జైలులో కేజ్రీవాల్‌.. నేడు ఢిల్లీ అసెంబ్లీ సమావేశం! | Delhi Assembly Session Today, 1st Since CM Arvind Kejriwal Arrest | Sakshi
Sakshi News home page

జైలులో కేజ్రీవాల్‌.. నేడు ఢిల్లీ అసెంబ్లీ సమావేశం!

Published Wed, Mar 27 2024 9:06 AM | Last Updated on Wed, Mar 27 2024 10:00 AM

Delhi Assembly Session Today 1st Since CM Arvind Kejriwal Arrest - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మనీలాండరింగ్‌ కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్నారు. కోర్టు ఆయనకు మర్చి 28 వరకు ఈడీ కస్టడీ విధించింది. సీఎం కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో మొదటిసారి ఇవాళ (బుధవారం) ఢిల్లీ అసెంబ్లీ సమావేశం జరగనుంది. సీఎం కేజ్రీవాల్‌ లేకుండా జరిగే ఈ అసెంబ్లీ సమావేశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే.. అసెంబ్లీలో వైద్య సదుపాయాలకు సంబంధించి అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఈడీ లాకప్‌ నుంచే సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నిన్న (మంగళవారం) పరిపాలనకు సంబంధించి రెండో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మొహల్లా క్లినిక్‌లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి  సౌరభ్‌ భరద్వాజ్‌ తెలిపారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులు, మొహల్లా క్లినిక్‌లతో ఉచిత మందులు, వైద్య పరీక్షకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని మంత్రి  సౌరభ్‌ భరద్వాజ్‌ చీఫ్‌ సెక్రటరీ నరేష్‌ కుమార్‌ను కోరారు. అయితే ఇవాళ ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా వైద్యానికి సంబంధించిన అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇక.. ఈడీ లాకప్‌ నుంచి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పారిపాలన సాగించటంపై బీజేపీ మండిపడుతోంది. సీఎంగా కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు తమ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కాగితం, కంప్యూటర్‌ వంటి వాటిని సమకూర్చలేదని ఈడీ పేర్కొంది. అయితే సీఎం కేజ్రీవాల్‌ జారీ చేస్తున్న ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తున్నయన్న కోణంలో తాము దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.ఇక.. మొదటి పరిపాలన ఆదేశాలు అందుకున్న ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రిని అతిశీని ఈ విషయంపై ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం.

మరోవైపు.. ఈడీ అరెస్ట్‌ చేయటం అక్రమమంటూ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement