Sensex Falls
-
Stock Market: జీవితకాల గరిష్టాల వద్ద బేర్ పంజా..!
ముంబై: దలాల్ స్ట్రీట్‌లో కొత్త శిఖరాలపై దూసుకెళ్తున్న బుల్‌ను ఒక్కసారిగా బేర్ ముట్టడించింది. ఫలితంగా ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు గడిచిన 9 నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 931 పాయింట్లు క్షీణించి 70,506 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 303 పాయింట్లు నష్టపోయి 21,150 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. పలు రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 476 పాయింట్లు లాభపడి 71,913 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 21,593 వద్ద కొత్త జీవికాల గరిష్టాలు నమోదు చేశాయి. దేశీయంగా నెలకొన్న ప్రతికూల ప్రభావాలతో ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ట్రేడింగ్ ముగిసే అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ తలెత్తడంతో సూచీలు ఒకశాతానికి పైగా పతనమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,134 పాయింట్లు పతనమై 70,303 వద్ద, నిఫ్టీ 366 పాయింట్లు క్షీణించి 21,087 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ అమ్మకాలు తలెత్తాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 3.42%, 3.12% చొప్పున నష్టపోయాయి. ► ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ బుధవారం ఒక్కరోజే రూ.8.91 లక్షల కోట్ల సంపద తగ్గి రూ.350 లక్షల కోట్లకు దిగివచ్చింది. ► సెన్సెక్స్ సూచీ 30 షేర్లలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్(0.19%) మినహా మిగిలిన 29 షేర్లూ 4% వరకు నష్టపోయాయి. ► రంగాల వారీగా యుటిలిటీ 4.65%, టెలికం 4.36%, విద్యుత్ 4.33%, సరీ్వసెస్ 4.20%, మెటల్, కమోడిటీ, పారిశ్రామిక, క్యాపిటల్ గూడ్స్ రంగాలు 3.50% వరకు నష్టపోయాయి. ► ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. యూకోబ్యాంక్ 10.50%, ఐఓబీ 10%, సెంట్రల్ బ్యాంక్ 8%, పీఎస్బీ, పీఎస్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 5% పతనయ్యాయి. ఇండియన్ బ్యాంక్, బీఓబీ షేర్లు 4–3% పడ్డాయి. ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఈ ఏడాదిలో అత్యధికంగా 4% క్రాష్ అయ్యింది. దుమ్మురేపిన డోమ్స్.. డోమ్స్ ఇండస్ట్రీస్ లిస్టింగ్ హిట్ అయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.790)తో పోలిస్తే 77% ప్రీమియంతో రూ.1,400 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 82% ర్యాలీ చేసి రూ.1,434 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివర్లో స్వల్ప లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 68% లాభంతో రూ.1,331 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.8,077 కోట్లుగా నమోదైంది. కాగా, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిస్టింగ్ పర్వాలేదనిపించింది. బీఎస్ఈ ఇష్యూ ధర (రూ.493)తో పోలిస్తే 12% ప్రీమియంతో రూ.613 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 27% ర్యాలీ చేసి రూ.625 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని వద్ద తాకింది. చివరికి 10% లాభంతో రూ.544 వద్ద ముగిసింది. కంపెనీ విలువ రూ.5,818 కోట్లుగా నమోదైంది. ఇవీ నష్టాలకు కారణాలు లాభాల స్వీకరణ విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల ప్రోద్బలంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ గత నెల రోజుల్లో ఏకంగా 7.2% లాభపడింది. పలు రంగాల షేర్లు అధిక వాల్యుయేషన్ల వద్ద ట్రేడవుతున్నాయి. సాంకేతిక చార్టులు ‘అధిక కొనుగోలు’ సంకేతాలను సూచిస్తున్నాయి. వరుస ర్యాలీతో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ అనివార్యమైందని మార్కెట్ నిపుణులు తెలిపారు. మళ్లీ కరోనా భయాలు... దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 614 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో కోవిడ్ 19 సబ్ వేరియంట్ జేఎన్.1కి సంబంధించి 292 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ పరిణామాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. ఎర్ర సముద్రం వద్ద ఉద్రిక్తతలు ప్రపంచంలో ముఖ్య నౌకా మార్గాల్లో ఒకటైన ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తుండడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అనేక వాణిజ్య సంస్థలు ఆ మార్గం ద్వారా తమ నౌకలు వెళ్లకుండా నిలుపుదల చేశాయి. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు మరింత పెరిగే వీలున్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ప్రాథమిక మార్కెట్లో ఐపీఓ ‘రష్’ గడిచిన నెల రోజుల్లో ప్రధాన విభాగం నుంచి 11 కంపెనీలతో సహా అనేక చిన్న, మధ్య తరహా స్థాయి కంపెనీలు నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఈ పబ్లిక్ ఇష్యూల్లో పాల్గొనేందుకు అవసరమైన లిక్విడిటి(ద్రవ్య)ని పొందేందుకు హెచ్ఎన్ఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకు పాల్పడంతో సెకండరీ మార్కెట్ ఒత్తిడికి లోనై ఉండొచ్చని స్టాక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
15750 దిగువకు నిఫ్టీ
ముంబై: జాతీయంగా సానుకూల సంకేతాలున్నప్పటికీ.. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలు దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సూచీలు ఆరంభ లాభాలన్ని కోల్పోయి మంగళవారమూ నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడేలో 592 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 274 పాయింట్లు నష్టపోయి 52,579 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 182 పాయింట్ల శ్రేణిలో ట్రేడైంది. మార్కెట్ ముగిసే సరికి 78 పాయింట్లు కోల్పోయి 15,746 వద్ద నిలిచింది. చైనా స్టాక్ మార్కెట్లో వెల్లువెత్తిన విక్రయాలు ఆసియాతో పాటు యూరప్ మార్కెట్లను ముంచేశాయి. అమెరికా ఫెడ్ ఓపెన్ కమిటీ సమావేశానికి ముందు(మంగళవారం రాత్రి ప్రారంభం) ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో అక్కడి మార్కెట్లు అరశాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇటీవల కొన్ని దిగ్గజ కంపెనీలు వెల్లడించిన జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. ప్రైవేట్ రంగ బ్యాంక్స్, ఫార్మా షేర్లలో భారీ లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. మెటల్, ప్రభుత్వరంగ బ్యాంక్స్ షేర్లు లాభపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా కాఫీ ధరలు పెరగడంతో కాఫీ షేర్లకు, ఎగుమతి ఆధారిత టెక్స్టైల్స్ స్టాకులకు డిమాండ్ నెలకొంది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంరపర కొనసాగిస్తూ రూ.1459 కోట్ల షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.730 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఐదు పైసలు క్షీణించి 74.47 వద్ద స్థిరపడింది. ఫార్మా షేర్ల భారీ పతనం ఫార్మా షేర్లు ట్రేడింగ్‌లో పతనాన్ని చవిచూశాయి. ఈ రంగ కంపెనీలు జూన్ ఫలితాల సీజన్‌ను పేలవ ప్రదర్శనతో ప్రారంభించాయి. ఇంట్రాడేలో డాక్టర్ రెడ్డీస్ షేరు లోయర్ సర్క్యూట్‌ను తాకి మూడు నెలల కనిష్టానికి చేరుకుంది. ఈ పరిణామలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ నాలుగు శాతం నష్టపోయింది. డాక్టర్ రెడ్డీస్ కంపెనీ జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఇదే కంపెనీకి అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థ ఎస్ఈసీ(స్టాక్ ఎక్సే్చంజ్ కమిషన్) సమన్లు జారీ చేసింది. ఇంట్రాడేలో 12 శాతం నష్టపోయిన ఈ షేరు చివరికి పది శాతం నష్టంతో రూ.4843 వద్ద ముగిసింది. అరబిందో ఫార్మా, లుపిన్ షేర్లు 5–4% క్షీణించాయి. సిప్లా, దివిస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, బయోకాన్ షేర్లు మూడు నుంచి రెండు శాతం నష్టపోయాయి. టొరెంటో ఫార్మా, కేడిల్లా హెల్త్‌కేర్, ఆల్కేమ్ ల్యాబ్స్ షేర్లు ఒకశాతానికి పైగా పతనమయ్యాయి. ఏడునెలల కనిష్టానికి ఆసియా మార్కెట్లు చైనా