాడుతున్నారు. – ఎ.కిరిటీ, ఉద్యాన శాస్త్రవేత్త, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
ఎగుమతులు @ 447 బిలియన్ డాలర్లు
రోమ్: భారత్ వస్తు ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2021–22తో పోల్చితే 6 శాతం పెరిగి 447 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇదే సమయంలో దేశ దిగుమతులు 16.5 శాతం ఎగసి 714 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 267 బిలియన్ డాలర్లకు చేరింది. పెట్రోలియం, ఫార్మా, రసాయనాలు, సముద్ర ఉత్పత్తుల రంగాల నుంచి ఎగుమతుల్లో మంచి వృద్ధి నమోదయినట్లు ఆయన వెల్లడించారు. ఫ్రాన్స్, ఇటలీల్లో ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ వరకూ పర్యటించిన గోయల్ ఈ సందర్భంగా పలు కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఆయా దేశాలతో వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలు మరింత పురోగమించడం లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులకు తెలిపిన అంశాల్లో ముఖ్యమైనవి... ► వస్తు, సేవలు కలిపి ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక విభాగాల దిగుమతులు 892 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భారత్ ఎకానమీ క్రియాశీలత, పురోగమనానికి సూచికలుగా ఎగుమతి–దిగుమతి గణాంకాలు ఉన్నాయి. ► అన్ని దేశాలతో పటిష్ట వాణిజ్య సంబంధాలు నెరపడానికి భారత్ కృషి సల్పుతోంది. ► ఇన్వెస్టర్ల పెట్టుబడులకు భారత్ అత్యంత ఆకర్షణ ప్రదేశంగా ఉంది. ఎకానమీ పరంగా చూస్తే, భారత్ ఎంతో పటిష్టంగా ఉంది. వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదవుతున్నాయి. ఎగుమతులు బాగున్నాయి. ద్రవ్యోల్బణం దిగివస్తోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు పటిష్టంగా 600 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. విదేశాల నుంచి భారత్‌కు పంపుతున్న రెమిటెన్సులు 100 బిలియన్ డాలర్లుపైగానే ఉంటున్నాయి. పెట్టుబడుల ప్రవాహం బాగుంది. ► ఎగుమతుల భారీ వృద్ధి లక్ష్యంగా సమర్థవంతమైన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్ ఇప్పటికే ఆవిష్కరించింది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీలో నిర్దేశించడం జరిగింది. -
రెట్టింపు స్థాయికి చమురు, గ్యాస్ అన్వేషణ
న్యూఢిల్లీ: ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా గ్యాస్, చమురు అన్వేషణ, ఉత్పత్తి చేసే ప్రాంత విస్తీర్ణాన్ని 2025 నాటికల్లా రెట్టింపు స్థాయికి (5 లక్షల చ.కి.మీ.లకు) పెంచుకోవాలని భావిస్తోంది. 2030 నాటికి దీన్ని 10 లక్షల చ.కి.మీ.కు పెంచనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రస్తుతం 2,07,692 చ.కి.మీ. విస్తీర్ణంలో చమురు, గ్యాస్ అన్వేషణ జరుగుతోంది. సమీప భవిష్యత్తులో దేశ ఇంధన అవసరాల కోసం చమురు, గ్యాస్‌పై ఆధారపడటం కొనసాగుతుందని వరల్డ్ ఎనర్జీ పాలసీ సదస్సు 2022లో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రస్తుతం 3 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఎకానమీ 2025 నాటికల్లా 5 లక్షల కోట్ల డాలర్లకు, 2030 నాటికి 10 లక్షల కోట్ల డాలర్లకు చేరనుందని పురి వివరించారు. ఈ నేపథ్యంలో ఇంధనానికి భారీగా డిమాండ్ ఏర్పడుతుందని చెప్పారు. బ్రిటీష్ ఇంధన సంస్థ బీపీ ఎనర్జీ అంచనాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ ఇంధన డిమాండ్‌లో భారత్ వాటా ప్రస్తుత 6 శాతం స్థాయి నుంచి రెట్టింపై 12 శాతానికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. నికరంగా సున్నా స్థాయి కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. భారత్ 80 శాతం పైగా ఇంధనావసరాల కోసం బొగ్గు, చమురు, బయోమాస్పైనే ఆధారపడుతోంది. మొత్తం ఇంధన వినియోగంలో 44 శాతం వాటా బొగ్గుది ఉంటుండగా, చమురుది పావు శాతం, సహజ వాయువుది 6 శాతం వాటా ఉంటోంది. చమురు అవసరాల్లో 85 శాతాన్ని, గ్యాస్‌లో 50 శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. గ్యాస్ వినియోగం పెంపు.. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో గ్యాస్ ఇంధన వినియోగాన్ని పెంచుకుంటున్నట్లు పురి తెలిపారు. ప్రస్తుతం 6 శాతంగా ఉన్న గ్యాస్ వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచుకోనున్నట్లు వివరించారు. అలాగే చెరకు, మిగులు ఆహారధాన్యాల నుంచి వెలికితీసే ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ద్వారా కూడా చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బ్లెండింగ్ (పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే స్థాయి) 8 శాతంగా ఉండగా 2025 నాటికి ఇది 20 శాతానికి పెంచుకోనున్నట్లు హర్దీప్ సింగ్ పురి చెప్పారు. మరోవైపు, కాలుష్య రహితమైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కూడా తగు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ‘పర్యావరణ హైడ్రోజన్‌ను వేగవంతంగా వినియోగంలోకి తేవడంపైనా, భారత్‌ను హరిత హైడ్రోజన్ హబ్‌గా తీర్చిదిద్దడంపైనా ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. హైడ్రోజన్‌ను ఇంధనంగాను, గ్యాస్ పైప్లైన్లలోను ఉపయోగించగలిగే ప్రాజెక్టులను మా చమురు, గ్యాస్ కంపెనీలు రూపొందిస్తున్నాయి ‘ అని పురి చెప్పారు. దేశీయంగా చమురు, గ్యాస్ రంగంలో తలపెట్టిన సంస్కరణలు ఏదో స్వల్పకాలికమైనవి కాదని.. అపార వనరులను సమర్ధంగా వినియోగించుకునేందుకు రూపొందించుకున్న దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమేనని ఆయన పేర్కొన్నారు. పరిశుభ్రమైన, పర్యావరణ అనుకూలమైన ఇంధనానికి మళ్లడంలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించగలదని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. -
ఎగుమతుల్లో భారీ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2021 జూలైలో మంచి పనితీరును కనబరిచాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చి 47.91 శాతం పురోగతితో 35.17 బిలియన్ డాలర్లకు చేరాయి. పెట్రోలియం (3.82 బిలియన్ డాలర్లు), ఇంజనీరింగ్ (2.82 బిలియన్ డాలర్లు), రత్నాలు–ఆభరణాల (1.95 బిలియన్ డాలర్లు) ఎగుమతుల్లో భారీ పెరుగుదల మొత్తం గణాంకాలపై సానుకూల ప్రభావం చూపింది. ఇక దిగుమతులు 59.38 శాతం పెరిగి 46.40 బిలియన్ డాలర్లకు చేరాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు సమీక్షా నెల్లో 11.23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వాణిజ్య గణాంకాల శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ►ఆయిల్‌సీడ్స్, బియ్యం, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించాయి. ►పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తుల దిగుమతులు 97% పెరిగి 6.35 బిలియన్ డాలర్లకు చేరాయి. ►పసిది దిగుమతులు 135.5 శాతం పెరిగి 2.42 బిలియన్ డాలర్లకు చేరాయి. ►ముత్యాలు, ప్రీసియన్, సెమీ–ప్రీసియస్ రాళ్ల దిగుమతులు 1.68 బిలియన్ డాలర్లుగా ఉంది. సేవలు ఇలా..: భారత్ సేవల ఎగుమతులు జూన్ నెలలో 24.1% పెరిగి 19.72 బిలియన్ డాలర్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు వెల్లడించాయి. మేలో ఎగుమతుల విలువ 17.35 బిలియన్ డాలర్లుకాగా, ఏప్రిల్‌లో ఈ విలువ 17.54 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక సేవల దిగుమతులు 24.8% పెరిగి 11.14 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతక్రితం రెండు నెలల్లో ఈ విలువ వరుసగా 9.89 బిలియన్ డాల ర్లు, 10.23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. -
రండి.. ఆయిల్, గ్యాస్ ఉత్పత్తిపై పెట్టుబడులు పెట్టండి
న్యూఢిల్లీ: భారత్‌లో చమురు, సహజ వాయువు ఉత్పత్తి పెంపుపై పెట్టుబడులు పెట్టాలంటూ దేశ, విదేశీ కంపెనీలను పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్‌పురి ఆహ్వానించారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న ఏ సమస్యను అయినా పరిష్కరించేందుకు స్వేచ్ఛాయుత విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. ఇన్వెస్టర్లతో నిర్వహించిన సంప్రదింపుల కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ పిలుపునిచ్చారు. ‘‘ఈ రంగానికి సంబంధించి తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యల గుర్తింపు విషయంలో, సవాళ్లను అధిగమించే విషయంలో మీతో కలసి ప్రభుత్వం పనిచేస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిని సాధించే దిశగా నడుస్తోంది. దీంతో ఇంధనానికి డిమాండ్ కూడా పెరగనుంది. దీన్ని చేరుకునేందుకు దేశీయంగా అన్వేషణ, ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో దేశ, విదేశీ కంపెనీలు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ప్రపంచంలో ఇంధనంపై పెట్టుబడులకు మంచి అవకాశం ఎక్కడ ఉందా? అని ఎవరైనా ఆలోచిస్తుంటే.. అందుకు భారత్ అనుకూలమైనది’’ అని మంత్రి ప్రకటించారు. గతంతో పోలిస్తే భారత్‌లో వ్యాపార నిర్వహణ సులభతరం అయినట్టు చెప్పారు. మూడో దశలో భాగంగా 32 చమురు, గ్యాస్ బ్లాక్‌లను వేలం వేసినట్టు పేర్కొన్నారు. -
పెట్రో కెమికల్స్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొననున్న మంత్రి మేకపాటి
-
ఎగుమతులు పెరిగాయ్... దిగుమతులు తగ్గాయ్!
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2019 జూలైలో కేవలం 2.25 శాతం (2018 జూలైతో పోల్చి) పెరిగాయి. విలువ రూపంలో 26.33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2018 జూలైలో ఈ విలువ 25.75 బిలియన్ డాలర్లు. కాగా అయితే దిగుమతులు మాత్రం 10.43 శాతం తగ్గాయి. విలువ రూపంలో 39.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం 13.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది నాలుగు నెలల కనిష్టస్థాయి. చమురు, బంగారం దిగుమతులు పడిపోవడం వాణిజ్యలోటు తగ్గుదలపై సానుకూల ప్రభావం చూపింది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► రసాయనాలు, ఇనుము, ఫార్మా రంగాల నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయి. ► అయితే రత్నాలు, ఆభరణాలు (–6.82 శాతం), ఇంజనీరింగ్ గూడ్స్ (–1.69 శాతం), పెట్రోలియం ప్రొడక్టుల (–5%) ఎగుమతులు పెరక్కపోగా క్షీణించాయి. ► పసిడి దిగుమతులు 42.2 శాతం పడిపోయి 1.71 బిలయన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► చమురు దిగుమతులు 22.15% క్షీణించి 9.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతులు 5.92 శాతం పడిపోయి, 30.16 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. తొలి నాలుగు నెలల్లో నీరసం 2019 ఏప్రిల్ నుంచి జూలై వరకూ ఎగుమతులు 0.37 శాతం క్షీణించి (2018 ఇదే నెలలతో పోల్చి) 107.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు సైతం 3.63 శాతం క్షీణించి 166.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 59.39 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ కాలంలో చమురు దిగుమతులు 5.69 శాతం తగ్గి 44.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2019 జూన్‌లో విడుదల చేసిన ఒక నివేదికలో ప్రపంచబ్యాంక్ గ్లోబల్ ఎగుమతులపై ప్రతికూల అవుట్‌లుక్‌ను ఇచ్చింది. 2019లో కేవలం 2.6 శాతంగా గ్లోబల్ ట్రేడ్ నమోదవుతుందని నివేదిక తెలిపింది. అంతక్రితం అంచనాకన్నా ఇది ఒకశాతం తక్కువ. అంతర్జాతీయ ప్రతికూలత ఎనిమిది నెలల తర్వాత జూన్‌లో భారత ఎగుమతులు మొదటిసారి క్షీణతలోకి జారాయి. ఈ క్షీణత 9.71 శాతంగా నమోదయ్యింది. జూలైలో కొంత మెరుగుదలతో 2.25 శాతంగా నమోదయ్యాయి. అయినా ఉత్సాహకరమైన పరిస్థితి ఉందని చెప్పలేం. వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు భారత్ ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఎగుమతిదారులకు సంబంధించి దేశీయంగా వేగవంతమైన రుణ లభ్యత, వడ్డీల తగ్గింపు, అగ్రి ఎగుమతులకు రాయితీలు, విదేశీ పర్యాటకులకు అమ్మకాలపై ప్రయోజనాలు, జీఎస్టీ తక్షణ రిఫండ్ వంటి అంశాలపై కేంద్రం తక్షణం దృష్టి సారించాలి. – శరద్ కుమార్ షరాఫ్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ రూపాయి క్షీణత ప్రభావమే.. జూన్ నెలలో క్షీణత బాట నుంచి జూలైలో వృద్ధి బాటకు భారత్ ఎగుమతులు వచ్చాయంటే, డాలర్ మారకంలో రూపాయి గడచిన ఆరు వారాల 3.5 శాతం క్షీణించడమే కారణం. స్వల్పకాలికంగా ఎగుమతుల్లో సానుకూలత రావడానికి ఇదే కారణం. – మోహిత్ సింగ్లా, టీపీసీఐ చైర్మన్ -
లొక్సభ ఎన్నికల తర్వాత పెట్రోధరల పెంపుకు రంగం సిద్ధం
-
‘పెట్రోలియం’కు జీవ ఇంధనమే సరైన ప్రత్యామ్నాయం
వాషింగ్టన్: మొక్కల ఆధారిత జీవ ఇంధనం విమానయా న రంగంలో ఇంధనం గా వినియోగిస్తున్న పెట్రోలియం ఉత్ప త్తులకు సరైన ప్రత్యామ్నా యం అవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డా రు. మొక్కల ఆధారిత జీవ ఇంధనంపై ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు విజయవం తమైతే గనుక భవిష్యత్తులో విమానయాన రంగంలో ఇంధనంగా దీనిని వాడుకోవచ్చన్నారు. విమానయాన రంగం రోజుకు 50 లక్షల బ్యారెళ్ల ఇంధనాన్ని వాడుకుంటోంది. రోడ్డు రవాణాతోపాటు ఇళ్లు, పరిశ్రమలు ప్రత్యామ్నాయ ఇంధ నాల వైపు దృష్టి సారిస్తున్నాయి. అయితే ప్రస్తుతమున్న సాంకేతికతతో ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించడం విమానయాన రంగంలో కుదరని అంశం. దీంతో కేవలం పెట్రోలియం ఉత్పత్తులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎలక్ట్రిక్ విమానాలను తయారు చేయడం వంటిది అతిపెద్ద సవాలుతో కూడుకోవడంతో ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. దీంతో ద్రవీకృత జీవ ఇంధనాలే విమానయాన రంగానికి సరైన ప్రత్యామ్నాయం కానున్నాయని లారెన్స్ బర్క్లీ నేషనల్ ల్యాబోరేటరి పరిశోధకులు కోర్నీ స్క్వాన్ వెల్లడించారు. మొక్కల ఆధారిత జీవ ఇంధనంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పరిశోధన ఫలితాలు ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
పెట్రోలియం రిఫైనరీలో అగ్నిప్రమాదం
ముంబై: ముంబైలోని భారత్ పెట్రోలియం శుద్ధి కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 43 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 22 మందికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపించామని, 21 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని ఆరో జోన్ డిప్యూటీ కమిషనర్ షహజి ఉమాప్ తెలిపారు. తూర్పు ముంబైలోని చెంబూర్‌లోని కర్మాగారంలో మధ్యాహ్నం సంభవించిన పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. హైడ్రోక్రాకర్ ప్లాంట్‌లోని కంప్రెషర్ షెడ్ల వేడి, ఒత్తిడి వల్ల పేలుడు సంభవించినట్లు సంస్థ తెలిపింది. -
ఒపెక్ దృష్టికి అధిక ధరల అంశం
న్యూఢిల్లీ: పెట్రోలియంపై ఆసియా దేశాల నుంచి అధిక ధరలను వసూలు చేస్తున్న అంశాన్ని ఒపెక్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ శానుసి బక్రిండో దృష్టికి పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీసుకెళ్లారు. భారత పర్యటనకు వచ్చిన బక్రిండోతో ప్రధాన్ మంగళవారం భేటీ అయి పలు విషయాలపై చర్చించారు. ఆసియా దేశాల నుంచి ప్రీమియం ధరలను ఒపెక్ సభ్య దేశాలు వసూలు చేస్తున్నాయంటూ మన దేశం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఒపెక్ చమురు ఉత్పత్తికి కోత విధించడం వల్ల అస్థిరతలు అధికం కావడం, ధరలు పెరగడం వల్ల భారత్‌పై పడే ప్రభావాన్ని పెట్రోలియం మంత్రి వివరించారు. ఆసియాలో ప్రీమియం ధరల అంశంపైనా తగినంత చర్చించినట్టు, భారత్ తరహా దేశాలకు వాస్తవిక ధరలు ఉండాలన్న అంశాన్ని గుర్తు చేసినట్టు పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. చమురు అవసరాల్లో మన దేశం 80 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. దేశీయ అవసరాల్లో ముడి చమురు 86 శాతం, సహజ గ్యాస్ 75 శాతం, ఎల్పీజీ 95 శాతాన్ని ఒపెక్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవలి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో దేశీయంగానూ వాటి ధరలు గరిష్ట స్థాయిలకు చేరాయి. -
