
ముంబై: ముంబైలోని భారత్ పెట్రోలియం శుద్ధి కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 43 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 22 మందికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపించామని, 21 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని ఆరో జోన్ డిప్యూటీ కమిషనర్ షహజి ఉమాప్ తెలిపారు. తూర్పు ముంబైలోని చెంబూర్‌లోని కర్మాగారంలో మధ్యాహ్నం సంభవించిన పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. హైడ్రోక్రాకర్ ప్లాంట్‌లోని కంప్రెషర్ షెడ్ల వేడి, ఒత్తిడి వల్ల పేలుడు సంభవించినట్లు సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment