Assembly meeting
-
జైలులో కేజ్రీవాల్.. నేడు ఢిల్లీ అసెంబ్లీ సమావేశం!
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్నారు. కోర్టు ఆయనకు మర్చి 28 వరకు ఈడీ కస్టడీ విధించింది. సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో మొదటిసారి ఇవాళ (బుధవారం) ఢిల్లీ అసెంబ్లీ సమావేశం జరగనుంది. సీఎం కేజ్రీవాల్ లేకుండా జరిగే ఈ అసెంబ్లీ సమావేశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే.. అసెంబ్లీలో వైద్య సదుపాయాలకు సంబంధించి అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈడీ లాకప్ నుంచే సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిన్న (మంగళవారం) పరిపాలనకు సంబంధించి రెండో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మొహల్లా క్లినిక్‌లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులు, మొహల్లా క్లినిక్‌లతో ఉచిత మందులు, వైద్య పరీక్షకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని మంత్రి సౌరభ్ భరద్వాజ్ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌ను కోరారు. అయితే ఇవాళ ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా వైద్యానికి సంబంధించిన అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక.. ఈడీ లాకప్ నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పారిపాలన సాగించటంపై బీజేపీ మండిపడుతోంది. సీఎంగా కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు తమ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కాగితం, కంప్యూటర్ వంటి వాటిని సమకూర్చలేదని ఈడీ పేర్కొంది. అయితే సీఎం కేజ్రీవాల్ జారీ చేస్తున్న ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తున్నయన్న కోణంలో తాము దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.ఇక.. మొదటి పరిపాలన ఆదేశాలు అందుకున్న ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రిని అతిశీని ఈ విషయంపై ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. మరోవైపు.. ఈడీ అరెస్ట్ చేయటం అక్రమమంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. -
చర్చకు తేవాల్సిన అంశాలెన్నో..
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లాకు సంబంధించి చాలా అంశాలు అసెంబ్లీలో చర్చకు రావాలని జిల్లావాసులు కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ చుట్టుపక్కల ఔటర్ రింగు రోడ్డు పనులకు 2017 అక్టోబర్‌లో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూరల్ జిల్లాలోని టెక్స్టైల్ పార్కు స్థలంలోనే శిలాఫలకం వేశారు. నగరం చుట్టూ 69 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. 29 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ రాంపూర్ నుంచి దామెర వరకు నిర్మించింది. మరో 40 కిలోమీటర్ల మేర పెండింగ్ పడింది. వరంగల్ మహా నగరాన్ని అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ముంపు బెడద 15 ఏళ్లుగా ఉంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రిగా ఉండగా.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి చెందినవారే. వరంగల్ నగరాభివృద్ధితో పాటు వరంగల్, వరంగల్ పశ్చిమతో పాటు వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల శివారు గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మడికొండలో మూడు నక్షత్రాల హోటల్‌తో స హా, హైదరాబాద్‌లోని హైటెక్స్ తరహాలో అంతర్జాతీయ సమావేశ, వాణిజ్య ప్రదర్శనల కేంద్రం (వైటెక్స్) నిర్మించేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీన్ని పీపీపీ మోడ్‌లో నిర్మించి నిర్వహించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర పారి శ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ భూసేకరణ చేసి ఇవ్వాల్సి ఉంది. నిధులిస్తేనే ఇవన్నీ జరిగేది. జయశంకర్ భూపాలపల్లి నుంచి ములుగు కొత్త జిల్లాగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పాలనపరంగా ఇంకా కుదుటపడేందుకు వసతులు కల్పించాలి. ఉమ్మడి వరంగల్‌లో పలు ప్రాజెక్టులు, పథకాలపై స్పష్టత ఇచ్చేలా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు. వరంగల్‌లోని మామునూరులో విమానాశ్రయం రావాలన్న ఎన్నో ఏళ్ల కల నెరవేరడం లేదు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు 700 ఎకరాలకుపైగా స్థలం అందుబాటులో ఉంది. మరో 200 నుంచి 400 ఎకరాల భూసేకరణ అవసరమని, గత ప్ర భుత్వం సేకరించి ఇస్తామన్నా సాధ్యం కాలేదు. ఇదివరకే మట్టి నమూనా పరీక్షలు కూడా నిర్వహించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్లు రెండేళ్లుగా భూకేటాయింపుల కోసం ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్నట్లు వరంగల్లోనూ మెట్రో రైలును తీసుకొచ్చేందుకు చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. మెట్రో నియో రైలు ప్రాజెక్టుకు కాకతీయ పట్ట ణాభివృద్ధి సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి మూడేళ్ల కిందట ప్రభుత్వానికి సమర్పించింది. రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో కాజీపేట నుంచి వరంగల్ వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించే ఇందులో సగం నేలపై సగం ఆకాశ మార్గంలో నడిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈసారైన నిధులు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది. కాకతీయ మెగా జౌళి పార్కులో పరిశ్రమల ఏర్పాటు, సౌకర్యాల కల్పనకు గత ప్రభుత్వం రూ.574 కోట్లను మంజూరు చేసి రూ.174 కోట్లు విడుదల చేసింది. ఆమేరకు పలు మౌలిక వసతులు కల్పించగా.. మరో రూ.400 కోట్లు రావాల్సి ఉంది. పార్కులో కొన్ని ప్రాంతాల్లో రహదారులను నిర్మించి, విద్యుత్ సరఫరా కోసం ఉపకేంద్రాన్ని నిర్మించారు. మిషన్ భగీరథ ద్వారా 12 ఎంఎల్డీ సామర్థ్యం గల వ్యవస్థను ఇంకా నిర్మించుకోవాల్సి ఉంది. మొత్తం 1200 ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన నిధులు, అన్ని రకాల వసతులు తీర్చుదిద్దుకుంటే మరికొన్ని వస్త్ర పరిశ్రమలు వచ్చే వీలుంది. భూపాలపల్లికి ఎస్సారెస్పీ, దేవాదుల నుంచి సాగునీటి పంపిణీని మెరుగుపర్చాలి. చిన్నకాళేశ్వరం పూర్తి చేయాలి. ములుగు జిల్లాలో ములు గు, ఏటూరునాగారంలో బస్సు డిపోల ఏర్పా టు, గోదావరి తీర ప్రాంతాల్లో ముంపు నివారణ చర్యల కోసం కరకట్టల నిర్మాణం చేపట్టాలంటే పెద్దమొత్తంలో బడ్జెట్లో నిధులు రాబట్టాలి. ఇవి చదవండి: ‘కుప్టి’కి నిధులు కేటాయించేలా చూస్తా.. -
కాళేశ్వరం, మిషన్ భగీరథపై న్యాయవిచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులకుప్పలా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులను చేపట్టారని, అనవసరమైన ఖర్చులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఆగం చేశారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో శనివారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని జీవన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రస్తావించారు. సాంకేతిక పరిజ్ఞానం అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, కానీ అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రస్తుత రోజుల్లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లోపభూయిష్టంగా మారడం విడ్డూరమే అని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడంతో పాటు అన్నారం బ్యారేజీలో సైతం లీకేజీలు ఏర్పడటం విచారకరమన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు సంబంధించి ఎల్అండ్టీ తొలుత చేపడుతుందని చెప్పినప్పటికీ... ఇప్పుడు చేయనని అంటోందని చెప్పారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై న్యాయ విచారణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని, అప్పటికే చాలా గ్రామాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థ ఉన్నప్పటికీ వృథా ఖర్చులతో మళ్లీ మిషన్ భగీరథ పనులు చేపట్టి ప్రజాధనాన్ని నీటిపాలు చేశారని విమర్శించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నిరుద్యోగులు హర్షించేవారని, కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు మానసికంగా ఆందోళన చెందారన్నారు. జీవో 317 ద్వారా ఉద్యోగులు నష్టపోయారని, వారికి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలను కలిసే సీఎం రేవంత్: నర్సిరెడ్డి పదేళ్ల కేసీఆర్ పాలనలో సామాన్యుడిని సీఎం కలిసే పరిస్థితే ఉండేది కాదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. మండలిలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆయన బలపర్చారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ తను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక దాదాపు 30 సార్లు కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయతి్నంచినా అవకాశం దక్కలేదని, ఒకసారి అవమానానికి సైతం గురయ్యానన్నారు. కానీ రేవంత్‌రెడ్డి సీఎం అయిన మరుసటిరోజే ప్రజాభవన్‌లో కలిశానని చెప్పారు. ప్రజలను కలిసి వారి సమస్యలు వినే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని, ఈ ఐదేళ్ల కాలంలో ఇదే తరహాలో పాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి లెక్కల్లేవు: ఉత్తమ్ బీఆర్ఎస్ పాలనలో పౌరసరఫరాల విభాగాన్ని అల్లకల్లోలం చేశారని, ఆ శాఖ వద్ద 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి లెక్కల్లేవని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ ధాన్యం ఉందా? లేదా? ఉంటే ఎక్కడుంది? అనే అంశాలకు కాగితాల్లో ఎక్కడా వివరాలు లేకపోవడం గమనార్హమని, దీనిపై సమగ్ర పరిశీలన ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. పదేళ్లలో ఈ శాఖ రూ.56 వేల కోట్ల నష్టాల్లో ఉందని చెప్పారు. రేషన్ బియ్యం చాలాచోట్ల లబ్ధిదారులకు చేరడం లేదని, దీనిపై మరింత లోతైన చర్యలు చేపడతామన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బీఆర్ఎస్ సభ్యులు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచి్చన ప్రతి హామీని నెరవేర్చాలని, మానవహక్కుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రకటన హర్షనీయమని, భావప్రకటన స్వేచ్ఛపై సీఎం చేస్తున్న ప్రకటనలు అమలు జరిగేలా చూడాలని అన్నారు. -
అప్పుల రాష్ట్రంగా మార్చారు!