నానో.. అన్నీ సాధ్యమే
గాల్లోని కార్బన్డయాక్సైడ్.. పెట్రోలు, డీజిల్‌గా మారిపోతే.. సముద్రపు ఉప్పునీరు చిటికెలో మంచినీరైపోతే.. మందుల ఫ్యాక్టరీ మొత్తం చిన్న పెట్టెలో ఇమిడిపోతే.. ఇవన్నీ అతి తక్కువ ఖర్చుతో ఏమాత్రం శ్రమ లేకుండా జరిగిపోతే.. అంతా బాగానే ఉందిగానీ ఇదంతా జరిగేపనేనా అనుకుంటున్నారా.. ఇంకొన్నేళ్లు ఆగండి.. నానో టెక్నాలజీతో జరిగే ఆ అద్భుతాలు చూసి ‘వావ్’.. అనక మానరు! ఒకప్పుడు అసాధ్యమనుకున్న పనులు ఇకపై చాలా సింపుల్‌గా జరుగుతాయని చెబుతోంది అమెరికా కంపెనీ మ్యాటర్‌షిఫ్ట్!. ఈ మధ్యే వీళ్లు కార్బన్ నానో ట్యూబ్‌లతో ఓ ఫిల్టర్ తయారు చేశారు. దీన్నిగాని వాడారంటే.. ఈ భూమ్మీద పరిష్కరించలేని సమస్య అంటూ ఉండదని చెబుతున్నారు. అబ్బో.. అంతగొప్పదా ఈ ఫిల్టర్.. అనుకుంటున్నారా? వివరంగా తెలుసుకోండి.. తర్వాత మీరే అంటారు.. ‘అబ్బో’ అని!! – సాక్షి హైదరాబాద్ ఏమిటీ కార్బన్ నానో ట్యూబ్! కార్బన్ నానో ట్యూబ్.. క్లుప్తంగా చెప్పుకుంటే అతి సూక్ష్మమైన గొట్టం. ఎంత సూక్ష్మమంటే.. వెంట్రుకలో యాభై వేల నానో ట్యూబ్‌లు ఇమిడిపోతాయి. వజ్రాల మాదిరి కార్బన్‌తో తయారవుతుంది కాబట్టి ఈ గొట్టాలు దృఢంగా ఉంటాయి. సూక్ష్మాతి సూక్ష్మం కాబట్టి వీటి ద్వారా నిర్దిష్ట పరిమాణంలోని అణువులే ప్రయాణించగలవు. ఇన్ని మంచి లక్షణాలున్నా ఈ ట్యూబ్‌ల తయారీలో ప్రధానమైన చిక్కుంది. భారీ సైజులో తయారు చేయడం చాలా కష్టం. అందుకే ఇప్పటివరకూ చాలా మంది శాస్త్రవేత్తలు పరిమిత స్థాయిలోనే తయారు చేసి.. వాటితో చేయగల అద్భుతాల గురించి చెబుతూ వచ్చారు. మ్యాటర్‌షిఫ్ట్ కంపెనీ మాత్రం ఈ ఇబ్బందులన్నీ అధిగమించింది. ఫలితంగా కార్బన్ నానో ట్యూబ్‌ల ఫిల్టర్లను భారీ సైజులో తయారు చేయడం మొదలుపెట్టింది. ఇళ్లల్లో నీటి శుద్ధి కోసం రివర్స్ ఆస్మాసిస్ ఫిల్టర్లు వాడుతూంటాం కదా.. కార్బన్ నానో ట్యూబ్ ఫిల్టర్లూ అచ్చం ఇలాగే ఉంటాయి. పిసరంత స్థలంలో కోట్లకు కోట్లు మ్యాటర్ షిఫ్ట్ తయారు చేస్తున్న ఫిల్టర్లలో ఎన్ని కార్బన్ నానో ట్యూబ్‌లు ఉంటాయో తెలుసా? ఒక్కో చదరపు మీటర్లో 250 లక్షల కోట్లు! కార్బన్ నానో ట్యూబ్‌లను మనకు కావల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ల ద్వారా ఉప్పు నీటిని మంచినీటిగా మార్చుకోవడం మొదలు ఎక్కడికక్కడ మందులు తయారు చేసుకోవడం వరకూ అనేక రకాల పనులకు వాడుకోవచ్చు. ఈ గొట్టాల చివర ఇతర పరమాణువులు అతికించి ఇతర ప్రయోజనాలూ పొందొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నానో టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మ్యాటర్ షిఫ్ట్ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కార్బన్ నానో ట్యూబ్‌ల ఫిల్టర్లు అణుస్థాయిలో ఫ్యాక్టరీలుగా పనిచేస్తూ కొత్త, వినూత్న పదార్థాలను తయారు చేయగలవంటున్నారు. ఏమేం చేయొచ్చంటే.. కార్బన్ నానో ట్యూబ్ ఫిల్టర్లతో సాధ్యం కాని పనంటూ ఏదీ లేదని ముందే చెప్పుకున్నాం. ప్రస్తుతానికి మాత్రం గాల్లోంచి కార్బన్డయాక్సైడ్ పీల్చుకొని పెట్రోలు, డీజిల్ లాంటి ఇంధనాలుగా మార్చేందుకు మ్యాటర్షిఫ్ట్ట్ ప్రయత్నాలు మొదలెట్టింది. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే.. పీల్చుకున్న కార్బన్డయాక్సైడ్, ఇతర లవణాలను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో భవనాల నిర్మాణానికి పనికొచ్చే పదార్థాలుగా కూడా మార్చవచ్చు. ఆస్పత్రులు, ఇతర అవసరమైన ప్రదేశాల్లో గాల్లోంచే ఆక్సిజన్‌ను వేరుచేసి వాడుకునేందుకు వీలవుతుంది. భారీ లోహాలు, ప్రమాదకర రసాయనాలున్న మట్టినీ సులువుగా శుద్ధి చేయొచ్చు. ముఖ్యంగా అత్యంత చవకగా సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేయొచ్చు. ‘నిర్లవణీకరణ’ అనే ఈ ప్రక్రియ చవకగా జరిగితే ప్రపంచవ్యాప్తంగా అనేక వివాదాలు పరిష్కారమవుతాయని తెలిసిందే. ప్రస్తుత పద్ధతుల కంటే కనీసం 4 రెట్లు తక్కువ ఖర్చు నిర్లవణీకరణకు అవుతుందని అంచనా. చవకైన, మెరుగైన వైద్యానికి.. కార్బన్ నానో ట్యూబ్ ఫిల్టర్లను చవకైన, మెరుగైన వైద్యానికి ఉపయోగించుకోవచ్చు. యాంటీబాడీలను వేరు చేయడం మొదలు ఎక్కడికక్కడ మందుల తయారీకి వీటిని వాడుకోవచ్చు. ఒక్కో కార్బన్ నానో ట్యూబ్‌లో సూక్ష్మస్థాయిలో మందులు నింపి అవసరమైన చోటే విడుదలయ్యేలా చేయొచ్చు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీలతో మరింత ఎక్కువ ప్రయోజనం పొందేందుకూ వీటిని వాడుకోవచ్చు. మనిషి ఇతర గ్రహాలపై జీవించాల్సి వస్తే అక్కడ కూడా ఈ టెక్నాలజీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
కెరీర్ కౌన్సెలింగ్..
పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో పెట్రోలియం స్పెషలైజేషన్‌తో అందుబా టులో ఉన్న కోర్సులు, ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి? – రామ్ కుమార్, హైదరాబాద్. ♦ సావిత్రిబాయి ఫూలే పుణె విశ్వవిద్యాలయం.. ఎంఎస్సీ (పెట్రోలియం టెక్నాలజీ) కోర్సును అందిస్తోంది. ఈ కోర్సు కాల వ్యవధి రెండేళ్లు. బీఎస్సీ పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. ♦ వివరాలకు: www.unipune.ac.in ♦ రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ–రాయ్‌బరేలీ, ఎంటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తుంది. ♦ అర్హత: పెట్రోలియం ఇంజనీరింగ్‌లో 60 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు) నాలుగేళ్ల వ్యవధితో బీటెక్/బీఈ. తగిన గేట్ స్కోర్ కూడా ఉండాలి. ♦ వివరాలకు: www.rgipt.ac.in ♦ యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్)–డెహ్రాడూన్, ఎంటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్) కోర్సును అందిస్తోంది. ♦ అర్హత: హయ్యర్ అండ్ సెకండరీ లెవెల్లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. 60 శాతం మార్కులతో పెట్రోలియం ఇంజనీరింగ్/అప్లైడ్ పెట్రోలియం ఇంజనీరింగ్/గ్యాస్ ఇంజనీరింగ్/పెట్రోలియం రిఫైనింగ్/పెట్రోకెమికల్ ఇంజనీరింగ్/జియోసైన్సెస్లో బీటెక్/బీఈ. తగిన గేట్ స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ♦ వివరాలకు: www.upes.ac.in -
ఇక ఆ ఉత్పత్తులు జీఎస్టీలోకి..
న్యూఢిల్లీ : దేశమంతా ఏక పన్ను విధానం విజయవంతంగా అమల్లోకి వచ్చింది. ఈ పన్ను విధానంలోకి మరికొన్ని ఉత్పత్తులను తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ చూస్తోంది. ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం, రియాల్టీని తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తోందని బిహార్ ఆర్థిక మంత్రి సుశిల్ మోదీ చెప్పారు. ఎలక్ట్రిసిటీ, రియల్ ఎస్టేట్, స్టాంప్ డ్యూటీ, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకురావాలనుకుంటున్నామని ఇండస్ట్రి ఛాంబర్ ఫిక్కీ వార్షిక సమావేశంలో ఆయన తెలిపారు. అయితే ఏ సమయం వరకు వీటిని జీఎస్టీలోకి తీసుకొస్తామో చెప్పడం కష్టమన్నారు. చట్టాన్ని సవరణ చేయకుండానే వీటిని కలుపబోతున్నట్టు పేర్కొన్నారు. ఒకవేళ పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పాలనలోకి తీసుకొస్తే, ఇవి అత్యధిక మొత్తంలో పన్ను శ్లాబులోకి వచ్చే అవకాశముంటుంది. అదేవిధంగా రాష్ట్రాలు తమ రెవెన్యూలను కాపాడుకోవడానికి సెస్‌ను విధించబోతున్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం రెవెన్యూలను పెట్రోలియం ఉత్పత్తుల నుంచి ఆర్జిస్తున్నాయి. జీఎస్టీ పన్ను విధానంలో ఐదు పన్ను శ్లాబులు 0 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం ఉన్నాయి. కొన్ని ఉత్పత్తులపై అదనంగా జీఎస్టీ సెస్ విధిస్తున్నారు. వీటిలో అత్యధిక పన్ను శ్లాబుగా ఉన్న 28 శాతాన్ని 25 శాతానికి తగ్గించబోతున్నారు. లేదా 12 శాతం, 18 శాతం పన్ను శ్లాబులను ఒకటిగా కలుపబోతున్నారు. -
త్వరలో పెట్రోల్ దిగుమతి అవసరం ఉండదట!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం భారత్ కేవలం రూ. 4.5 లక్షల కోట్ల ముడిచమురును మాత్రమే దిగుమతి చేసుకుంటోంది. గతంలో దాదాపు రూ. 7.54 లక్షల కోట్ల మేర ముడిచమురును దిగుమతి చేసుకుంటే తప్ప మన అవసరాలు తీరేవి కావు. కానీ, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధిపై దేశం దృష్టి పెట్టడంతో ముడిచమురు దిగుమతి గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఇక త్వరలోనే ముడిచమురు దిగుమతి చేసుకొనే అవసరం భారత్ కు ఉండబోదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. 'పెట్రోలియం దిగుమతులు అవసరమే లేని దేశంగా భారత్ ను మేం అభివృద్ధి చేయబోతున్నాం. ఎథనాల్, మెథనాల్, బయో సీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వాడకాన్ని మేం ప్రోత్సహిస్తున్నాం. దీనివల్ల గ్రామీణ, వ్యవసాయ రంగాలకు ఊతం లభిస్తుంది. పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది' అని కేంద్ర రోడ్డురవాణా శాఖమంత్రి గడ్కరీ బుధవారం తెలిపారు. మెథనాల్ ఇంధన వనరు వినియోగంపై నీతి ఆయోగ్ సంస్థ నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. గతంలో భారత్ రూ. 7.5 లక్షల కోట్ల ముడిచమురును దిగుమతి చేసుకునేదని, ఇప్పుడు కేవలం రూ. 4.5 లక్షల ముడిచమురు మాత్రమే దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగాఈ వృద్ధి చెందుతున్న భారత్ కు.. వ్యవసాయం, వెదురు ఉత్పత్తి, మిగులు బొగ్గు గనులను ఉపయోగించుకునే సువర్ణావకాశం లభించిందని తెలిపారు. ఇందుకోసం వ్యవసాయ రంగాన్ని విభిన్నరీతిలో ఇంధన అవసరాలు తీర్చే దిశగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని చెప్పారు. -
త్వరలో పెట్రో ఉత్పత్తుల దిగుమతి రహిత దేశంగా భారత్!
న్యూఢిల్లీ: భారత్ త్వరలో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి రహిత దేశంగా మారనుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారంనాడు పేర్కొన్నారు. ఫ్యూయెల్ ఎకానమీకి ప్రత్యామ్నాయం అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించినట్లు తెలిపారు. ‘మిథనాల్ ఎకానమీ’పై నీతి ఆయోగ్ ఇక్కడ మంగళవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెట్రోలియంకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్, మిథనాల్, బయో-సీఎన్జీల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అభివృద్ధి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇది గ్రామీణ, వ్యవసాయ కేంద్రాల వృద్ధికి, ఉపాధి కల్పనకు కూడా దోహదం చేసే అంశంగా వివరించారు. అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉన్నప్పటికీ, భారత్ ప్రస్తుత క్రూడ్ దిగుమతుల బిల్లు రూ.4.5 లక్షల కోట్లని పేర్కొన్నారు. ఇంతక్రితం ఈ బిల్లు రూ.7.5 లక్షల కోట్లుగా తెలిపారు. వ్యవసాయంలో విభిన్న ఉత్పత్తుల ద్వారా ప్రయోజనం పొందడానికి ఇది సువర్ణ అవకాశం అని ఆయన వివరించారు. -
మెడపై మచ్చలు తొలగాలంటే...
బ్యూటిప్స్ బ్యూటిప్స్అందమైన మెడ... ముఖారవిందాన్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. చెమట, మురికి కారణంగా మెడ భాగమంతా నల్లగా, డల్‌గా అవుతుంది. ఈ సమస్య తీరాలంటే... అరటిపండుని గుజ్జులా చేసి... అందులో కాసిన్ని పాలు, రెండు చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడ భాగానికి ప్యాక్‌లా వేసి, ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. వారానికోసారి చొప్పున ఇలా కొన్ని వారాలు చేస్తే మంచి ఫలితముంటుంది. రోజూ స్నానం చేసేముందు మెడకి పెట్రోలియం జెల్లీ పట్టించాలి. కాసేపు అలా ఉంచి, తర్వాత మెత్తని పొడి బట్టతో రుద్ది తుడవాలి. ఇలా చేయడం వల్ల పేరుకున్న మురికి పోతుంది. తెల్లద్రాక్షలను మెత్తగా రుబ్బి గుజ్జులా చేయాలి. ఈ మిశ్రమంతో మెడను బాగా రుద్ది వదిలేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. వారానికి రెండు మూడుసార్లు ఇలా చేస్తే మెడమీది చర్మం ఆరోగ్యంగా తయారై కాంతులీనుతుంది. మజ్జిగలో దూదిని ముంచి మెడ భాగాన్ని తరచూ శుభ్రం చేసుకుంటూ ఉంటే... మురికి, నలుపు పోయి అందంగా తయారవుతుంది. -
వ్యాట్‌ను రద్దు చేయకుంటే సమ్మె
పెట్రోలియం ట్యాంక్ ట్రక్స్ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ హైదరాబాద్: పెట్రోలియం, ఎల్పీజీ ట్యాంకర్లపై విధించిన విలువ ఆధారిత పన్నును ప్రభుత్వం రద్దు చేయాలని, లేకుంటే ఈ నెల 29 అర్ధరాత్రి నుండి సమ్మెకు దిగుతామని తెలంగాణ పెట్రోలియం ట్యాంక్ ట్రక్స్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు కె. రాజశేఖర్, డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్, ఎల్పీజీ ట్రక్స్ ఓనర్స్ అధ్యక్షుడు సురేశ్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఆరీఫ్ ఉల్ ఉస్సెన్, కోశాధికారి బీఎన్ ప్రసాద్ మాట్లాడారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో రవాణా కిరాయిలపై 5 శాతం వ్యాట్‌ను విధించగా... ఈ నెల 5న తెలంగాణ ప్రభుత్వం దానిని 14.5 శాతానికి పెంచిందన్నారు. ప్రభుత్వం దీన్ని తక్షణమే ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన, ఇకపై విధించే పన్నులను ఆయిల్ కంపెనీలే భరించాలన్నారు. ఇకపై డీజిల్ ధరలు పెరిగినా, తగ్గినా అదే రోజు నుంచి కిరాయి సవరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జాయింట్ సెక్రటరీ కె. సుధాకర్‌రెడ్డి, అశోక్‌కుమార్ పాల్గొన్నారు. -
ఎగుమతుల్లో కొనసాగుతున్న నిరుత్సాహం
వరుసగా 16 నెలా క్షీణతే... * మార్చిలో -5.47 శాతంగా నమోదు * 2015-16లో 16 శాతం పతనం న్యూఢిల్లీ: ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణ ధోరణి వరుసగా 16వ నెల మార్చిలోనూ కొనసాగింది. అసలు వృద్ధిలేకపోగా -5.47 శాతం క్షీణత నమోదయ్యింది. మొత్తం ఆర్థిక సంవత్సరం (2015-16, ఏప్రిల్-మార్చిలో 2015-15 ఇదే కాలంతో పోల్చితే) ఎగుమతుల్లో -16 శాతం క్షీణత నమోదయ్యింది. ఒక్క మార్చిని చూస్తే... ఎగుమతులు -5 శాతం క్షీణతతో 23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా క్షీణ బాటలోనే ఉన్నాయి. - 22 శాతం పతనంతో 28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతి-దిగుమతుల మధ్య విలువ వ్యత్యాసం వాణిజ్యలోటు 5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. పెట్రోలియం, ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతుల క్షీణత మొత్తం పరిణామంపై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మందగమన పరిస్థితి దీనికి కారణం. చమురు దిగుమతుల విలువ 36 శాతం క్షీణించి 5 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, చమురు యేతర దిగుమతుల విలువ 18 శాతం క్షీణతలో 23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరంలో ఇలా... 2015-16 ఏప్రిల్ నుంచి మార్చి వరకూ ఎగుమతులు 16 శాతం క్షీణించాయి. 310 బిలియన్ డాలర్ల నుంచి 261 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దిగుమతులు కూడా ఇదే స్థాయిలో క్షీణించి 380 బలియన్ డాలర్లకు పడ్డాయి. దీనితో వాణిజ్యలోటు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో 119 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. బంగారం వెలవెల... కాగా మార్చిలో పసిడి దిగుమతులు 80 శాతం క్షీణించాయి. 5 బిలియన్ డాలర్ల నుంచి ఒక బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయి. 17వ నెలా మైనస్‌లోనే టోకు ద్రవ్యోల్బణం * మార్చిలో -0.85% నమోదు * క్రూడ్, తయారీ విభాగాల్లో తక్కువ ధరల పతనం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు మార్చిలోనూ అసలు పెరుగుదల లేకపోగా ‘మైనస్’ను నమోదుచేసుకుంది. ఈ నెలలో రేటు క్షీణతలో -0.85 శాతంగా నమోదయ్యింది. అంటే 2015 మార్చితో పోల్చితే 2016 మార్చిలో ధరల సూచీ అసలు పెరక్కపోగా... తగ్గిందన్నమాట. ఇటువంటి ధోరణి ఇది వరుసగా 17నెల. క్రూడ్, తయారీ విభాగాల ధరలు దిగువస్థాయిలో ప్రతిబింబించడం దీనికి ప్రధాన కారణం. కాగా కూరగాయలు, ఆహార ధరలు రానున్న నెలల్లో పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సూచీ రానున్న నెలల్లో పెరిగే అవకాశం ఉందని నిపుణుల వాదన. వార్షికంగా 3 విభాగాలూ వేర్వేరుగా.. ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌లో కూడిన ఈ విభాగం రేటు 2015 మార్చిలో క్షీణతలో -0.17 శాతంగా ఉంటే ఇప్పుడు ఈ రేటు 2.13 శాతానికి ఎగసింది. ఇందులో భాగమైన ఫుడ్ ఆర్టికల్స్ రేటు 6.27 శాతం నుంచి 3.73 శాతానికి తగ్గింది. ఇక నాన్ ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో రేటు -6.94 శాతం క్షీణత నుంచి 8.09 శాతం పైకి చేరింది. ఇంధనం, లైట్: ఈ రేటులో క్షీణ రేటు -12.23 శాతం నుంచి -8.30కి చేరింది. తయారీ: ఈ విభాగంలో క్షీణత రేటు సైతం -0.19 శాతం నుంచి 0.13 శాతానికి దిగింది. ప్రధాన ఆహార ఉత్పత్తుల ధరలు ఇలా... కూరగాయల ధరలు వార్షికంగా అసలు పెరక్కపోగా -2.26 శాతం తగ్గాయి. తృణ ధాన్యాల ధరలు 2.47 శాతం, పప్పు దినుసుల ధరలు 35 శాతం పెరిగాయి. ఉల్లిపాయల ధరలు 18 శాతం, పండ్ల ధరలు 2 శాతం తగ్గాయి. -
పెట్రోల్, డీజిల్ పై ‘లెవీ’ మోత!
