సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ తొలి శాసనసభకు గురువారం చివరి రోజైంది. ఐదేళ్లు నిండకుండానే సభ రద్దయింది. శాసనసభ ఇప్పటివరకు 9 విడతలుగా సమావేశమైంది. 126 రోజులపాటు సమావేశాలు జరిగాయి. 2014 జూన్ 2న ప్రభుత్వం ఏర్పాటవగా.. 2014 జూన్ 9న శాసనసభ తొలి సమావేశం ప్రారంభమైంది. తొలి శాసనసభ సమావేశాలు జూన్ 9 నుంచి 14 వరకు 6 రోజులు జరిగాయి. రెండోసారి 2014లోనే నవంబర్ 5 నుంచి 29 వరకు 19 రోజులు సభ జరిగింది. మూడోసారి 2015 మార్చి 9 నుంచి 26 వరకు 14 రోజులు జరిగాయి. మూడో సెషన్‌లోనే 2015 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 10 వరకు 7 రోజులు సమావేశాలు జరిగాయి. నాలుగో సెషన్ 2016లో మార్చి 11 నుంచి 31 వరకు 17 రోజులు.. ఐదో సెషన్‌లో 2016లో ఆగస్టు 30న ఒకే రోజు శాసనసభ సమావేశమైంది. ఆరో సెషన్ 2016 డిసెంబర్ 16 నుంచి 2017 జనవరి 18 వరకు 18 రోజులు.. ఏడో సెషన్ 2017 మార్చి 11 నుంచి 27 వరకు 13 రోజులు జరిగింది. ఏడో సెషన్‌లో భాగంగానే ఏప్రిల్ 17న ఒక రోజు, ఏప్రిల్ 30న ఒక రోజు కూడా సమావేశాలు జరిగాయి. 8వ సెషన్‌లో 2017 అక్టోబర్ 29 నుంచి నవంబర్ 17 వరకు 16 రోజులు.. 9వ సెషన్‌లో 2018 మార్చి 12 నుంచి 29 వరకు 13 రోజులు సమావేశాలు జరిగాయి.
Published Fri, Sep 7 2018 1:55 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment