స్పీకర్‌ను ట్రిబ్యునల్ చైర్మన్‌గా పరిగణించాలి
న్యాయస్థానాలకు ఆ అధికారం ఉంది
‘అనర్హత’పై 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి
గతంలో సుప్రీంకోర్టు తీర్పులో ఇదే తేల్చిచెప్పింది
‘ఫిరాయింపు’ పిటిషన్లపై హైకోర్టులో పిటిషనర్ల వాదనలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ నిర్ణయాలపై న్యాయసమీక్ష జరిపే అధికారం ధర్మాసనాలకు ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామ సుందరం హైకోర్టులో వాదనలు వినిపించారు. స్పీకర్‌ను ట్రిబ్యునల్ చైర్మన్‌గా పరిగణించాలని.. స్పీకర్‌కు కాకపోయినా, ట్రిబ్యునల్ చైర్మన్‌కు న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయవచ్చన్నారు. ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా తేలి్చచెప్పిందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌ను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎలీ్పనేత మహేశ్వర్‌రెడ్డి మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం మరోసారి విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, మాజీ ఏఏజీ రామచంద్రరావు హాజరయ్యారు.
పిటిషనర్ల తరఫున న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీ మారడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆయన్ను ప్రజలు ఓడించారు. మహారాష్ట్ర, మణిపూర్ కేసులలో సుప్రీంకోర్టు వెలువరించిన రెండు తీర్పులను పరిశీలిస్తే.. తమ ముందు పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై నిరీ్ణత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రూల్ 6, 7ను ప్రకారం స్పీకర్ నడుచుకోవడం లేదు. వెంటనే నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలి. అని విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్యానికి ముప్పన్న సుప్రీంకోర్టు
‘పదవ షెడ్యూల్‌ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్ ముందు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా లోక్‌సభ, శాసనసభల జీవితకాలం ఐదేళ్లు మాత్రమే. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుకోకుండా సరైన సమయంలో తీర్పు వెలువరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచి్చంది. మెజారిటీ ఉన్న పార్టీ తరఫు వ్యక్తి స్పీకర్ అవుతారని, అధికార పారీ్టకి వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకోకుండా పదవీకాలం ముగిసేవరకు పెండింగ్‌లో ఉంచడం సరికాదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
కైశమ్ మేఘచంద్రసింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ మణిపూర్.. కేసులో స్పీకర్ రాజకీయ విధేయత కారణంగా పక్షపాత వైఖరిని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా పేర్కొంది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని.. ఒక పార్టీ నుంచి ఎన్నికవుతున్న స్పీకర్ వద్ద ఉంచాలా.. వద్దా.. అనేది పార్లమెంట్ పునరాలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు సూచించింది’అని ఆర్యామ సుందరం వివరించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఇచి్చన ఆదేశాలను హైకోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు.
ఎస్సీ, ఎస్టీల్లోని ప్రతి కులానికి రిజర్వేషన్ ఫలాలు
సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ జరిగేందుకు మార్గం సుగమమైంది. మూడు దశాబ్దాలుగా ఎమ్మార్పీఎస్‌తో పాటు పలు సంఘాలు తీవ్రస్థాయిలో చేసిన ఉద్యమానికి ఇప్పుడు ఫలితం దక్కింది. ఎస్సీ, ఎస్టీల్లోని ప్రతి కులానికి ఇప్పుడు రిజర్వేషన్ ఫలాలు
అందుతాయి. ఇప్పటివరకు రిజర్వేషన్ల అమల్లో స్పష్టత లేకపోవడంతో కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్ల ఫలాలు దక్కించుకున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు వర్గీకరణ ద్వారాన్యాయం జరగనుంది. – వలిగి ప్రభాకర్ ఎరుకల, ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment