జీఎస్‌టీ బిల్లు ఆమోదంపై అనుమానమేఘాలు ముసురుకోవడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 5 శాతం పతనమై ఏడేళ్ల కనిష్టానికి క్షీణించడం, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతుండడం, రూపాయి పతనం కూడా ప్రభావం చూపడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 220 పాయింట్లు క్షీణించి 25,310 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 64 పాయింట్లు నష్టంతో 7,702 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇది సెన్సెక్స్‌కు 3 నెలల కనిష్ట స్థాయి. బ్యాంక్, ఆర్థిక సంస్థలు, లోహ, ఇన్‌ఫ్రా, ఆయిల్, ఫార్మ షేర్లు నష్టపోయాయి. గత 5 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 860 పాయింట్లు కోల్పోయింది.
మూడు కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం
కాగా సెబీ తాజాగా ఎస్‌ఎస్‌ఐపీఎల్ రిటైల్, పరాంజపే స్కీమ్స్, భారత్ వైర్ రోప్స్‌ల ఐపీఓలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
క్రౌడ్‌ఫండింగ్‌కు త్వరలో మార్గదర్శకాలు: ఔత్సాహిక వ్యాపారవేత్తలు ‘క్రౌడ్‌ఫండింగ్’ మార్గంలో సులభతరంగా నిధులు సమీకరించుకునేందుకు వీలుగా త్వరలో మార్గదర్శకాలు ప్రవేశపెట్టనున్నట్లు సెబీ చైర్మన్ యూకే సిన్హా చెప్పారు..