సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ ఈ నెల 20వ తేదీన సమావేశం కానుంది. కరోనా ఉధృతి దృష్ట్యా ఒక్క రోజు మాత్రమే సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అధికారవర్గాలు తెలిపాయి. 20వ తేదీన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారని, అదేరోజు బడ్జెట్ ప్రవేశ పెట్టడం, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం ఉంటాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి మార్చిలోనే బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉంది. కరోనా, స్థానిక సంస్థల ఎన్నికల వల్ల మూడు నెలల బడ్జెట్‌కు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. మిగిలిన కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment