న్యూఢిల్లీ: కీలకమైన వస్తు సేవలపన్ను(జీఎస్‌టీ) బిల్లు లోక్‌సభకు రానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) బిల్లును రేపు (శుక్రవారం)లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ ఈ సోమవారం ఈబిల్లుకు ఆమోద ముద్ర వేసింది. అంతకుముందు ఈ బిల్లులో కీలకమైన అయిదు ముసాయిదా చట్టాలకు జీఎస్ టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అనంతరం దీన్ని పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. ఈ క్రమంలో లోక్‌సభ లో ఆమోదం కోసం రేపు సభముందు ఉంచనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ బిల్లుపై హాట్ హాట్ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.
జీఎస్‌టీని సాధ్యమైనంత త్వరగా అమలులోకి త్వరగా అమల్లోకి తీసుకురావాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో జులై 1, 2017 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నసంగతి తెలిసిందే.
జీఎస్టీ బిల్లు రేపు లోక్‌సభలో
Published Thu, Mar 23 2017 4:45 PM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM
Advertisement
Advertisement