కెరీర్‌ కౌన్సెలింగ్‌.. | information in Petroleum specialization courses | Sakshi
Sakshi News home page

కెరీర్‌ కౌన్సెలింగ్‌..

Published Mon, Dec 18 2017 11:00 AM | Last Updated on Mon, Dec 18 2017 11:00 AM

information in Petroleum specialization courses - Sakshi

పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో పెట్రోలియం స్పెషలైజేషన్‌తో అందుబా టులో ఉన్న కోర్సులు, ఆఫర్‌ చేస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి? – రామ్‌ కుమార్, హైదరాబాద్‌.

సావిత్రిబాయి ఫూలే పుణె విశ్వవిద్యాలయం.. ఎంఎస్సీ (పెట్రోలియం టెక్నాలజీ) కోర్సును అందిస్తోంది. ఈ కోర్సు కాల వ్యవధి రెండేళ్లు. బీఎస్సీ పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు అర్హులు.
వివరాలకు: www.unipune.ac.in
రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ–రాయ్‌బరేలీ, ఎంటెక్‌ (పెట్రోలియం ఇంజనీరింగ్‌) కోర్సును ఆఫర్‌ చేస్తుంది.
అర్హత: పెట్రోలియం ఇంజనీరింగ్‌లో 60 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు) నాలుగేళ్ల వ్యవధితో బీటెక్‌/బీఈ. తగిన గేట్‌ స్కోర్‌ కూడా ఉండాలి.
వివరాలకు: www.rgipt.ac.in
యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ (యూపీఈఎస్‌)–డెహ్రాడూన్, ఎంటెక్‌ (పెట్రోలియం ఇంజనీరింగ్‌) కోర్సును అందిస్తోంది.
అర్హత: హయ్యర్‌ అండ్‌ సెకండరీ లెవెల్‌లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. 60 శాతం మార్కులతో పెట్రోలియం ఇంజనీరింగ్‌/అప్లైడ్‌ పెట్రోలియం ఇంజనీరింగ్‌/గ్యాస్‌ ఇంజనీరింగ్‌/పెట్రోలియం రిఫైనింగ్‌/పెట్రోకెమికల్‌ ఇంజనీరింగ్‌/జియోసైన్సెస్‌లో బీటెక్‌/బీఈ. తగిన గేట్‌ స్కోర్‌ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వివరాలకు: www.upes.ac.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement