జీఎస్టీపై బి-టౌన్ టాక్
ముంబై: సుదీర్ఘ కాలంగా ఆసక్తికర చర్చ నడుస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ బిల్లుకు బుధవారం పెద్దల సభ ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ పరిణామాలపై హిందీ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, దర్శకులు, ఇతర నటులు సోషల్ మీడియాలో స్పందించారు. బాలీవుడ్ కు చెందిన ఆయుష్మాన్ ఖురానా, బాలాజీ టెలీ మాజీ సీఈఓ తనూజ్ గార్గ్ తదితరులు ట్విట్టర్ లో తమ అభప్రాయాలను పోస్ట్ చేశారు.
నటుడు పూరబ్ కోహ్లీ దీనిపై స్పందిస్తూ తాము ఇంకా జిఎస్టి బిల్లు తరువాత స్వచ్ఛ్ భారత్ పన్ను చెల్లించవలసి ఉంటుందా తెలుసుకోవాలని ఉందన్నారు. జీఎస్ టీ బిల్లు విప్లవాత్మక సాహసోపేతమైన అడుగు అని ఆయుష్మాన్ ట్విట్ చేశారు. 1992 నుంచి అత్యంత ముఖ్యమైన ఆర్థిక సంస్కరణ అనీ, ఇదొక "వీర విప్లవ అడుగు" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక దేశం... ఒకపన్ను స్వాతంత్ర్యం అనంతరం ఇది అతిపెద్ద సంస్కరణ అంటూ తనూజ్ గూర్గ్ ప్రశంసించారు. జీఎస్టీ ఫైనల్లీ.. ఆహ్వానించ దగిన పరిణామమని దర్శకుడు కునాల్ కోహ్లీ తన సంతోషాన్ని షేర్ చేశారు.
అయితే హాస్యనటుడు అశ్విన్ ముష్రాన్ తనకు సంబంధించి జీఎస్టీలో ప్రధాన లోపం అధిక సేవా పన్ను కావచ్చన్నారు. కానీ మిగతా అంతా ప్రామాణీకరింబడిందని ట్విట్ చేశార. అటు బాలీవుడ్ సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. పెద్దగా ఏమీ తెలియకపోయినా... చాలా ఉత్సాహంగా అనిపించిందని ట్విట్ చేశారు. కాగా రాజ్యసభ అమోదంతో జీఎస్టీ బిల్లు చట్టం రూపం దాల్చడానికి ఒక ప్రధాన అడుగు ముందుకు పడినట్టు అయింది. ఇక ఇది బిల్లుగా మారడానికి లోకసభలో గ్రీన్ సిగ్నల్ పడడమే తరువాయి.