పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసిందంటూ భారత సైన్యం ప్రతినిధి చెప్పిన కొద్ది సేపటికే.. మిడ్ సెషన్‌లో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. డీజీఎమ్ఓ వ్యాఖ్యల అనంతరం దేశీయ సూచీలు గురువారం మధ్యాహ్నం సెషన్లో భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 573 పాయింట్లు పడిపోయి,28వేల దిగువకు 27,719 వద్దకు వచ్చి చేరింది. రియాల్టీ, హెల్త్ కేర్, పవర్, మెటల్ వంటి అన్ని రంగాల షేర్లు దాదాపు 5.05 శాతం పతనమయ్యాయి.