దొడ్డిదారిన రూ.480 కోట్లు సమకూర్చుకునేందుకు సర్కారు ఎత్తుగడ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు పన్నుల ద్వారా రూ.480 కోట్లు సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘లెవీ’ విధించాలని వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రాష్ట్రంలో విక్రయించే పెట్రోల్, డీజిల్‌లపై ప్రస్తుతం వసూలు చేస్తున్న పన్నులకు అదనంగా లీటర్‌పై ఒక రూపాయి ‘లెవీ’ విధించాలని సూచించింది. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా... ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర వేయడమే మిగిలింది. పెట్రోల్, డీజిల్‌లపై వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేస్తున్న వ్యాట్‌కు ఈ ‘లెవీ’ అదనం. ఏటా రూ.6,500 కోట్లు రాష్ట్రంలో వినియోగమవుతున్న పెట్రోల్, డీజిల్‌పై ‘వ్యాట్’ ద్వారా 2015 ఏప్రిల్ నుంచి 2016 ఫిబ్రవరి వరకు రూ.5,956 కోట్లు వసూలైంది. మార్చి నెలలో మరో రూ.550కోట్ల వరకు రావచ్చని అధికారుల అంచనా. పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం వ్యాట్ ద్వారానే ఈ మొత్తం సమకూరింది. వాస్తవానికి 2015-16లో పెట్రోల్, డీజిల్‌మీద రూ.7,850కోట్లు వస్తుందని అంచనా వేయగా... ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో సుమారు రూ.6,500కోట్ల (82 శాతం) వరకు వసూలవుతోంది. ఈ నేపథ్యంలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో అదనంగా మరో వెయ్యి కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ మీద లీటర్‌కు ఒక రూపాయి చొప్పున ‘లెవీ’ వసూలు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా సంవత్సరానికి రూ.480కోట్లు వసూలవుతుందని అంచనా వేశారు. ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచకుండా రూ.4 అదనంగా వసూలు చేస్తున్నారు. అలా తెలంగాణలో కన్నా లీటరుకు ఒక రూపాయి ఎక్కువగా సమకూరుతోంది. దీంతో వ్యాట్‌ను పెంచడం కన్నా, ‘లెవీ’ వసూలు చేయడమే మేలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన ఫైలు సీఎంవోలో ఉన్నట్లు సమాచారం. మరిన్ని అంశాల్లోనూ.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల శాఖ వసూళ్ల లక్ష్యం రూ.42,073కోట్లుగా తాజా బడ్జెట్లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2015-16) సంబంధించి ఫిబ్రవరి వరకు రూ.27,873 కోట్లు వసూలుకాగా... ఈనెలాఖరుకల్లా మరో రూ.3వేల కోట్లు సమకూరుతుందని అంచనా. అయితే పెరిగిన వసూళ్ల అంచనాలకు అనుగుణంగా ఆదాయం సమకూర్చుకునే పనిలో వాణిజ్య పన్నుల శాఖ పడింది. లీజు లావాదేవీలపై పన్నుల ద్వారా రూ.60కోట్లు సమకూర్చుకునే బిల్లును ఇటీవలే అసెంబ్లీ ఆమోదించింది. ఇన్వాయిస్ ట్రాకింగ్ విధానం ద్వారా రూ.120కోట్లు వసూలు చేసే ప్రతిపాదనను మే నుంచి అమలు చేయనున్నారు. డీటీహెచ్ మీద వినోదపన్ను రూపంలో మరో రూ.24 కోట్లు, హెచ్ఆర్బీటీ చట్టం అమలు ద్వారా రూ.10 కోట్లు, కేబుల్ కనెక్షన్లపై వినోద పన్నును రూ.5 నుంచి రూ.10కి పెంచడం ద్వారా మరో రూ.20 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించింది. మొత్తంగా రూ.864 కోట్లు అదనంగా వసూలు చేసే ఈ ప్రతిపాదనల్లో కొన్ని ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే వాటికి ఆమోదం లభించనుందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ధాన్యం సేకరణ పన్నుపైనా లెవీ రైతుల నుంచి ధాన్యం సేకరణపై కొనుగోలు పన్ను (పర్చేస్ ట్యాక్స్)ను ఇప్పటికే వసూలు చేస్తుండగా, అదనంగా ‘లెవీ’ వసూలు చేయాలని వాణిజ్య పన్నుల శాఖ ప్రతిపాదించింది. తద్వారా ఏడాదికి రూ.150కోట్లు వసూలవుతుందని భావిస్తున్నారు. రైతు పండించిన పంటకు ఎలాంటి పన్ను వసూలు చేయని ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి విక్రయించే వారిపైన, రైస్‌మిల్లర్లు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారిపై పన్ను విధిస్తోంది. తద్వారా వసూలవుతున్న పన్నుకు అదనంగా ‘లెవీ’ని విధించనుంది. -
బ్యూటిప్
ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తమ బ్యాగులో లిప్‌బామ్ కానీ పెట్రోలియం జెల్లీ చిన్న బాటిల్‌ను కానీ పెట్టుకొని తీరాల్సిందే. అలా చేస్తే పొడిబారిన పెదాలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. -
రిలయన్స్ లాభాల రికార్డ్
క్యూ2లో రూ. 6,720 కోట్లు; 12.5 శాతం అప్ ♦ 34% తగ్గిన ఆదాయం; రూ.75,117 కోట్లు ♦ 10.6 డాలర్లకు స్థూల రిఫైనింగ్ మార్జిన్... ♦ కలిసొస్తున్న క్రూడ్ ధరల పతనం... న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు లాభాల పంట పండింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పతనం కారణంగా... రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారంలో పటిష్టమైన మార్జిన్ల ఆసరాతో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. అంచనాలను మించి.. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2015-16, క్యూ2)లో కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.6,720 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.5,972 కోట్లతో పోలిస్తే 12.5% ఎగబాకింది. రిలయన్స్ కంపెనీ చరిత్రలో ఒక క్వార్టర్లోఇదే అత్యధిక లాభం కావడం గమనార్హం. అయితే, క్రూడ్ క్షీణత ప్రభావంతో కంపెనీ మొత్తం ఆదాయం భారీగా దిగొచ్చింది. క్రితం ఏడాది క్యూ2లో రూ.1,13,396 కోట్లతో పోలిస్తే 34% తగ్గి... రూ.75,117 కోట్లకు చేరింది. కాగా, మార్కెట్ విశ్లేషకులు క్యూ2లో రిలయన్స్ సగటున రూ.6,000 కోట్ల నికర లాభాన్ని అంచనా వేశారు. అమెరికా షేల్ గ్యాస్ పైప్‌లైన్ వెంచర్లో వాటాను ఈఎఫ్ఎస్ మిడ్స్ట్రీమ్ను విక్రయం వల్ల లభించిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే క్యూ2 లాభంలో రూ.252 కోట్లు అదనంగా కలసిఉందని కంపెనీ తెలిపింది. దీన్ని తీసేస్తే లాభం రూ.6,468 కోట్లు కిందలెక్క. దీని ప్రకారం ఈ ఏడాది క్యూ1లో లాభం రూ.6,222 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా చూస్తే... ఈ క్యూ2లో 4 శాతం పెరిగింది. ఏడేళ్ల గరిష్టానికి జీఆర్ఎం... సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల రిఫైనింగ్ మార్జిన్(ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించే రాబడి- జీఆర్ఎం) కూడా 10.6 డాలర్లకు దూసుకెళ్లింది. ఇది ఏడేళ్ల గరిష్ట స్థాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో జీఆర్ఎం 8.3 డాలర్లు కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో 10.4 డాలర్లు. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ►{పధానమైన కేజీ-డీ6 చమురు-గ్యాస్ క్షేత్రాల్లో ఉత్పత్తి అట్టడుగు స్థాయిలోనే కొనసాగుతోంది. క్యూ2లో ఇక్కడి నుంచి 0.39 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్, 37 బిలియన్ ఘనపుటడుగుల(బీసీఎఫ్) సహజ వాయువు ఉత్పత్తి అయింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే గ్యాస్ ఉత్పత్తి 9 శాతం, ముడిచమురు ఉత్పత్తి 24 శాతం చొప్పున దిగజారింది. ముఖ్యంగా క్షేత్రాల్లో భౌగోళిక పరమైన అడ్డంకులు దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. ►రిఫైనరీ వ్యాపారం పన్ను ముందు లాభం(ఎబిటా) 42.1 శాతం ఎగబాకి రూ. 5,461 కోట్లకు చేరింది. పెట్రోకెమికల్స్ వ్యాపార ఎబిటా 7.2 శాతం వృద్ధితో రూ.2,531 కోట్లుగా నమోదైంది. ►చమురు-గ్యాస్ వ్యాపార ఎబిటా 83.1 శాతం దిగజారి రూ.56 కోట్లకు పడిపోయింది. ►రిటైల్ వ్యాపార విభాగం జోరు కొనసాగుతోంది. క్యూ2లో రిలయన్స్ రిటైల్ మొత్తం ఆదాయం 22 శాతం ఎగబాకి రూ.5,091 కోట్లకు చేరింది. పన్ను ముందు లాభం రూ.186 కోట్ల నుంచి రూ. 210 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్ చివరినాటికి కంపెనీ దేశవ్యాప్తంగా 250 నగరాల్లో 2,857 స్టోర్లను నిర్వహిస్తోంది. ►సెప్టెంబర్ చివరినాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ. 1,72,765 కోట్లుగా ఉంది. ఇక నగదు తత్సంబంధ నిల్వలు రూ.85,720 కోట్లుగా ఉన్నాయి. ►రిలయన్స్ షేరు ధర బీఎస్ఈలో 0.91% లాభంతో రూ.912 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. జియో ‘ఎల్వైఎఫ్’ 4జీ హ్యాండ్సెట్లు వస్తున్నాయ్... 4జీ వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను వివిధ నగరాల్లో విజయవంతంగా పరీక్షించామని.. త్వరలోనే వాణిజ్యపరంగా సర్వీసులను ప్రారంభించనున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తెలిపింది. డిసెంబర్లో సర్వీసులు ఆరంభం కావచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే తమ సొంత బ్రాండ్ ‘ఎల్వైఎఫ్’ పేరుతో 4జీ హ్యాండ్సెట్ల విక్రయాన్ని ప్రారంభించనున్నట్లు(నవంబర్‌లో వచ్చే చాన్స్) కంపెనీ పేర్కొంది. -
పెట్రోలియం డీలర్ల సమ్మె విరమణ
సాక్షి,హైదరాబాద్: తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం మంగళవారం చేయ తలపెట్టిన సమ్మెను పెట్రోలియం డీలర్లు విరమించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జీ వినయ్‌కుమార్ మాట్లాడుతూ సోమవారం ముంబైలో చమురు శాఖ మంత్రి సమక్షంలో చర్చలు జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మూడు ప్రధాన చమురు కంపెనీలు పెట్రోలియం డీలర్ల అసోసియేషన్‌కు లిఖితపూర్వక హామీ ఇచ్చినట్లు వారు వివరించారు. దీంతో డీలర్లు మంగళవారం పెట్రోల్ ఉత్పత్తుల కొనుగోళ్లు కొనసాగించాలని వారు పేర్కొన్నారు.