స్టాక్ మార్కెట్లో మూడోరోజూ అమ్మకాలు కొనసాగడంతో ఆసియా మార్కెట్లు నెలల కనిష్టానికి దిగివచ్చాయి. చైనాకు చెందిన యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ ఫుడ్‌డెలివరీ ఫ్లాట్‌ఫామ్స్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు దిగ్గజ కంపెనీలైన మీటావాన్, ఎలిడాట్ లాభాల్ని పరిమితం చేస్తాయనే అంచనాలతో ఆ దేశ స్టాక్ సూచీ షాంఘై రెండున్నర శాతం నష్టంతో ముగిసింది. చైనా మార్కెట్లోని ప్రతికూలతతో హాంగ్‌కాంగ్ సూచీ నాలుగు శాతం పతనమైంది. అలాగే సింగపూర్, థాయిలాండ్, కొరియా, ఇండోనేషియా దేశాల మార్కెట్లు రెండు నుంచి అరశాతం క్షీణించాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ►ఈక్విటాస్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ల విలీనానికి రెండు కంపెనీల డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారు. దీంతో ఈక్విటాస్ హోల్డింగ్స్ షేరు ఆరు శాతం లాభపడి రూ.132 వద్ద ముగిసింది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేరు నాలుగు శాతం ర్యాలీ చేసి రూ.66 వద్ద స్థిరపడింది. ►జొమాటా షేరులో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో ఇంట్రాడేలో తొమ్మిది శాతం నష్టపోయి రూ.128 స్థాయికి దిగివచ్చింది. చివరికి ఐదున్నర శాతం క్షీణించి రూ.133 వద్ద ముగిసింది. ►నష్టాల మార్కెట్లోనూ మెటల్ షేర్లు మెరిశాయి. హిందాల్కో, టాటా స్టీల్ వంటి షేర్లు రాణించడంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఒకటిన్నర శాతం లాభపడింది. -
మందగమన భయాలతో నష్టాలు
ఆర్థిక మందగమన భయాలతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. దీంతో రెండు ట్రేడింగ్ సెషన్ల లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, భారత వృద్ధి మందగించగలదన్న వివిధ సంస్థల నివేదికలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా తగ్గడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 72 పాయింట్లు పతనమై 40,284 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 11,885 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రైవేట్ బ్యాంక్, ఐటీ, ఇంధన, ఎఫ్ఎమ్సీజీ, వాహన షేర్లు క్షీణించాయి. 320 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనా, అరగంటకే నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం వరకూ లాభ, నష్టాల మధ్య కొనసాగినా, ఆ తర్వాత పూర్తిగా నష్టాల్లోనే ట్రేడైంది. ఒక దశలో 185 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 135 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 320 పాయింట్ల రేంజ్లో కదలాడింది. కంపెనీల క్యూ2 ఫలితాల సీజన్ పూర్తికావడం, ఈ వారంలో ప్రధానమైన ఈవెంట్స్ ఏమీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి. కీలక వడ్డీ రేటును చైనా తగ్గించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఈ ప్రభావంతో మన దగ్గర నష్టాలకు కళ్లెం పడిందని నిపుణులు పేర్కొన్నారు. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి సానుకూల వార్తలు రావడంతో లోహ షేర్లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా మొదలయ్యాయి. లాభాల్లో టెలికం షేర్లు... ఏ టెలికం కంపెనీని మూతపడనివ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభయం ఇవ్వడంతో టెలికం షేర్లు పెరిగాయి. భారతీ ఎయిర్టెల్ 7 శాతం లాభంతో 21 నెలల గరిష్ట స్థాయి, రూ.420ను తాకింది. చివరకు 4 శాతం లాభంతో రూ.409 వద్ద ముగిసింది. వొడాఫోన్ ఐడియా 22 శాతం లాభంతో రూ.4.47కు చేరింది. n యెస్ బ్యాంక్ 4% నష్టంతో రూ.66 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో భారీగా నష్టపోయిన షేర్ ఇదే. n గ్లెన్ మార్క్ రేటింగ్‌ను అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ ‘అమ్మెచ్చు’ నుంచి ‘కొనొచ్చు’కు అప్‌గ్రేడ్ చేసింది. దీంతో గ్లెన్‌మార్క్ ఫార్మా షేర్ 21% లాభంతో రూ.365 వద్ద ముగిసింది. n స్టాక్ మార్కెట్ నష్టపోయినా 50కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. -