సాక్షి, హైదరాబాద్: ‘సంపదతో కూడిన మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి అప్పుల రాష్టంగా మార్చారు. కృష్ణా, గోదావరి నుంచి ఓ చుక్క నీటినైనా తెచ్చారా? ఒక్క ఎకరాకైనా అదనంగా నీళ్లు ఇచ్చారా? రూ.లక్షల కోట్లు వృథా చేశారు. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఒక్క ఇందిరమ్మ ఇళ్లయినా ఇచ్చారా? రాష్ట్రంలో పదేళ్లు విధ్వంసం చేశారు. స్వేచ్ఛ లేకుండా చేశారు. ప్రజలు స్వేచ్ఛ ఇచ్చేటువంటి తీర్పునిచ్చారు అని గవర్నర్ ప్రసంగంలో చెప్పాం’అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు చేస్తుండగా భట్టి విక్రమార్క పలుమార్లు అడ్డుపడి మాట్లాడారు. ‘మనం తెలంగాణ శాసనసభలో చర్చిస్తున్నాం. 2014 జూన్ 2 నుంచి జరిగిన పనుల గురించే మాట్లాడుకోవాలి’అని చెప్పారు. 55 ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర పాలన వద్దనే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామన్నారు. నాడు కాంగ్రెస్ మంత్రులందరూ రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని తీర్మానం చేశారని, కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించారని చెప్పారు. పార్లమెంట్లో సరైన బలం లేకపోయినా కాంగ్రెస్ మిగిలిన పార్టీలను ఒప్పించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. చర్చ తొలిరోజే దాడితో ప్రసంగాన్ని మొదలుపెడితే ప్రభుత్వం తగిన రీతిలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలోనే ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద 70–80 శాతం ప్రాంతాలకు తాగునీళ్లు ఇచ్చామని భట్టి గుర్తు చేశారు. మిషన్ భగీరథ కోసం రూ.43 వేల కోట్లు్ల ఖర్చు పెట్టి నీళ్లు ఎక్కడ ఇచ్చారని కేటీఆర్‌ను ప్రశ్నించారు. నల్లగొండకు 2014కు ముందు నీళ్లు రాలేదా? అని పేర్కొన్నారు. సీఎం ఎంపిక హైకమాండ్‌దే: మంత్రి దామోదర కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించినప్పుడు సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగించే సంప్రదాయం ఉందని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని తామంతా శిరసావహిస్తామని ప్రజలకు కూడా తెలుసన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలను కాదని రేవంత్‌రెడ్డిని సీఎం చేయడంపై కేటీఆర్ చేసిన విమర్శకు దామోదర ఈ మేరకు స్పందించారు. పైన పటారం.. లోన లొటారం: మంత్రి పొన్నం గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా సాగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైందనే తెలంగాణ తెచ్చుకున్నామని, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన కార్యక్రమాల గురించి మాట్లాడుకుందామని కేటీఆర్‌కు సూచించారు. మా తాత మీసాల మీద నిమ్మకాయ పెట్టాడంటే నడవదని పొన్నం చెప్పగా.. దీనికి కేటీఆర్ గట్టిగా స్పందించారు. ‘మా తాతలు నెయ్యి తాగిన్రు.. మా మూతులు వాసన చూడండి’అంటే కుదరదని కౌంటర్ ఇచ్చారు. నాగార్జునసాగర్, శ్రీశైలం కట్టామని క్రెడిట్ మాత్రమే తీసుకుంటామంటే నడవదని, కాంగ్రెస్ దురాగతాలను బరాబర్ చెప్తామని పేర్కొన్నారు. మీరా మమ్మల్ని అధికారంలోకి తెచ్చింది: మంత్రి శ్రీధర్ బాబు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో సైతం 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించే చెప్పారని మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం, పేదలకు న్యాయం జరిగాయని, ఇళ్లు, భూములు, పోడు భూములొచ్చాయని చెప్పారు. అలాంటి ప్రభుత్వం కోసమే మళ్లీ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఉమ్మడి ఏపీలో 1999లో 91 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారంటూ.. కాంగ్రెస్‌ను తామే గెలిపించామన్న హరీశ్‌రావు వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ‘నాడు మీరెంత మంది ఉన్నారు? ఎన్ని సీట్లలో పోటీ చేసి ఎంత మంది గెలిచారు? మీరా మమ్మల్ని అధికారంలోకి తెచ్చింది’అని నిలదీశారు. -
Telangana: కొలువుదీరనున్న కొత్త సభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం ఉదయం 11 గంటలకు తొలిసారిగా కొలువు దీరనుంది. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానం తదితరాల కోసం నాలుగు రోజుల పాటు అసెంబ్లీ తొలి సమావేశాలు జరుగనున్నాయి. రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం తొలిరోజు సమావేశంలో కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమా న్ని నిర్వహించేందుకు ఏఐఎంఐఎం సీనియర్ శాసన సభ్యు డు అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్‌గా నామినేట్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌తో రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం 8.30కు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సీఎం ఎ.రేవంత్‌రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు ఈ కార్యక్ర మంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ప్రొటెమ్ స్పీకర్ అధ్యక్షతన తెలంగాణ మూడో శాసనసభ తొలిరోజు సమావేశం ప్రారంభమవుతుంది. తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత తెలుగు అక్షరమాలలోని అక్షర క్రమంలో ఎన్నికైన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలిసారిగా అసెంబ్లీకి 51 మంది అన్ని పార్టీల తరఫున కలుపుకుని మొ త్తం 51 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా, కరీంనగర్ జిల్లా నుంచి 8 మంది తొలిసారిగా ఎన్నికైన వారున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు తొలిసారి అడు గు పెడుతున్నారు. 51 మందిలో 18 మంది క్రియాశీల రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేస్తున్న వారే. కేసీఆర్, రాజాసింగ్ దూరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదు. బీజేపీ తరఫున ఎన్నికైన రాజాసింగ్.. ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యేను నియమించినందున తాను ఆయన ఎదుట ప్రమాణ స్వీకారం చేయబోనని ప్రకటించారు. నేడు స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత స్పీకర్ ఎన్నిక కోసం శనివారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల కానుంది. వికారాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నికైన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయన శనివారం సాయంత్రం సీఎం రేవంత్, మంత్రివర్గం సమక్షంలో నామినేషన్ సమర్పిస్తారని తెలిసింది. కాగా రెండో రోజు ఆదివారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బాధ్యతల స్వీకరణ కార్యక్రమం, ఆ తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. ఈ నెల 11న సోమవారం జరిగే మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వాయిదా పడే సభ తిరిగి 12వ తేదీ మంగళవారం ఉదయం ప్రారంభమవుతుంది. నాలుగో రోజు సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. బీఆర్ఎస్కు విపక్ష హోదా శాసనసభలో మొత్తం 119 మంది సభ్యులకు గాను తెలంగాణ మూడో శాసనసభలో అధికార కాంగ్రెస్‌కు 64, మిత్రపక్షం సీపీఐకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేల బలం ఉంది. బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఏఐఎంఐఎంకు ఏడుగురు సభ్యుల బలం కలిగి ఉన్నాయి. అధికార కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్కు విపక్ష హోదా దక్కే అవకాశముంది. ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్ మూడో శాసనసభ తొలి సమావేశాలు శనివారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం అసెంబ్లీలో అధికారులతో సమీక్ష తర్వాత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్, ఐఏఎస్ అధికారులు అశోక్‌రెడ్డి, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇక పేదల ఇళ్ల స్థలాలకూ ‘భూదాన్’ భూములు
సాక్షి, అమరావతి: పేదలకు మేలు చేయడమే లక్ష్యంగా భూములకు సంబంధించి పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భూదాన్ బోర్డు విషయంలోనూ అదే ఒరవడిని కొనసాగించింది. భూదాన్ బోర్డుకి సైతం పేదలకు ఇళ్ల స్థలాలిచ్చే అధికారాన్ని ఇచ్చింది. ఇందుకోసం 1965 ఏపీ భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని సవరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందింది. భూస్వాములు తమకున్న భూమిలో కొంత పేదలకు ఇవ్వాలని కోరుతూ 1950వ దశకంలో గాంధేయవాది ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమాన్ని చేపట్టారు. ఆయన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పలువురు భూమిని దానం చేశారు. ఇలా సంపన్నులు దానం చేసిన భూములను పేదలకు పంచే విధానాన్ని సూచిస్తూ కేంద్రం భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని రూపొందించగా దానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాలు చట్టాలను చేసుకున్నాయి. మన రాష్ట్రం కూడా 1965లో ఏపీ భూదాన్, గ్రామదాన్ చట్టాన్ని చేసింది. దాని ప్రకారం భూదాన్ యజ్ఞ బోర్డును నియమించి దాని ద్వారా భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారాలు నడిపారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని భూదాన్ భూముల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భూముల వ్యవహారాలన్నింటినీ పరిష్కరించేందుకు ఒక క్రమపద్ధతిలో పనిచేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం భూదాన్ భూముల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్‌ను నియమించింది. అలాగే భూదాన్ భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు వాటి ద్వారా పేదలకు ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో తాజాగా భూదాన్ చట్టాన్ని సవరించింది. ఆచార్య వినోబా భావే లేకపోతే ఆయన నామినేట్ చేసిన వ్యక్తి సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు భూదాన్ బోర్డు చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను నియమించాలి. ఇవీ సవరణలు గత చట్టంలో భూదాన్ భూమిని వ్యవసాయం, ప్రభుత్వం, స్థానిక సంస్థలు, సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగించాలని నిర్దేశించారు. తాజా సవరణలో సామాజిక ప్రయోజనంతోపాటే బలహీనవర్గాలు, పేదల ఇళ్ల స్థలాల కోసం భూమిని కేటాయించే అధికారాలను భూదాన్ బోర్డుకి ఇచ్చారు. గతంలో ఇళ్ల స్థలాలకు కోసం భూదాన్ భూములను వినియోగించే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు వాటికి వినియోగించే అవకాశం ఏర్పడింది. వినోబా భావే మృతి చెందిన 41 సంవత్సరాలు దాటిపోవడంతో ఆయన ఎవరిని నామినేట్ చేశారనే దానిపై స్పష్టత లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని ఒకటి, రెండు సంస్థలు భూదాన్ బోర్డులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడడంతో పలు రాష్ట్రాలు చట్టాలను సవరించుకున్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ప్రభుత్వమే భూదాన్ బోర్డు చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను నియమించేలా చట్టంలో మార్పు చేశారు. భూదాన్ భూమిని పొందిన వ్యక్తి వరుసగా రెండు సాగు సంవత్సరాలు వ్యవసాయం చేయకపోతే ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారంతోపాటు భూమి పొందిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తులు భూమిపై ఉన్నప్పుడు వారి నుంచి భూమిని తిరిగి తీసుకునే అధికారాన్ని తహసీల్దార్‌కు ఇస్తూ ఇప్పుడు చట్టంలో అవకాశం కల్పించారు. తద్వారా అన్యాక్రాంతమైన భూదాన్ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలు ఏర్పడింది. అర్బన్ ప్రాంతాల్లో వ్వవసాయం చేయకుండా ఆగిపోయిన భూదాన్ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగించుకునే అవకాశాన్ని చట్టంలో కల్పించారు. పేదలకు ఇంకా మంచి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఎప్పుడూ పేదల గురించే ఆలోచిస్తారనడానికి ఈ చట్ట సవరణ ఒక ఉదాహరణ. భూదాన్ భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు వాటి ద్వారా పేదలకు ఇంకా మంచి చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ భూముల వివరాలన్నింటినీ సేకరిస్తున్నాం. సీఎం ఆలోచనలకు అనుగుణంగా భూదాన్ భూములపై నిర్ణయాలు తీసుకుంటాం. – తాడి విజయభాస్కర్‌రెడ్డి, ఛైర్మన్, ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డు -
అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య రికార్డు.. 14 వ సారి
కర్ణాటక: రాష్ట్ర శాసనసభా సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కానుండగా, అధికార, విపక్షాల మధ్య పోరాటం ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠభరితంగా మారింది. కాంగ్రెస్ సర్కారు ఐదు గ్యారంటీల పథకాల అమల్లో గందరగోళం, కరెంటు చార్జీల పెంపు, రాష్ట్రంలో కరువు పరిస్థితులు, మత మార్పిడి చట్టం, ఏపీఎంసీ చట్టం రద్దు చేసే విషయాలతో పాటుగా పలు విషయాలు అసెంబ్లీలో సెగలు పుట్టించే అవకాశముంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న 2వ అసెంబ్లీ సమావేశం కాగా, నెల కిందట తొలి అసెంబ్లీ సమావేశం కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, నూతన సభాధ్యక్షుల ఎంపికకు పరిమితమైంది. మూడు పక్షాల వ్యూహాలు ఇక నేడు సోమవారం నుంచి ఈ నెల 14 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ హామీలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టేందుకు ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్ రెడీగా ఉన్నాయి. విపక్షాలను ఎదుర్కొనేందుకు అధికార పక్షంలో సీనియర్లు సన్నద్ధమయ్యారు. గత ప్రభుత్వంలో పలు అంశాల్లో కుంభకోణాలు జరిగాయంటూ వాటిపై దర్యాప్తు కు ఆదేశించినట్లు చెబుతూ అధికార కాంగ్రెస్ ఎదురుదాడి చేయడానికి కాచుకుంది. గ్యారంటీలపై బీజేపీ దృష్టి ముఖ్యంగా గ్యారంటీలపైనే బీజేపీ దృష్టి సారించింది. వీటిని అమలు చేయకుండా ప్రజలను మోసగించారని, తాము అసెంబ్లీ లోపల, బయటా ఆందోళనలు చేస్తామని ప్రకటించడం తెలిసిందే. అసెంబ్లీ లోపల కూడా పోరాటం చేపట్టేందుకు కాషాయం సిద్ధమైంది. జేడీఎస్ కూడా గ్యారంటీల మీదే ఎగువ, దిగువ సభల్లో గళమెత్తనుంది. అందుచేత ఈ సమావేశాలు వేడెక్కే అవకాశాలే అధికం. బీజేపీ ప్రభుత్వ అవధిలో జారీ అయిన మతమార్పిడి నిషేధ చట్టం, ఏపీఎంసీ చట్టాల రద్దు బిల్లులను అసెంబ్లీలో సర్కారు ప్రవేశపెట్టనుంది. అలాగే గతంలో సవరణలు ముందున్న ఏపీఎంసీ చట్టాన్నే మళ్లీ అమలులోకి తెస్తూ బిల్లును ప్రవేశపెట్టనుంది. అలాగే గోహత్య నిషేధం చట్టంపైనా చర్చ జరగవచ్చు. జూలై 7న సిద్దరామయ్య బడ్జెట్ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య 2023–24వ సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆర్థిక శాఖ కూడా ఆయనే వద్దనే ఉంది. ఇప్పటివరకు ఆయన 13 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించి రికార్డు సృష్టించారు. ఇది 14వ సారి అవుతుంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే 13 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఒక రికార్డుగా ఉంది. నేడు గవర్నర్ ప్రసంగం తొలిరోజైన సోమవారం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాధారణంగా సంవత్సర ఆరంభంలో సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించడం సంప్రదాయం. అదే ప్రకారంగానే గత ఫిబ్రవరిలో సమావేశాల్లో ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కావడంతో గవర్నర్ ప్రసంగంతోనే ఆరంభించాలని నిర్ణయించారు. -
అందుకే కుప్పంలో జనం మొట్టికాయలు వేశారు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాజకీయాలకు తావులేకుండా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ప్రభుత్వం మనదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సాధికారతపై చర్చలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మహిళా సాధికారతపై చర్చకు చంద్రబాబు వస్తారేమో అని అనుకున్నాం. ఆలస్యం చేసినా ఇంతవరకు రాలేదు. కుప్పం ఎఫెక్ట్‌తో చంద్రబాబు రాలేదని మావాళ్లు అంటున్నారు. అక్కాచెల్లెమ్మలకు మంచి చేసే ప్రభుత్వం మాది. అమ్మ ఒడి పథకం ద్వారా వారికి అండగా నిలుస్తున్నాం. రాష్ట్రంలో 61 లక్షా 73 వేల పెన్షన్లు అందిస్తున్నాం. అందులో 36 లక్షల 70వేల మంది మహిళలకు పెన్షన్ ఇస్తున్పాం. నెలకు రూ. 1500 కోట్లకు పైగా పెన్షన్లకు ఖర్చు చేస్తున్నాం. సూర్యోదయం కంటే ముందే పెన్షన్లు అందిస్తున్నాం. గతంలో ఎన్నికలకు ముందే పథకాలు అమలయ్యాయి. చరిత్రలో తొలిసారి ఎస్ఈసీగా మహిళ 'అక్కాచెల్లెమ్మలను ఆదుకునేందుకు వైఎస్సార్ ఆసరా పథకం తీసుకొచ్చాం. అదనపు ఆదాయం పొందేలా వ్యాపారాలకు ప్రోత్సాహకాలు ఇచ్చాము. 3.40 లక్షల మందికి ఉపాధి అవకాశాలు చూపించాం. 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం. ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలను కోర్టులకు వెళ్లి, కేసులు వేసి ఆపాలని చూశారు. మంచి పథకాలు ఆపాలని చూడటం ధర్మమేనా?. అందుకే కుప్పంలో జనం మొట్టికాయలు వేశారు. సున్నా వడ్డీ పథకం ద్వారా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్ చేయూత ద్వారా 24.56 లక్షల మందికి రూ.8,944 కోట్లు ఇచ్చాం. కాపు నేస్తం ద్వారా మహిళలకు అండగా నిలబడ్డాం. 3లక్షల 28 వేల మందికి రూ.982 కోట్ల మేర మేలు చేశాం. ఈబీసీ నేస్తం అనే కొత పథకానికి శ్రీకారం చుడతాం. వచ్చే జనవరి 9 నుంచి ఈబీసీ నేస్తం అమలు చేస్తాం. కేబినెట్లో మహిళా సాధికారతకు పెద్ద పీట వేశాం. చరిత్రలో తొలిసారిగా ఎస్ఈసీగా మహిళను నియమించాం. మహిళల భద్రతపై ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం జగనన్న విద్యాదీవెన ద్వారా 18లక్షల 81వేల మందికి రూ.5,573కోట్లు చెల్లించాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా 30లక్షల 16వేల మందికి మేలు కలుగుతోంది. 77 గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాన్ని చేపట్టాం. మహిళల భద్రతకు దిశా చట్టం తీసుకొచ్చాం. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. దిశా యాప్ ద్వారా 6,880 మందిని పోలీసులు కాపాడారు. మద్య నియంత్రణ కోసం పూర్తిగా బెల్ట్‌షాపులు తొలగించాం. మద్యం పట్టుకుంటే షాక్ కొట్టేలా ధరలు పెంచాం. మహిళల భద్రత కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసు వ్యవస్థను తీసుకొచ్చాం. మహిళలపై నేరం జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. మహిళల భద్రతపై ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. -
AP Assembly: రేపు ఒక్కరోజే అసెంబ్లీ!
సాక్షి, అమరావతి: కోవిడ్ ఉధృతి నేపథ్యంలో శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలను గురువారం ఒక్కరోజే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కోవిడ్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మార్చిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి వీలు పడకపోవడంతో మూడు నెలలు (ఏప్రిల్ నుంచి జూన్) ఓటాన్ అకౌంట్‌కు ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టాల్సి ఉండటంతో గురువారం సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆ రోజు ఉదయం 9 గంటలకు ఉభయసభల సభ్యులనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఉభయ సభలు ఆమోదం తెలుపుతాయి. అనంతరం 2021–22 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీకి సమర్పిస్తారు. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లుతోపాటు వివిధ శాఖల పద్దులు, ఆర్డినెన్స్‌ల స్థానే బిల్లులకు ఆమోదం తెలుపుతారు. కాగా.. కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకొని ఒక్కరోజు మాత్రమే నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
ఈ నెల 20న అసెంబ్లీ సమావేశం!
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ ఈ నెల 20వ తేదీన సమావేశం కానుంది. కరోనా ఉధృతి దృష్ట్యా ఒక్క రోజు మాత్రమే సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అధికారవర్గాలు తెలిపాయి. 20వ తేదీన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారని, అదేరోజు బడ్జెట్ ప్రవేశ పెట్టడం, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం ఉంటాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి మార్చిలోనే బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉంది. కరోనా, స్థానిక సంస్థల ఎన్నికల వల్ల మూడు నెలల బడ్జెట్‌కు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. మిగిలిన కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. -
జూన్ 12 నుంచి నూతన శాసనసభ తొలి సమావేశాలు
-
12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ఈ నెల(జూన్) 12న నుంచి నూతన శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 12న కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం, 13న స్పీకర్ ఎన్నిక, 14న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి సారి అసెంబ్లీ హాజరుకాగా, ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. కాగా సమావేశాలు ప్రారంభానికి ముందే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు.ఇప్పటికే ఆయన ఈ నెల 8వ తేదీ ఉదయం తొలుత సచివాలయంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అదే రోజున మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సచివాలయంలో జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణకు ఒక రోజు ముందుగా 7వ తేదీన వైఎస్సార్ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోందో వివరిస్తూ ఆ మరుసటి రోజున జరిగే విస్తరణపై ఎమ్మెల్యేలను మానసికంగా జగన్ సిద్ధం చేస్తారని పార్టీ వర్గాల సమాచారంగా ఉంది. -
ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎస్సైకి గుండెపోటు
-
అసెంబ్లీ వద్ద ఎస్సైకి గుండెపోటు
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ ఆవరణలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై గుండె పోటుకు గురయ్యారు. డ్యూటీలో ఉన్న ఎస్సై కోలా మోహన్‌కు గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలారు. అప్రమత్తమైన మిగతా సిబ్బంది ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
9 సమావేశాలు.. 126 రోజులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ తొలి శాసనసభకు గురువారం చివరి రోజైంది. ఐదేళ్లు నిండకుండానే సభ రద్దయింది. శాసనసభ ఇప్పటివరకు 9 విడతలుగా సమావేశమైంది. 126 రోజులపాటు సమావేశాలు జరిగాయి. 2014 జూన్ 2న ప్రభుత్వం ఏర్పాటవగా.. 2014 జూన్ 9న శాసనసభ తొలి సమావేశం ప్రారంభమైంది. తొలి శాసనసభ సమావేశాలు జూన్ 9 నుంచి 14 వరకు 6 రోజులు జరిగాయి. రెండోసారి 2014లోనే నవంబర్ 5 నుంచి 29 వరకు 19 రోజులు సభ జరిగింది. మూడోసారి 2015 మార్చి 9 నుంచి 26 వరకు 14 రోజులు జరిగాయి. మూడో సెషన్లోనే 2015 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 10 వరకు 7 రోజులు సమావేశాలు జరిగాయి. నాలుగో సెషన్ 2016లో మార్చి 11 నుంచి 31 వరకు 17 రోజులు.. ఐదో సెషన్లో 2016లో ఆగస్టు 30న ఒకే రోజు శాసనసభ సమావేశమైంది. ఆరో సెషన్ 2016 డిసెంబర్ 16 నుంచి 2017 జనవరి 18 వరకు 18 రోజులు.. ఏడో సెషన్ 2017 మార్చి 11 నుంచి 27 వరకు 13 రోజులు జరిగింది. ఏడో సెషన్లో భాగంగానే ఏప్రిల్ 17న ఒక రోజు, ఏప్రిల్ 30న ఒక రోజు కూడా సమావేశాలు జరిగాయి. 8వ సెషన్లో 2017 అక్టోబర్ 29 నుంచి నవంబర్ 17 వరకు 16 రోజులు.. 9వ సెషన్లో 2018 మార్చి 12 నుంచి 29 వరకు 13 రోజులు సమావేశాలు జరిగాయి. -
ఏలికా.. మాట్లాడాలిక!
