ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 247 పాయింట్ల నష్టంతో 25, 617 దగ్గర, నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 7,796 దగ్గర క్లోజ్ అయ్యాయి. ఈరోజు ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. యూరోపియన్, ఆసియన్ మార్కట్లు నష్టాలతో ప్రాంరంభంకావడం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసింది.
మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధానాన్ని మంగళవారం సమీక్షంనున్న నేపథ్యంలో మార్కెట్లో నష్టాలు కొనసాగాయి. ముఖ్యంగా రివర్స్ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లను తగ్గించనుందన్న అంచనాలు మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో ఇన్వెస్టర్ల అమ్మకాలు మార్కెట్ ను నష్టాల బాటపట్టించాయి. కాగా హెల్త్ కేర్ రంగం షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి.
అటు బంగారం, వెండి ధరలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి లాభాల్లో ఉంది. అయితే రూపాయి బలహీనత కొనసాగుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.