సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వస్తువులు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోదముద్ర వేసింది.
న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వస్తువులు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోదముద్ర వేసింది. విపక్షాల అభ్యంతరల నడుమ బిల్లు ఆమోదం పొందింది. జీఎస్‌టీ బిల్లులో మార్పులు చేసినందున తాజా బిల్లును మళ్లీ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రతిపక్షం డిమాండ్ ను ప్రభుత్వం తిరస్కరించింది.
జీఎస్‌టీ బిల్లుతో భవిష్యత్ లో ధరలు తగ్గుతాయని, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఒక స్థాయీ సంఘం నుంచి మరో స్థాయీ సంఘానికి దూకడానికి బిల్లులు అనేవి నృత్య వస్తువులు కాదని ఆయన మండిపడ్డారు. జీఎస్‌టీ బిల్లు కారణంగా ఏ రాష్ట్రం కూడా ఆదాయం కోల్పోదని భరోసాయిచ్చారు.