హెచ్-1బీ వీసా దెబ్బ: నష్టాల్లో మార్కెట్లు
టెక్నాలజీ స్టాక్స్‌లో నెలకొన్న ఆందోళనలు, లాభాల స్వీకరణ మార్కెట్లకు దెబ్బకొట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 119.01 పాయింట్లు పడిపోయి 26759.23 వద్ద ముగియగా.. 30 పాయింట్లు పడిపోయి నిఫ్టీ 8243.80 పాయింట్ల వద్ద సరిపెట్టుకుంది. హెచ్-1బీ వీసాల్లో నెలకొన్న ఆందోళనతో ఐటీ షేర్లు ఢమాల్ మనిపించాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహింద్రా, మైండ్‌ట్రీ, ఎంపాసిస్ కంపెనీల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. హెచ్1బి వీసాల్లో కీలక మార్పులు చేసేందుకు ఉద్దేశించిన ‘అమెరికా ఉద్యోగాల పరిరక్షణ, పెంపు చట్టం (ప్రొటెక్ట్ అండ్ గ్రో అమెరికన్ జాబ్స్ యాక్ట్)’ బిల్లును కాంగ్రెస్‌లో మళ్లీ ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో ఐటీ సబ్-ఇండెక్స్ కనీసం 3 శాతం పడిపోయింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహింద్రాలు దాదాపు 4.5 శాతం మేర పడిపోయాయి. మరోవైపు బ్యాంకింగ్ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. కొటక్ మహింద్రా బ్యాంకు, యస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాలనార్జించడంతో బ్యాంకు నిఫ్టీ 0.82 శాతం పెరిగింది. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర పెంపుకు కళ్లెం పడి 34 రూపాయలు నష్టపోయింది. 10 గ్రాముల బంగారం ధర 27,914గా నమోదైంది. -
రియల్టీ సెక్టార్‌కు మోదీ జోష్
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రాయితీలతో సోమవారం నాటి మార్కెట్లో రియల్టీ దూసుకుపోతోంది. శనివారం జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ పేదప్రజలకనుగుణంగా గృహ నిర్మాణం రాయితీలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు మాంచి జోష్ నిచ్చాయి. ఒకవైపు మార్కెట్లు100 పాయింట్లకు పైగా కోల్పోయి నష్టాల బాటలో సాగుతున్నప్పటికీ రియల్టీ ఇండెక్స్ లాభాల్లో పరుగులు పెడుతోంది. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు సహా, ఇతర వివిధ బ్యాంకులు ఎంసీఎల్ ఆర్ భారీ తగ్గింపును ప్రకటించడం ఈ రంగానికి సానుకూలంగా మారింది. లెండింగ్ రేటు తగ్గింపుతో బ్యాంకింగ్ సెక్టార్ కుదేలవ్వగా రియల్టీ సుమారు 2.2 శాతానిపైగా లాభపడుతోంది. ముఖ్యంగా ప్రధాని ప్రకటించిన ప్రోత్సాహకాలు రియల్టీకి మంచి బూస్ట్ ఇవ్వనుందన్న అంచనాల నేపథ్యంలో ఈ రంగాలో కొనుగోళ్ల ఒత్తిడి నెలకొంది. దీంతో యూనిటెక్ 6.3 శాతం జంప్‌చేయగా, హెచ్‌డీఐఎల్, డీఎల్ఎఫ్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఐబీ రియల్టీ, శోభా డెవలపర్స్ 3.7-1.4 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. అలాగే హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల లాభాలు కూడా జోరుగా ఉన్నాయి. కోల్టే పాటిల్ డెవలపర్స్ 5 శాతం, అన్సాల్10శాతం లాభపడుతున్నాయి. కాగా ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, బీవోబీ, యూనియన్ బ్యాంక్ , కోటక్ బ్యాంక్ వడ్డీ రేట్లలో భారీ తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సైన్యం దాడి: మిడ్‌సెషన్‌లో మార్కెట్ల భారీ పతనం
-
సైన్యం దాడి: మిడ్‌సెషన్‌లో మార్కెట్ల భారీ పతనం
పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసిందంటూ భారత సైన్యం ప్రతినిధి చెప్పిన కొద్ది సేపటికే.. మిడ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. డీజీఎమ్ఓ వ్యాఖ్యల అనంతరం దేశీయ సూచీలు గురువారం మధ్యాహ్నం సెషన్లో భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 573 పాయింట్లు పడిపోయి,28వేల దిగువకు 27,719 వద్దకు వచ్చి చేరింది. రియాల్టీ, హెల్త్ కేర్, పవర్, మెటల్ వంటి అన్ని రంగాల షేర్లు దాదాపు 5.05 శాతం పతనమయ్యాయి.అదేవిధంగా నిఫ్టీ సైతం 186.90 పాయింట్ల నష్టపోయి, 86వేల దిగువకు 8,558.25గా నమోదైంది.ఈ భారీ పతనానికి ప్రధాన కారణం పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు జరిపిందేననే డీజీఎమ్ఓ కామెంట్లేనని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల లాంచ్పాడ్లపై భారత సైన్యం గత రాత్రి సునిశిత దాడులు చేసిందనే వార్తను డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎమ్ఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ వెల్లడించారు. పాక్ భూభాగంలో ఉన్న 8 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్టు తెలిపారు. దీంతో దేశీయ మార్కెట్ల సెంటిమెంట్‌కు తీవ్రంగా దెబ్బతీసింది. ఒక్కసారిగా అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, లుపిన్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, గెయిల్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, లార్సెన్ అండ్ టుబ్రో, ఆసియన్ పేయింట్స్ నష్టాల బాట పట్టాయి.ఈ షేర్లు దాదాపు 4.75 శాతం మేర పతనమయ్యాయి. ఉడీ ఉగ్రఘటనతో భారత్‌కు, పాకిస్తాన్‌కు తీవ్ర చిచ్చు రేగింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత్ హెచ్చరించింది. డీజీఎమ్ఓ ప్రకటన భారత ఫైనాన్సియల్ మార్కెట్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. అంతర్జాతీయ పాజిటివ్ సంకేతాలతో మార్నింగ్ సెషన్లో 150 పాయింట్లకు పైగా ఎగిసి 28,423.14 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.అనంతరం 28,475.57 గరిష్ట స్థాయిని తాకింది. మధ్యాహ్న సెషన్ వచ్చే సరికి డీజీఎంఓ ప్రకటన వెలువడటంతో సెన్సెక్స్ 573 పాయింట్ల భారీ పతనాన్ని మూటకట్టుకుని 27,719.92 పాయింట్ల దిగువకు పడిపోయింది. -
3 నెలల కనిష్టానికి సెన్సెక్స్
జీఎస్టీ బిల్లు ఆమోదంపై అనుమానమేఘాలు ముసురుకోవడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 5 శాతం పతనమై ఏడేళ్ల కనిష్టానికి క్షీణించడం, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతుండడం, రూపాయి పతనం కూడా ప్రభావం చూపడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 220 పాయింట్లు క్షీణించి 25,310 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 64 పాయింట్లు నష్టంతో 7,702 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇది సెన్సెక్స్‌కు 3 నెలల కనిష్ట స్థాయి. బ్యాంక్, ఆర్థిక సంస్థలు, లోహ, ఇన్ఫ్రా, ఆయిల్, ఫార్మ షేర్లు నష్టపోయాయి. గత 5 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 860 పాయింట్లు కోల్పోయింది. మూడు కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం కాగా సెబీ తాజాగా ఎస్‌ఎస్‌ఐపీఎల్ రిటైల్, పరాంజపే స్కీమ్స్, భారత్ వైర్ రోప్స్ల ఐపీఓలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. క్రౌడ్‌ఫండింగ్‌కు త్వరలో మార్గదర్శకాలు: ఔత్సాహిక వ్యాపారవేత్తలు ‘క్రౌడ్‌ఫండింగ్’ మార్గంలో సులభతరంగా నిధులు సమీకరించుకునేందుకు వీలుగా త్వరలో మార్గదర్శకాలు ప్రవేశపెట్టనున్నట్లు సెబీ చైర్మన్ యూకే సిన్హా చెప్పారు.. -
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 247 పాయింట్ల నష్టంతో 25, 617 దగ్గర, నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 7,796 దగ్గర క్లోజ్ అయ్యాయి. ఈరోజు ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. యూరోపియన్, ఆసియన్ మార్కట్లు నష్టాలతో ప్రాంరంభంకావడం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసింది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధానాన్ని మంగళవారం సమీక్షంనున్న నేపథ్యంలో మార్కెట్లో నష్టాలు కొనసాగాయి. ముఖ్యంగా రివర్స్ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లను తగ్గించనుందన్న అంచనాలు మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో ఇన్వెస్టర్ల అమ్మకాలు మార్కెట్ ను నష్టాల బాటపట్టించాయి. కాగా హెల్త్ కేర్ రంగం షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. అటు బంగారం, వెండి ధరలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి లాభాల్లో ఉంది. అయితే రూపాయి బలహీనత కొనసాగుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. -
ఒక్క రోజులో మారిన కథ