వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లును ఆమోదించేందుకు ఈనెల 16వ తేదీన అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.
సాక్షి, అమరావతి: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లును ఆమోదించేందుకు ఈనెల 16వ తేదీన అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు అసెంబ్లీ ఇంచార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ బుధవారం ప్రకటన జారీచేశారు. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాట్ స్థానంలో జీఎస్టీ అమల్లోకి రానుంది. రాష్ట్రంలో జీఎస్టీ అమల్లోకి రావాలంటే శాసనసభ బిల్లును ఆమోదించాల్సి ఉంది.