ఏ నియోజకవర్గాన్ని చూసినా ఏమున్నది గర్వకారణం.. నగరం సమస్తంసమస్యల పద్మవ్యూహం. వానొస్తే చిగురుటాకులా వణుకుతున్న సిటీ. మరమ్మతులకు నోచుకోని రహదారులు.. అడుగడుగునాగుంతలు.. ఆక్రమణలకు గురైన నాలాలు.. పారిశుధ్యం కొరవడిన వీధులు.. నిధులున్నా ముందుకు సాగని అభివృద్ధి పనులు.. తాగునీటి ఇబ్బందులు.. ప్రగతికి దూరంగా మురికివాడలు... ఇలా ఒకటా రెండా మహానగరాన్ని ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. వీటన్నింటినీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యేలు మూడేళ్లుగా చెబుతూనే ఉన్నారు. పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో శుక్రవారం నుంచి శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సభలో సిటీ ఎమ్మెల్యేలు గళం విప్పుతారని నగరవాసులు ఆశిస్తున్నారు. మీ వాణిని మీదైన బాణీలో వినిపించండి ఎమ్మెల్యే సార్లూ..! శేరిలింగంపల్లి:ఎ.గాంధీ ♦ నియోజకవర్గంలో డ్రైనేజీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. రూ.200 కోట్లతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులు అటకెక్కాయి. ♦ చందానగర్‌లోని రెడ్డి కాలనీలో ఎస్టీపీ ప్లాంట్ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ♦ నాలాల విస్తరణ ఊసే లేదు. నాలాలు కబ్జాకు గురవుతుండడంతో కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ఇటీవల వర్షాలకు దీప్తిశ్రీనగర్ నీట మునిగింది. గచ్చిబౌలి నాలా పొంగడంతో ఇందిరానగర్, రాంకీటవర్స్ రోడ్డు జలదిగ్భంధంలో చిక్కుకుంది. ♦ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదు. గౌలిదొడ్డి కేశవ్‌నగర్‌లో రెండెకరాలు, తాజీనగర్లో 1.25 ఎకరాలు, హఫీజ్‌పేట్ సాయినగర్‌లో 1.20 ఎకరాల స్థలం గుర్తించినప్పటికీ పనులు మొదలవడం లేదు. మలక్‌పేట్ :అహ్మద్ బలాల ♦ మలక్‌పేట్ నియోజవర్గంలోని మూసారంబాగ్, అక్బర్‌బాగ్, ఓల్డ్‌మలక్‌పేట, చావుణి డివిజన్లలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ♦ మూసీ పరివాహక ప్రాంతాల్లోని తీగలగూడ, షాలివాహననగర్, చావుణి గుడిసెవాసులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటివరకూ పనులు ప్రారంభం కాలేదు. ♦ చాదర్‌ఘాట్, మలక్‌పేట్‌లోని ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యకు ఇంతవరకూ పరిష్కారం చూపలేదు. ♦ మలక్‌పేట్‌లోని ఆర్యూబీ కింద రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. ముషీరాబాద్ :కె.లక్ష్మణ్ ♦ హుస్సేన్‌సాగర్ నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం కలగానే మారింది. ♦ లోయర్ ట్యాంక్‌బండ్ గోశాల వద్ద పైప్‌లైన్ పగిలిపోయి ఏడాదిగా కలుషిత నీరు వస్తోంది. ♦ అశోక్‌నగర్ బ్రిడ్జి వెడల్పు పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ♦ వీఎస్టీ చౌరస్తా విస్తరణ పనులు చేపట్టాలి. ♦ ముషీరాబాద్‌లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మహేశ్వరం :తీగల కృష్ణారెడ్డి ♦ నియోజకవర్గంలో ఇంటింటికీ కృష్ణా జలాలు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. మీర్పేట్, జిల్లెలగూడ, బడంగ్పేట్, జల్పల్లి మున్సిపాలిటీల పరిధిలో మూడు, నాలుగు రోజులకు ఒకసారి మంచినీరు వస్తోంది. ♦ జిల్లెలగూడ, మీర్పేట్లోని చెరువులను సుందరీకరిస్తామని ఇచ్చిన హామీ అటకెక్కింది. ఈ ప్రాంతాల్లోని చెరువులు మురుగు నీటితో కంపు కొడుతున్నాయి. ♦ రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. మరమ్మతు పనుల ఊసే లేదు. ♦ ఆర్కేపురం ఎన్టీఆర్నగర్ వాసులకు రెగ్యులరైజేషన్ చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. అంబర్‌పేట..: కిషన్‌రెడ్డి ♦ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ♦ బతుకమ్మ కుంట పునరుద్ధరణలో తీవ్ర జాప్యం. ♦ అంబర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో మౌలిక సదుపాయాల కొరత. ♦ ఆధునికీకరణకు నోచుకోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ♦ సమస్యగా పరిణమించిన రత్నానగర్, మోహిన్చెరువు, ఓయూ నాలాలు. చాంద్రాయణగుట్ట: అక్బరుద్దీన్ ఒవైసీ ♦ ఉప్పుగూడ రైల్వే క్రాసింగ్ వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో స్థానికులు, వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. పాతబస్తీ..మారదా.. దుస్థితి చార్మినార్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా నియోజకవర్గాల్లో మూడేళ్లుగా సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు నోచుకోవడం లేదు. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ తాగునీటి కుళాయిల్లో మురుగు నీరు సరఫరా అవుతోంది. చార్మినార్ కాలిబాట పథకం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. -పాషాఖాద్రీ,చార్మినార్ ఎమ్మెల్యే యాకుత్‌పురా: అహ్మద్‌ఖాన్ ♦ సంతోష్‌నగర్ ఐ.ఎస్.సదన్ చౌరస్తా వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం హామీలకే పరిమితమైంది. మూడేళ్లు గడిచినా కార్యరూపం దాల్చలేదు. ♦ పూర్తిస్థాయిలో రీమోడలింగ్ జరగని డ్రైనేజీ వ్యవస్థతో ఇబ్బందులు. ♦ నూర్‌ఖాన్‌బజార్ వద్ద నిర్మిస్తున్న మంచినీటి రిజర్వాయర్ పూర్తి కాలేదు. బహదూర్‌పురా:మోజంఖాన్ ♦ లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ♦ నాలాల విస్తరణ పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. ♦ బహదూర్‌పురా– కిషన్‌బాగ్ రోడ్డులో నౌ నంబర్ వరకు ప్లైఓవర్ బ్రిడ్జి మూడేళ్లుగా పెండింగ్‌లోనే ఉంది. గోషామహల్: రాజాసింగ్‌లోథా ♦ ధూల్‌పేట్‌లోని గుడుంబా తయారీదారులు రోడ్డున పడ్డారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించలేదు. ♦ బేగంబజార్‌లో చేపల మార్కెట్ అభివృద్ధి అటకెక్కింది. ♦ జుమ్మెరాత్ బజార్లో కల్యాణ మండపం నిర్మిస్తామన్న హామీ నెరవేరలేదు. కుత్బుల్లాపూర్:వివేకానంద్ ♦ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నాలుగేళ్లుగా పక్కా భవనం లేదు. ♦ సుభాష్‌నగర్ నుంచి ఫాక్స్‌సాగర్ వరకు నాలా పనులు మొదలు కాలేదు. ♦ జగద్గిరిగుట్టలో బస్సు డిపో ఏర్పాటు కలగానే మారింది. ♦ గాజులరామారం సర్కిల్ పరిధిలో క్వారీ గుంతలు మృత్యుకుహరాలుగా మారాయి. ♦ బహదూర్‌పల్లి, కొంపల్లి మధ్య రోడ్డు విస్తరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ♦ గండిమైసమ్మ జ్యోతిరావు పూలే స్టేడియం పనులు ఒక్క అడుగు కూడా పడలేదు. ♦ రసాయన వ్యర్థాలను అక్రమంగా నాలాల్లోకి వదులుతున్నా చర్యలు శూన్యం. ఉప్పల్:ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ♦ నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు కలగానే మిగిలింది. ♦ ఉప్పల్ ప్రధాన రహదారి విస్తరణ ప్రతిపాదనకే పరిమితం. ♦ ఏడు చెరువుల పరిరక్షణ హామీ అటకెక్కింది. ♦ ఎమ్మెల్యే నిధులు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికే పరిమితం. ♦ నాచారం ప్రధాన రహదారి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే ధర్నా చేసినా ఫలితం లేదు. ♦ పేదలకు ఇళ్ల నిర్మాణం హామీ నెరవేరలేదు. సనత్‌నగర్:తలసాని ♦ నియోజకవర్గంలో ట్రాఫిక్ ప్రధాన సమస్య. బేగంపేట్ ప్రాంతంలో నిత్యం రద్దీ ఉంటుంది. ♦ సికింద్రాబాద్ నుంచి అమీర్‌పేట్, పంజగుట్ట, బాలానగర్, బంజారాహిల్స్, సోమాజిగూడ, సనత్‌నగర్, ఎరగ్రడ్డ, కూకట్పల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదొక్కటే ప్రధాన మార్గంగా ఉంది. ♦ బండమైసమ్మనగర్, జీవై కాంపౌండ్, పొట్టిశ్రీరాములునగర్, అంబేడ్కర్‌నగర్ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలో నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ పునాదుల దశ దాటలేదు. బస్తీవాసులు అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్ :మాగంటి గోపీనాథ్ ♦ బోరబండలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు హామీ నెరవేరలేదు. ♦ బోరబండ పెద్దమ్మనగర్‌లో నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. ఇంకా లబ్ధిదారులకు కేటాయించలేదు. ♦ రహమత్‌నగర్‌లో ఆర్భాటంగా ప్రకటించిన ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ♦ రహమత్‌నగర్‌లో ప్రభుత్వ ఐటీఐ, మ«ధురానగర్లో స్విమ్మింగ్‌పూల్, రాజీవ్‌నగర్‌లో ఇండోర్ స్టేడియం ఏర్పాటు కలగానే మిగిలాయి. మేడ్చల్ :సుధీర్‌రెడ్డి ♦ ఘట్కేసర్ మండలంలో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామన్న ఎమ్మెల్యే హామీ నేరవేరలేదు. ♦ మేడ్చల్, ఘట్కేసర్, శామీర్‌పేట మండలాల్లో మినీ స్టేడియాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. కూకట్పల్లి :మాధవరం కృష్ణారావు ♦ భరత్‌నగర్ మార్కెట్‌ను ఆ«ధునికీకరిస్తామని చెప్పిన హామీ నెరవేరలేదు. ♦ బాలానగర్ చౌరస్తాలో నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి పనులు మొదలు కాలేదు. మల్కాజిగిరి :చింతల కనకారెడ్డి ♦ ఆర్ఓబీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ♦ అల్వాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పడకల సంఖ్య పెంచి, కొత్త భవనాన్ని నిర్మిస్తామని చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. ♦ సఫల్గూడ చెరువులను మినీ ట్యాంక్‌లుగా అభివృద్ధి చేసి, ఇక్కడ బోటింగ్, లైటింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. ఎల్బీనగర్ :ఆర్.కృష్ణయ్య ♦ వర్షాలకు కాలనీలు మునిగిపోతున్నాయి. ఇటీవల తపోవన్ కాలనీ, గ్రీన్‌పార్కు, ఆదర్శనగర్, గడ్డిఅన్నారంలోని ఇళ్లలోని వరద నీరు చేరింది. ♦ నాలాల విస్తరణ ఊసే లేదు. చెరువుల అభివృద్ధి అటకెక్కింది. ♦ రహదారుల విస్తరణ కాగితాలకే పరిమితం. శివారు ప్రాంతాలకు రోడ్లు, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. -
16న అసెంబ్లీ సమావేశం
సాక్షి, అమరావతి: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును ఆమోదించేందుకు ఈనెల 16వ తేదీన అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు అసెంబ్లీ ఇంచార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ బుధవారం ప్రకటన జారీచేశారు. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాట్ స్థానంలో జీఎస్టీ అమల్లోకి రానుంది. రాష్ట్రంలో జీఎస్టీ అమల్లోకి రావాలంటే శాసనసభ బిల్లును ఆమోదించాల్సి ఉంది. -
చంద్రబాబుకు షాక్ ఇస్తున్న మంత్రులు
-
అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు
-
ప్రజాసమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతా
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరు(వేదాయపాళెం): త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై గళమెత్తి సీఎం, మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మూడు వారాల పాటు నిర్వహించాల్సిన అసెంబ్లీ సమావేశాలను మూడు రోజులకు కుదించడం విచారకరమన్నారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. క్రైస్తవ శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని, కొత్తూరు జర్నలిస్టుల కాలనీ అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించాలని కోరనున్నట్లు చెప్పారు. జాతీయ రహదారిపై బుజబుజనెల్లూరు, కనుపర్తిపాడు క్రాస్‌రోడ్డు, చిల్డ్రన్స్‌పార్క్ రోడ్డు, ఎన్టీఆర్నగర్ జంక్షన్ల వద్ద అండర్ బ్రిడ్జిలను నిర్మించాలన్నారు. ప్రత్యేక షాదీమంజిల్, వైఎస్సార్‌నగర్‌లో వసతుల కల్పన, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, నగరపాలక సంస్థకు హడ్కో అప్పుల భారం సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. రైస్‌మిల్లులు, పవర్‌ప్రాజెక్ట్‌ల కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేషన్లో ఎస్సీ సబ్‌ప్లాన్, 14వ ఆర్థిక సంఘ నిధులతో చేపట్టబోయే పనులు ఆలస్యం కాకుండా వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. శాసనసభ సమావేశాలను కుదించిన నేపథ్యంలో సమయాన్ని బట్టి పలు సమస్యలను వివరిస్తానని తెలిపారు. పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాసయాదవ్, కార్పొరేటర్ లేబూరు పరమేశ్వర్‌రెడ్డి, నాయకులు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, సలీమ్, డాక్టర్ సత్తార్, తాళ్లూరు సురేష్‌బాబు, కట్టా రమణయ్య, విద్యార్థి విభాగ నాయకులు శేషు, జయవర్ధన్, సాయి, తదితరులు పాల్గొన్నారు. -
వాట్సాప్ దుమారం
వాట్సాప్ ద్వారా ప్లస్‌టూ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం బుధవారం నాటి అసెంబ్లీ సమావేశంలో దుమారం రేపింది. ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని విపక్షాలు పట్టుపట్టడంతో అసెంబ్లీ అట్టుడికిపోయింది. చెన్నై, సాక్షి ప్రతినిధి:హొసూరు జిల్లాలోని ఒక ప్రయివేటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ప్లస్‌టూ లెక్కల ప్రశ్నపత్రాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసి వాట్సాప్ ద్వారా తన సహ ఉపాధ్యాయులకు పంపడం బట్టబయలైంది. దీనిపై నలుగురు ఉపాధ్యాయులు సస్పెండ్‌కు గురైయ్యారు. ఈ విషయాన్ని బుధవారం నాటి అసెంబ్లీలో డీఎంకే సభ్యులు సెంగుట్టవన్, సీపీఎం సభ్యులు ఢిల్లీ బాబు, సీపీఐ సభ్యులు ఆరుముగం, కాంగ్రెస్ సభ్యులు ప్రిన్స్ ఘాటుగా ప్రస్తావించారు. దీనిపై ఉన్నత విద్యాశాఖమంత్రి వీరమణి వివరణ ఇస్తూ, వాట్సాప్ లీకేజీ వల్ల పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ఇకపై ఇలాంటివి చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టామని అన్నారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో తాజా బడ్జెట్లో అన్నిశాఖలు సరైన నిధులను కేటాయించామని, కొన్ని శాఖలకు కనీస స్థాయిలో అదనంగాకూడా కేటాయింపులు సాగాయని చెప్పుకున్నారు. ప్రభుత్వం చూపుతున్న లెక్కలను పద్దుల కమిటీ తప్పుపట్టిందని, రాష్ట్రానికి నష్టం వాటిల్లిందని పేర్కొనిందని డీఎంకే సభ్యుడు దురైమురుగన్ విమర్శించడాన్ని సీఎం ఎద్దేవా చేశారు. 2జీ స్పెక్ట్రంలో డీఎంకే నేతల వ్యవహారం వల్ల లక్షా 76వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని తెలీదని వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా లేచి నిలబడి నినాదాలు చేసిన డీఎంకే సభ్యులు తాము కూడా జయలలిత ఎదుర్కొంటున్న బెంగళూరు కేసును ప్రస్తావించవచ్చని నిలదీశారు. కోర్టులో ఉన్న వ్యవహారాలు మాట్లాడరాదని బుద్ధులు చెప్పిన అధికార సభ్యులు వారే తప్పులు చేస్తున్నారని అన్నారు. 2జీపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరగా, రికార్డులను చదివి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ బదులిచ్చారు. అయితే ఇందుకు అంగీకరించని డీఎంకే సభ్యులు స్పీకర్ సభ నుంచి వాకౌట్ చేశారు. -
చిక్కుల్లో ఎమ్మెల్యేలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేతో వైర్యం ఏర్పడ్డ నాటి నుంచి డీఎండీకే వర్గాలు సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ఏ చిన్న వ్యాఖ్య చేసినా, ఆరోపణలు గుప్పించినా పరువు నష్టం దావాలు దాఖలవుతూ వచ్చాయి. అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశం గత వారం ఆరంభమైంది. ఈ సమావేశాల్లో భాగంగా గురువారం వివాదం రాజుకుంది. తమ గళాన్ని నొక్కేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎండీకే సభ్యులు అధికార పక్షంతో గట్టిగానే ఢీ కొట్టారు. అసెంబ్లీ వేదికగా వివాదం ముదరడంతో మార్షల్స్ ద్వారా బయటకు వారిని స్పీకర్ ధనపాల్ గెంటించారు. అలాగే, క్రమ శిక్షణ చర్యగా తాజా సమావేశాలు, తదుపరి సమావేశాలకు వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. చివరకు తగ్గిన స్పీకర్ ధనపాల్ ఈ సమావేశాలకు మాత్రమే సస్పెండ్ చేస్తున్నట్టు మరుసటి రోజు ప్రకటించారు. సస్పెన్షన్‌లో సవరణలు జరిగినా, డీఎండీకే ఎమ్మెల్యేలకు అసలు చిక్కంతా మార్షల్స్ రూపంలో కాచుకు కూర్చుంది. చిక్కుల్లో...ముగ్గురు టార్గెట్ బయటకు గెంటివేసే క్రమంలో డీఎండీకే ఎమ్మెల్యేలు మార్షల్స్‌తో ఢీ కొట్టారు. ఈ క్రమంలో విజయన్ అనే సబ్ ఇన్స్పెక్టర్ గాయ పడ్డారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ద్వారా డీఎండీకే ఎమ్మెల్యే భరతం పట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అదే సమయంలో, డీఎండీకే సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సచివాలయం పోలీసులకు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ ఫిర్యాదు చేయ డం చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సబ్ ఇన్స్పెక్టర్ విజయన్ను సచివాలయం పోలీసులు శనివారం సాయంత్రం కలుసుకుని వివరణ తీసుకున్నారు. సంఘటన ఎలా జరిగింది, దాడి చేసిన ఎమ్మెల్యేల వివరాల్ని సేకరించారు. జమాలుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎండీకే ఎమ్మెల్యేలు మోహన్ రాజ్, శేఖర్, దినకరన్‌లపై కేసుల నమోదుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. నగర కమిషనర్ జార్జ్‌తో సచివాలయం పోలీసులు సమావేశమై కేసుల నమోదుకు సంబంధించి చర్చించడం గమనార్హం. వీరిపై ఎలాంటి సెక్షన్లను నమోదు చేయాలోనని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిని తన విధుల్ని నిర్వర్తించకుండా అడ్డుకోవడం, దాడి చేయడం వంటి సెక్షన్లను నమోదు చేయడానికి సచివాలయం పోలీసులు సిద్ధం అయ్యారని సమాచారం. అయితే, సోమవారం అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కావడంతో మరుసటి రోజు డీఎండీకే ఎమ్మెల్యేల భరతం పట్టేవిధంగా కేసుల నమోదు, అరెస్టులకు కార్యాచరణ సిద్ధం చేసినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. -
పస లేని ప్రసంగం
కొత్తదనం లేకుండానే, ఉన్నట్టుగా చూపిస్తూ, గవర్నర్ కొణిజేటి రోశయ్య నోట పసలేని ప్రసంగాన్ని రాష్ర్ట ప్రభుత్వం పలికించిందంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్ అని గవర్నర్ కితాబు ఇవ్వడంతో, ఆయన ప్రసంగాన్ని బహిష్కరిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి. సభా పర్వాన్ని 4 రోజులకే పరిమితం చే స్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సాక్షి, చెన్నై : కొత్త సంవత్సరంలో తొలి అసెంబ్లీ సమావేశం అనగానే ప్రాధాన్యత నెలకొంటుంది. తొలి రోజు గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితీ. ఈ ప్రసంగం ద్వారా ఏడాదిలో చేపట్టబోయే సరికొత్త పథకాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్ నోట పలికిస్తుంటారు. అయితే, ఈ ఏడాది అందుకు భిన్నంగా గవర్నర్ ప్రసంగాన్ని రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిందని చెప్పవచ్చు. తమ అమ్మ జయలలితకు ఎదురైన కష్టాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగాన్ని సైతం పస లేకుండా రూపొందించారన్న విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి సీఎం పన్నీరు సెల్వంకు నెలకొంది. సీఎంగా పన్నీరు సెల్వంకు కొత్త ఏడాదిలో తొలి సమావేశం ఇది. అలాగే, గవర్నర్ ప్రసంగంతో ఆరంభం అయ్యే సభా పర్వం కావడంతో ఉత్కంఠ నెలకొంది. ఇందు కోసం ప్రభుత్వం జార్జ్ కోటలో ఏర్పాట్లు చేసింది. అయితే, మునుపటి వల్లే పలు రకాల పువ్వులతో అలంకరణలు లేవు. హంగు ఆర్భాటాలు లేవు. అలాగే, ప్రజలకు ఈ ఏడాది ఎలాంటి కొత్త ప్రగతి పథకాలు లేవన్నట్టుగా సభా పర్వం మంగళవారం ఉదయం 11.15 గంటలకు ఆరంభమైంది. అసెంబ్లీ ఆవరణలోకి వచ్చిన రోశయ్యకు స్పీకర్ ధనపాల్ ఆహ్వానం పలికారు. అసెంబ్లీలో సభ్యులందరూ గవర్నర్ రోశయ్యను మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. గత సమావేశాల్లో మంత్రుల వరుసలో కూర్చున్న సీఎం పన్నీరు సెల్వం ఈ సారి సీఎం సీటులో కూర్చోవడం విశేషం. దీంతో ఆ సీటుకు గౌరవాన్ని ఇస్తూ, డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ నమస్కారం చేయక తప్పలేదు. సభ ఆరంభం కాగానే, రోశయ్య ప్రసంగం ఆరంభమైంది. 45 నిమిషాల పాటుగా ఆయన ప్రసంగం సాగింది. అయితే, ఇందులో కొత్తదనం లేకపోవడంతోపాటుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్ అని గవర్నర్ కితాబు ఇవ్వడం డీఎంకే, సీపీఐ, పుదియ తమిళగంలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ, ఆయన ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ డుమ్మా కొట్టినా, డీఎండీకే సభ్యులు, సీపీఎం, ఎంఎంకే, ఎస్ఎంకే, పీఎంకే, కాంగ్రెస్ సభ్యులు సభలో ఆశీనులై గవర్నర్ రోశయ్య ప్రసంగాన్ని ఆలకించారు. ప్రసంగంలో మచ్చుకు కొన్ని తన ప్రసంగంలో కొన్ని నిర్ణయాలు, గతంలో ప్రభుత్వం చేసిన గొప్పలను ఎత్తి చూపుతూ గవర్నర్ రోశయ్య వ్యాఖ్యానించాల్సి వచ్చింది. అన్ని గ్రామాలకు ప్రజా సేవా కేంద్రాల విస్తరణ, అరసు కేబుల్ విస్తరణ, క్రీడాకారులకు ప్రోత్సాహం, పెట్టుబడి దారుల్ని ఆహ్వానించే విధంగా మేలో మహానాడు నిర్వహణ, జపాన్ బ్యాంక్ ద్వారా నిధుల్ని రాబట్టడమే లక్ష్యంగా కొన్ని ప్రకటనలు చేశారు. ఇక, కచ్చదీవుల స్వాధీనంతోనే జాలర్ల సమస్యకు పరిష్కారం సాధ్యమన్నారు. శ్రీలంక తమిళులకు కొత్త ప్రభుత్వంతో ఒరిగేది శూన్యమేనని విమర్శించారు. వారికి సకల ఏర్పాట్లు చేసినానంతరం శిబిరాల నుంచి వారి వారి స్వదేశాలకు ఈలం తమిళుల్ని పంపించే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటీల ఏర్పాటులో తమిళనాడుకు ప్రాధాన్యత కల్పించాలని, రాష్ట్రంలోని కార్పొరేషన్లను ఆ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరారు. టెక్నాలజీని అంది పుచ్చుకుని అన్ని ప్రభుత్వ సేవల్ని ఆన్లైన్ ద్వారా అందిస్తున్న విధానం గురించి వివరించారు. కోయంబేడు - ఆలందూరు మధ్య త్వరలో మెట్రో రైలు సేవలు ఆరంభం కానున్నాయని పేర్కొన్నారు. తిరువొత్తియూర్ వరకు మెట్రో సేవల విస్తరణకు త్వరలో ఆమోదం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నదీ జలాల పరిరక్షణలో, మహిళా, శిశు సంరక్షణలో, వ్యవసాయ రంగం పటిష్టత , ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంపులో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు. అలాగే, రాష్ట్రంలో శాంతి భద్రతల పనితీరుపై పోలీసు యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. అమ్మ సిమెంట్ రికార్డుల్లోకి ఎక్కిందని పేర్కొంటూ, విజన్ -2023లోని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ ప్రసంగం చేశారు. కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నట్టు తెలిపారు. అలాగే, ముల్లై పెరియార్‌కు వ్యతిరేకంగా కేరళ, కావేరి జలాల్ని అడ్డుకునే రీతిలో కర్ణాటక కొత్త డ్యాంల నిర్మాణానికి చేస్తున్న ప్రయత్నాల్ని ఖండిస్తూ, అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. సభా పర్వం తొలి రోజు ముగియగానే, అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశమై సభను నాలుగు రోజులు నడిపించేందుకు నిర్ణయించారు. విమర్శలు : గవర్నర్ ప్రసంగంపై ప్రతి పక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. పస లేని ప్రసంగంలా సాగిందని మండి పడుతున్నాయి. వాకౌట్ అనంతరం బయటకు వచ్చిన డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ ప్రభుత్వ తీరుపై శివాలెత్తారు. వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. నోటుతో ఓట్లను కొనుగోలు చేసి శ్రీరంగంలో గెలిచారని విమర్శించారు. బినామీ పాలన రూపంలో ప్రజలకు అష్టకష్టాలు తప్పదని హెచ్చరించారు. పుదియ తమిళగం సభ్యుడు కృష్ణస్వామి, సీపీఐ సభ్యులు సైతం ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే అధినేత కరుణానిధి ఓ ప్రకటనలో గవర్నర్ ప్రసంగాన్ని ఎండమావిగా అభివర్ణించారు. ఎవరికి పనికి రాని ఈ ప్రసంగాన్ని ఎందుకు చదివి వినిపించారంటూ మండి పడ్డారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ పేర్కొంటూ, సంప్రదాయ బద్దంగా నమా అనిపించినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చదీవుల స్వాధీనంతో జాలర్ల సమస్యకు పరిష్కారం అని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఐజేకే నేత పారివేందర్, ఎండీఎంకే నేత వైగో, పీఎంకే నేత రాందాసు, వీసీకే నేత తిరుమావళవన్, డీఎండీకే అధినేత విజయకాంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ తదితరులు గవర్నర్ రోశయ్య ప్రసంగంపై దుమ్మెత్తి పోశారు. సభను కేవలం నాలుగు రోజులకే పరిమితం చేయడం బట్టి చూస్తే, ఏ మేరకు ప్రజల మీద చిత్తశుద్ది ఉందో స్పష్టం అవుతోందన్నారు. గవర్నర్ ప్రసంగంలో పస లేని దృష్ట్యా, అసెంబ్లీ నిర్వహణ వృథా ప్రయాసేనని ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహం!
అసెంబ్లీలో రైతుల పక్షాన వైఎస్ జగన్ పోరాటాన్ని స్వాగతిస్తున్న రైతులు, రైతు సంఘాలు ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రభుత్వ యత్నాలపై ఆగ్రహం సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ విజయవాడ : రైతు రుణమాఫీ, సీఆర్డీఏ బిల్లుపై సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో జరిగిన చర్చ జిల్లా వాసుల్లో ఆసక్తి రేపింది. ఉదయం రైతు రుణమాఫీ, సాయంత్రం సీఆర్డీఏ బిల్లుపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని నిలదీయడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత నిబంధనల పేరుతో కోతలు పెట్టారంటూ జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ప్రశ్నించగా, దానికి సరైన సమాధానం ఇవ్వాల్సిన ప్రభుత్వం సహనం కోల్పోయి వ్యవహరించడం సరికాదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. రైతులకు రుణమాఫీ సరిగా జరగలేదని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, గరిష్ట రుణ పరిమితి పేరిట రైతులను మోసం చేస్తున్నారని కృష్ణాజిల్లాలో రైతులకు జరిగిన అన్యాయాన్ని కేస్ స్టడీలు సహా వివరించడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీఏ బిల్లులో రైతులకు ఇచ్చే వాటా గురించి స్పష్టంగా లేకపోవడం వల్ల అన్నదాతలు నష్టపోతారంటూ ప్రతిపక్ష నేత, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించడాన్ని వారు స్వాగతిస్తున్నారు. ఇప్పటికే రైతులు, రైతు సంఘాల నేతలు జరీబు భూముల్ని తీసుకోవద్దంటూ మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేది తెలిసిందే. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అధికారపక్షం.. సహనం కోల్పోయి ఇష్టానుసారం మాట్లాడటం మంచిది కాదని పలువురు రాజకీయ మేధావులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిపక్షం ఎండగడుతుంటే జీర్ణించుకోలేని స్థితిలో టీడీపీ ఎమ్మెల్యేలు, సీఎం ఉన్నారని స్పష్టమవుతోందని వివరిస్తున్నారు. ప్రభుత్వ చేతకానితనం బయటపడుతోంది శాసనసభలో రుణమాఫీ, సీఆర్డీఏ బిల్లులపై చర్చను చూస్తే ప్రభుత్వ చేతకానితనం బయటపడుతోంది. ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రతిపక్ష నేత జగన్ ఎండగట్టడం బాగుంది. కీలకమైన ఈ అంశాలపై చర్చ జరగకుండా, ప్రతిపక్షాలకు మైక్‌లు ఇవ్వకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సీఆర్డీఏ బిల్లులో రైతులకు ఇచ్చే వాటాను పొందు పరచాలంటూ జగన్ చేసిన డిమాండ్ సహేతుకమైనది. కొలనుకొండ శివాజీ సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం రుణమాఫీ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని జగన్ ప్రశ్నిస్తున్న తీరు చాలా బాగుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలు, అధికారంలోకి వచ్చిన తరువాత చెబుతున్న మాటలు, రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని లక్షల కోట్ల రుణాలు ఉన్నదీ తదితర విషయాలను సభలో జగన్ ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. వాస్తవాలను అంకెలు సహా చెప్పడంతో ప్రభుత్వం సమాధానం చెప్పలేని స్థితిలో పడింది. - ఎం.మధు రైతుసంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ నాడు తండ్రి.. నేడు కొడుకు.. రైతులను నట్టేట ముంచిన టీడీపీ ప్రభుత్వం గురించి అసెంబ్లీలో జగన్ రైతుల పక్షాన మాట్లాడటం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆనాడు రైతులకు ఇచ్చిన రుణమాఫీని వైఎస్సార్ పూర్తిగా అమలు చేయించారు. ఇప్పుడు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని జగన్ పోరాడుతున్నారు. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రభుత్వం వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధాకరం. అధికారంలో ఉన్నామని మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ప్రజలు ఊరుకోరు. - షేక్ షాబుద్దీన్, చెవిటికల్లు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ చెప్పడంలోనూ అబద్ధాలేనా! బ్యాంకులు ఇచ్చే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ విషయంలోనూ చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఎకరానికి పంటకు రూ.24 వేలు ఇస్తుంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూ.19 వేలని చెబుతున్నారు. రుణమాఫీ హామీకి కట్టుబడి ఉండకపోగా ఇంకా రైతులను మోసం చేయాలని చూడటం దారుణం. స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ ఎకరానికి రూ.24 వేలు పంటరుణంగా ఇవ్వాలని నిర్ణయించిన విషయం చంద్రబాబుకు తెలియదా? రుణమాఫీ ప్రకటనతో ఏడాదిగా రైతులు బకాయిలు చెల్లించడం లేదు. దీంతో వడ్డీ 14 శాతం చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఎకరానికి రూ.24 వేల రుణం తీసుకుంటే.. రూ.3,360 వడ్డీ అవుతుంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం చంద్రబాబు మొదటి విడతగా రూ.3,800 విడుదల చేశారు. దీని ప్రకారం వడ్డీ పోను అసలు చెల్లించేది రూ.440 మాత్రమే. ఏటా ఇలా చెల్లిస్తే.. ఐదేళ్లకు వడ్డీ పోను చెల్లించేది రూ.2,200 మాత్రమే. మిగలినది తీరేదెప్పుడు? ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. - ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ -
సమస్యలపై కాంగ్రెస్ నేతల పర్యటన
తొలుత నిజామాబాద్... ఆ తరువాత పాలమూరు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలు క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే అన్ని జిల్లా ల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెం బ్లీ సమావేశాల సందర్భంగా కరెంట్ కష్టాలు, రుణమాఫీ వంటి అంశాలతోపాటు రైతుల ఆత్మహత్యలకు కారణాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈనెల 9న తొలుత నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. శాసనమండలి ఉపనేత షబ్బీర్‌అలీ ఆధ్వర్యంలో ఆ జిల్లాలో ప్రారంభమయ్యే పర్యటనలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్‌సహా కాంగ్రెస్ ప్రజాప్రతిని దులు, ముఖ్య నేతలంతా పాల్గొననున్నారు. మంగళవారం సాయంత్రం పొన్నాల నివాసంలో పీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు సమావేశమై జిల్లాల పర్యటనలపై చర్చించారు. కమిటీ సభ్యులు పొన్నాల, జానారెడ్డి, డీఎస్, షబ్బీర్‌అలీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు పీసీసీ కిసాన్‌సెల్ ఛైర్మన్ కోదండరెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానంతరం ఆయా నేతలతో కలసి పొన్నాల మీడియాతో మాట్లాడుతూ రైతుల కష్టాలు కడగండ్లు తెలుసుకుని భరోసా కల్పించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమైనట్లు చెప్పారు. త్వరలో టీపీసీసీ కార్యవర్గ ప్రక్షాళన... తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని పొన్నాల లక్ష్మయ్య భావిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం పలువురు పీసీసీ ఆఫీస్ బేరర్స్‌తో సమావేశమై సభ్యత్వ నమోదు, సంస్థాగత మార్పులు చేర్పులపై అభిప్రాయాలు సేకరించారు. ధైర్యముంటే బహిరంగ చర్చకు రా.. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమెవరనే అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత, విద్యుత్ శాఖ మాజీమంత్రి షబ్బీర్‌అలీ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మంగళవారమిక్కడ గాం ధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం లో ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి పదేళ్ల కాంగ్రెస్ పాలనే కారణమంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై షబ్బీర్‌అలీ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్.. చేతగాకుంటే తప్పుకో: డీకే అరుణ విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నించకుండా సీఎం కేసీఆర్ విపక్షాలను విమర్శించడం విడ్డూరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ వ్యాఖ్యానించారు. విద్యుత్ సవుస్యను పరిష్కరించడం చేతగాకుంటే కేసీఆర్ పదవి నుంచి తప్పుకోవాలని సీఎల్పీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్నారు. -
ప్రతిపక్ష నేత జగన్ గొంతు నొక్కారు
నరసరావుపేట వెస్ట్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి గొంతు నొక్కి అధికాపక్షం ఏకపక్షంగా వ్యవహరించిందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్టేట్మెంట్ ఇస్తారని ప్రకటించి రిజల్యూషన్ ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి కావాలనే జగన్మోహనరెడ్డిని చర్చలో పాల్గొనకుండా చేశారని ఆరోపించారు. తాను మాట్లాడతానని జగన్మోహనరెడ్డి పదే పదే కోరినా అవకాశం ఇవ్వలేదన్నారు. రైతులకు ఓపిక నశించి రుణమాఫీ అడగలేని విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బంగారు, డ్వాక్రా రుణాలకు తిలోదకాలు ఇచ్చే విధంగా విధివిధానాలు రూపొందిస్తోందని తెలి పారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రతి జిల్లాకు చేసిన వాగ్దానాలు అమలు కావాలంటే రూ.20 లక్షల కోట్లు కావాలని తెలిపారు. లింగంగుంట్లకు చెందిన 1900 ఎకరాల భూములకు రైతులు రిజిస్ట్రేషన్లు, రుణాలు తీసుకోవటం, విక్రయాలు చేసుకునేందుకు ఎండోమెంట్, రెవెన్యూ మంత్రులను కలిశామని, వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. సమావేశంలో మండల కన్వీనర్ కె.శంకరయాదవ్, ఎస్సీసెల్ కన్వీనర్ కందుల ఎజ్రా, మండల కార్యదర్శి భవనం రమణారెడ్డి పాల్గొన్నారు. -
సింగరేణి కార్మికులకు నిరాశ
- రూ.2.50 లక్షల వరకే పన్ను మినహాయింపు - తెలంగాణ ప్రభుత్వ తీర్మానాన్ని పక్కన పెట్టిన కేంద్రం గోదావరిఖని : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సింగరేణి కార్మికులను నిరాశకు గురిచేసింది. భూగర్భంలో ప్రాణాలు ఫణంగా పెట్టి బొగ్గును వెలికితీస్తున్న నల్లసూరీళ్లను చిన్నచూపు చూసింది. తెలంగాణ ప్రభుత్వంతొలి అసెంబ్లీ సమావేశంలో గనికార్మికులకు ఆదాయపన్ను మినహాయించాలని కోరుతూ చేసిన తీర్మానంపై స్పందించ లేదు. కనీసం రూ.5 లక్షల వరకైనా పన్ను మినహాయింపు లభిస్తుందని కార్మికులు ఆశించగా.. రూ.2.50 లక్షలకే పరిమితం చేయడం వారిని ఆవేదనకు గురిచేసింది. గతంలో రూ.2లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఉంటే ప్రస్తుతం కేవలం మరో రూ.50 వేలు మాత్రమే వెసులుబాటు లభించింది. సింగరేణిలో 63 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా వారిలో 35 వేల మంది రూ.40 వేల వేతనం, ఓపెన్‌కాస్ట్‌లలో పనిచేసే ఆపరేటర్లు, ఆ కేటగిరీ వారు రూ.90 వేల వేతనం పొందుతున్నారు. బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపును రూ.2.50 లక్షలకే పరిమితం చేయడం వల్ల కార్మికులు, ఉద్యోగులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. కార్మికులకు యాజమాన్యం సమకూర్చే నివాసం, ఎల్పీజీ గ్యాస్, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలపైనా పన్ను వేస్తున్నారు. దీనివల్ల కార్మికులు, ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఆదాయపన్ను మినహాయిం పుపై సర్కారు పునరాలోచించాలని నాయకులు, కార్మికులు కోరుతున్నారు. -
‘స్థానిక’ పాలనకు సన్నాహాలు
సాక్షి, అనంతపురం: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు అనుకూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. దీంతో స్థానిక సంస్థల్లో రెండేళ్లుగా కొనసాగనున్న ప్రత్యేకాధికారులకు తెర పడనుంది. పురపాలికల్లో! జిల్లాలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు హిందూపురం, కదిరి, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, గుత్తి, మడకశిర, కళ్యాణదుర్గం, పామిడి, పుట్టపర్తి పురపాలక సంఘాల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రమాణ స్వీకారం కోసం ఎదురు చూస్తున్నారు. త్వరితగతిన కౌన్సిల్ ఏర్పడితే కేంద్ర నిధులు, స్థానిక బడ్జెట్ నిధులతో తమ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వీరంతా ఇప్పటికే ప్రణాళికలు రూపొం దించుకున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల ఎమ్మెల్యే లు, ఎంపీలు ఆయా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లో సభ్యత్వం పొందారు. ఇక హిందూపురం పార్లమెంటు సభ్యుడు నిమ్మలక్రిష్టప్ప హిందూపురం మునిసిపాలిటీలో సభ్యతానికి సిద్ధంగా ఉండగా, అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి తాడిపత్రి మునిసిపాలిటీలో ఎక్స్అఫిషియో సభ్యునిగా సభ్యత్వా న్ని పొందనున్నారు. సాధారణంగా చైర్మన్ ఎంపిక క్లిష్టతరం అయినప్పుడు ఎక్స్అఫిషియో ఓటు కీలకమవుతుంది. ప్రస్తుతం గుత్తి మునిసిపాలిటీలో మినహా మిగి లిన పురపాలికల్లో ఈ ఓట్లకు పెద్దగా ప్రాధాన్యం లేదు. మార్గదర్శకాలు ఇలా రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు తొలుత చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు సంబంధించి మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలిసింది. వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు గెజిటెడ్ హోదాగల అధికారిని ప్రొసీడింగ్ అధికారిగా నియమిస్తారు. ఎన్నికల సంఘం ఖరారు చేసిన రోజున ఎన్నికైన వార్డు సభ్యులు హాజరుకావాలని నోటీసులు జారీ చేస్తారు. మొత్తం సభ్యుల్లో సగం మంది తప్పనిసరిగా హాజరుకావాలి. లేనిపక్షంలో ఎన్నిక వాయిదా పడుతుంది. తొలుత వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు ఈసీ గుర్తింపు పొందిన పార్టీలకు విప్ జారీ చేసే అవకాశం ఉంది. ఆయా పార్టీలు ముందుగా తమ సభ్యులకు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల్లో ఎవర్ని బలపరచాలనే అంశంపై విప్ జారీ చేస్తాయి. విప్లో ఉన్న అంశాన్ని ముందుగా ఎన్నికల ప్రొసీడింగ్ అధికారికి తెలియజేయాలి. ఎవరైనా పార్టీ విప్‌ను ధిక్కరిస్తే ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా ప్రొసీడింగ్ అధికారికి తెలియపరిస్తే నమోదు చేసుకుంటారు. తరువాత ఎన్నిక ప్రక్రియ చేతులు ఎత్తే పద్ధతిలో జరుగుతుంది. ఏదైనా కారణంతో చైర్మన్ ఎన్నిక జరగకపోతే వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరగదు. ఏ సభ్యుడైనా, సభ్యురాలైనా పార్టీ విప్‌ను ధిక్కరించినా ఆ ఓటును చెల్లుబాటవుతుంది. తరువాత పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలని వివరణ కోరుతూ ప్రొసీడింగ్ అధికారి ఆ వార్డు సభ్యునికి నోటీసు జారీ చేస్తారు. ఆయన సమాధానం ఇచ్చినా..ఇవ్వకపోయినా సభ్యుని పదవి రద్దు విషయమై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆ సభ్యుడు పదవి కోల్పోయే అవకాశం ఉంది. పరిషత్తులకూ..! పురపాలక పాలకమండళ్ల ప్రమాణ స్వీకార ప్రక్రియ ముగిసిన తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కూడా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. జిల్లాలో 63 మండలాల్లో 42 జెడ్పీటీసీలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీకి అధికార పగ్టాలు చేపట్టేందుకు ఏకపక్ష మెజార్టీ లభించించింది. మండల పరిషత్ అధ్యక్ష పీఠాలూ ఎక్కువగానే టీడీపీ ఖాతాలో చేరనున్నాయి. -
కొలువు తీరేదెన్నడు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లా పరిషత్ చైర్మన్‌తో పాటు వివిధ మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక వ్యవహారంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ అనిశ్చితిని అడ్డం పెట్టుకుని అడ్డదారుల్లో జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. * మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు, ఏప్రిల్ మొదటి, రెండో వారాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే మే 7న సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నెలరోజులకు పైగా వాయిదా పడింది. * సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాక ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జిల్లా పరిషత్, మండల పరిషత్, పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలో ప్రకటించింది. * ఫలితాలు వచ్చి నెలరోజులు దాటినా స్థానిక సంస్థల్లో బాధ్యతలు చేపట్టే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. * ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలలో ఎక్స్అఫిషియో సభ్యునిగా ఓటు హక్కు కలిగి ఉంటారు. ఇక్కడ అసెంబ్లీ సమావేశాల తేదీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. * శాసనసభ సమావేశం జరిగి సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడు నాలుగు రోజుల్లో వారు ఏ స్థానిక సంస్థలో సభ్యులుగా చేరాలనుకుంటున్నారో రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. * ఈ లెక్కన ఎన్నికలు జరగడానికి మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. * రాష్ట్రం రెండు ముక్కలైన తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా విడదీయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. * పస్తుతం విధుల్లో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తాము ఏ రాష్ట్రానికి చెందుతామో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. దీనిపై వివరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. అక్కడి నుంచి వివరణ వస్తేగాని జిల్లాపరిషత్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు. * ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని జిల్లా పరిషత్ సభ్యులుగా ఎన్నికైనవారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం మైండ్‌గేమ్.. ప్రకాశం జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో రెండింటిని వైఎస్సార్ సీపీ గెలుచుకోగా, నాలుగింటిలో తెలుగుదేశం గెలుపొందింది. * జిల్లా పరిషత్ విషయానికి వస్తే మొత్తం 56 స్థానాలకు 31 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకోగా 25 స్థానాలను తెలుగుదేశం గెలుచుకుంది. * రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో అడ్డదారులు తొక్కి అయినా జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. * దీని కోసం ఒక పథకం ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన జెడ్పీ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు గోబెల్స్ ప్రచారం ప్రారంభించింది. దీనికి ఆ పార్టీ అనుకూల మీడియా కూడా వంతపాడుతోంది. * వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందడంతో విప్ జారీ చేసే అవకాశం కలిగింది. విప్‌ను ధిక్కరించి ఓటు వేస్తే అనర్హత వేటు పడుతుందని అందరికీ తెలుసు. అయినా వారు పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. * వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున జెడ్పీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అయిన డాక్టర్ నూకసాని బాలాజీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. * బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి జిల్లా పరిషత్ పీఠంపై కూర్చోవడం ఇష్టం లేని తెలుగుదేశం నాయకులు ఎలాగైనా ఈ పీఠం దక్కించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. * అయితే వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏ జెడ్పీటీసీ కూడా పార్టీ వీడేందుకు సిద్ధంగా లేకపోవడం గమనార్హం. -
కసరత్తులు!
ఙసాక్షి, చెన్నై : అసెంబ్లీ సమావేశాలకు బుధవారం ఒక్క రోజు మాత్రమే సమయం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తుల్లో పడింది. మంత్రులతో మంగళవారం సీఎం జయలలిత సమావేశమయ్యారు. శాఖల వారీగా చర్చించారు. ఇక, బన్రూటి రామచంద్రన్ రాజీనామాతో పార్టీ శాసన సభా పక్ష ఉప నేత ఎంపికపై డీఎండీకే అధినేత విజయకాంత్ దృష్టి కేంద్రీకరించారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశం ఆరంభం కానుంది. ఈ ఏడాదికి తొలి సమావేశం కావడంతో గవర్నర్ రోశయ్య ప్రసంగంతో సభ ప్రారంభమవుతుంది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గవర్నర్ ప్రసంగం ద్వారా సరికొత్త పథకాల్ని, ప్రాజెక్టుల్ని ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఆయా విభాగాల వారీగా జరిగిన అభివృద్ధి, ఇక చేపట్టాల్సిన అంశాలు, ఆయా విభాగాల వారీగా రూపొందించిన కొత్త పథకాలు, పనుల గురించి మంత్రులతో సీఎం జయలలిత సమావేశం అయ్యారు. ఆయా శాఖల్లోని పనుల వివరాల్ని, తాజాగా జరిగిన కేటాయింపులపై సమీక్షించారు. మంత్రివర్గంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని, వాటిని గవర్నర్ ప్రసంగంతో జత చేయడానికి నిర్ణయించడం గమనార్హం. ఉప నేత: పార్టీ శాసనసభా పక్ష ఉప నేత పదవికి, ఎమ్మెల్యే పదవికి బన్రూటి రామచంద్రన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గతంలో సస్పెన్షన్ వేటు పడ్డాక, అసెంబ్లీలో అడుగు పెట్టడం విజయకాంత్ మానేశారు. ఆయన స్థానంలో ఉండి పార్టీ శాసన సభా వ్యవహారాల్ని, ప్రధాన ప్రతి పక్షం బాధ్యతల్ని ఉప నేత బన్రూటి రామచంద్రన్ నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన లేని లోటు డీఎండీకేకు కన్పిస్తున్నది. తాజా సమావే శాల్లో విజయకాంత్ అసెంబ్లీలో అడుగు పెట్టేనా అన్నది అనుమానమే. ఈ దృష్ట్యా, విజయకాంత్ ప్రతినిధిగా అసెంబ్లీలో గళాన్ని ఎవరు విన్పించనున్నారోనన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ప్రధాన ప్రతిపక్షం తరపున ఉపనేతగా ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు సమర్థడైన ఎమ్మెల్యే అవసరం విజయకాంత్‌కు ఏర్పడింది. దీంతో ఉప నేత ఎంపికపై దృష్టి కేంద్రీ కరించారు. బుధవారం పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి ఆయన పిలుపు నిచ్చారు. ఇందులో ఉప నేత ఎవరన్నది తేల్చనున్నారు. బన్రూటి రామచంద్రన్ తర్వాత అసెంబ్లీలో డీఎండీకే గళాన్ని విన్పిస్తున్న ఎమ్మెల్యే పార్టీ విప్ చంద్రకుమార్. మరో ఎమ్మెల్యే వెంకటేష్ కూడా అనర్గళంగా ప్రసంగాలు, వ్యాఖ్యలు చేయగలరు. ఈ ఇద్దరిలో ఉప నేత పదవి ఎవరో ఒకర్ని వరిస్తుందో లేదా ఇతరులకు అవకాశం ఇచ్చేనా అన్నది వేచి చూడాల్సిందే. -
బిల్లుపై చర్చ సోమవారం ప్రారంభం
-
గురువారం నుంచి అసెంబ్లీ ప్రారంభం
-
11న వైయస్సార్సీపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటి
-
పార్టీని విమర్శిస్తే వేటు తప్పదు
-
వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఒక్కసారిగా వేడెక్కాయి. అన్నాడీఎంకేపై డీఎంకే ధ్వజమెత్తింది. ఈ క్రమంలో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో డీఎంకే సభ్యులను బలవంతంగా బయటకు పంపారు. రాష్ట్రంలో వచ్చే ఏడాదికి మిగులు విద్యుత్ ఉంటుందని ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యూయి. తొలిరోజు సంతాప తీర్మానంతో సభ వాదా పడింది. రెండో రోజు ప్రశాంత వాతావరణంలో సభ నడిచింది. అయితే శుక్రవారం సభ ఒక్కసారిగా వేడెక్కింది. వాటర్ బాటిళ్లు, బస్సులపై రెండాకుల చిహ్నంపై అసెంబ్లీలో చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని డీఎంకే సభ్యులు దురైమురుగన్ కోరగా స్పీకర్ ధనపాల్ నిరాకరించారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చినందున చర్చకు తావులేదని తోసిపుచ్చారు. అవకాశం ఇవ్వాల్సిందేనంటూ డీఎంకే సభ్యులంతా లేచి నిలబడి నినాదాలు హోరెత్తించారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభలోనే ఉన్న జయలలిత ప్రతిపక్ష సభ్యుల విమర్శలను తిప్పికొట్టే బాధ్యతను అధికార పార్టీ సభ్యులకే అప్పగించి మిన్నకుండిపోయారు. ఇదే సమయంలో స్టాలిన్ కలుగజేసుకుని తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పీకర్ నిరాక రించారు. వెంటనే డీఎంకే సభ్యులు తమ వద్దనున్న మినీబస్‌ల ఫొటోలను తలపై ఎత్తిపట్టుకుని నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఇటువంటి చర్యలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పీకర్ హెచ్చరించినా పరిస్థితిలో మార్పు లేదు. చివరకు స్పీకర్ ఆదేశంతో మార్షల్స్ రంగ ప్రవేశం చేసి డీఎంకే సభ్యులను బలవంతంగా బయటకు పంపారు. పార్టీ ప్రచారం చేసుకోలేదు అసెంబ్లీలో లాబీలో డీఎంకే నేత దురైమురుగన్ మాట్లాడారు. ప్రతిపక్షాల విమర్శలు, అభ్యంతరాలను ప్రభుత్వం స్వీకరించి ఉంటే ప్రజాస్వామ్యయుతంగా ఉండేదన్నారు. డీఎంకే హయాంలో ప్రభుత్వ డైరీపై కరుణానిధి ఫొటో, అన్నా సమాధి వద్ద ఉదయించే సూర్యుని చిహ్నం వేసుకోలేదా అని అన్నాడీఎంకే సభ్యులు సభలో వేసిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. అవి తమకు తెలియకుండా జరిగాయని, పొరబాట్లను వెంటనే సరిదిద్దుకున్నామని వివరించారు. అన్ని చోట్లా అమ్మ ఫొటో, రెండాకులు వేసుకుంటున్నారు, క్వార్టర్ బాటిళ్లపై వేసుకోవడం లేదేమిటంటూ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినవారు అసెంబ్లీ నుంచి వైదొలగే రోజులు త్వరలోనే వస్తాయని వ్యాఖ్యానించారు. అనంతరం డీఎంకే కోశాధికారి, ఎమ్మెల్యే స్టాలిన్ మాట్లాడారు. తమ పాలన లోనూ అనేక మంచినీటి పథకాలు ప్రవేశపెట్టామని, అరుుతే ఎక్కడా పార్టీ ప్రచారం చేసుకోలేదని పేర్కొన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వం మంచినీటి బాటిళ్లపై, బస్సులపైనా రెండాకుల చిహ్నాన్ని ముద్రించి వ్యాపారం చేసుకుంటోందని విమర్శించారు. రూ5,900 కోట్ల మినీ బడ్జెట్ ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం రూ5900 కోట్లతో మినీ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. 2013-14 సంవత్సరానికి మార్చి 21న బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నామని సభకు తెలిపారు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త పథకాలు, ఇతర ఖర్చులు ఎదురైనందున మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది పొంగల్ పండుగ సందర్భంగా పేదలకు ఉచితంగా పంచె, చీర పంపిణీకి రూ350 కోట్లు కేటాయించామన్నారు. అయితే నూలు ధర పెరగడం వల్ల రూ136.36 కోట్లు అదనంగా అవసరమైందని వివరణ ఇచ్చారు. ముందుంది మంచికాలం వచ్చే ఏడాది ఆరంభం నాటికి రాష్ట్రం మిగులు విద్యుత్ స్థితికి చేరుకుంటుందని ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో ప్రకటించారు. సీపీఐ సభ్యులు ఆర్ముగం మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ కోతలు తగ్గినా చిన్నత రహా పరిశ్రమలు, రైతులు కోతల వెతలను ఎదుర్కొంటున్నారని అన్నారు. జయలలిత స్పందిస్తూ తమ ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ పరిస్థితి మరీ దారుణంగా లేదని అన్నారు. రాష్ట్రం 2006 వరకు మిగులు విద్యుత్‌లో ఉండేదని, తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే రాష్ట్రాన్ని కోతలపాలు చేసిందని ఆరోపించారు. 2011లో తాను అధికారం చేపట్టిన తర్వాత విద్యుత్ సమస్య పరిష్కారంపై తీవ్రంగా దృష్టి సారించానని పేర్కొన్నారు. తాము తీసుకుంటోన్న చర్యలు ఈ ఏడాది చివరినాటికి ఫలితాలను ఇవ్వడం మొదలవుతుందని, 2014 ఆరంభంలో మిగులు విద్యుత్ స్థితికి చేరుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చిన్నతరహా పరిశ్రమలపై కోతలను పూర్తిగా ఎత్తేశామన్నారు. భారీ పరిశ్రమలకు కోతలను 40 నుంచి 20 శాతానికి తగ్గించామని వివరించారు. డెల్టా జిల్లాల రైతులకు 12 గంటలు, ఇతర జిల్లాల్లోని రైతులకు 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని జయలలిత తెలియజేశారు. -
వైయస్ఆర్సిపి ఎమ్మెల్యేల అరెస్ట్