సరికొత్త టాక్ షోకు హోస్ట్‌గా టాలీవుడ్ హీరో.. ఏ ఓటీటీలో తెలుసా! | Tollywood Hero Rana Again Host A Talk Show In Famous Ott Platform | Sakshi
Sakshi News home page

Rana Daggubati: మరోసారి హోస్ట్‌గా రానా.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Published Tue, Mar 19 2024 6:51 PM | Last Updated on Tue, Mar 19 2024 7:32 PM

Tollywood Hero Rana Again Host A Talk Show In Famous Ott Platform - Sakshi

టాలీవుడ్‌ హీరో రానా దగ్గుబాటి గురించి పరిచయం అక్కర్లేదు. గతేడాది బాబాయ్‌ వెంకటేశ్‌తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్‌లో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కాగా.. ఆడియన్స్‌ నుంచి విశేష ఆదరణ  దక్కించుకుంది. ప్రస్తుతం రానా రజినీకాంత్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతే కాకుండా రానా ప్రధానపాత్రలో హిరణ్య కశ్యప  అనే మూవీని కూడా ప్రకటించారు.

 ఇదిలా ఉండగా.. రానా సరికొత్త టాక్‌ షోతో ప్రేక్షకులను అలరించనున్నారు. సెలెబ్రిటీలతో రానా ఈ టాక్ షో చేయనున్నారని అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్వహించిన ఈవెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. తన ప్రొడక్షన్ హౌస్ స్పిరిట్ మీడియాలో ఈ షోను ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే ఈ టాక్ షో ఎప్పటి నుంచి మొదలవుతుందని మాత్రం రివీల్ చేయలేదు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. 

గతంలో నంబర్ వన్ యారీ టాక్ షో

టాలీవుడ్ హీరో రానా గతంలో నంబర్ 1 యారీ పేరుతో ఓ టాక్ షో హోస్ట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీ సెలెబ్రిటీలతో ఈ టాక్ షో నిర్వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రానున్న టాక్‌ షో ది రానా కనెక్షన్ అనే పేరును ఖరారు చేశారు. టాలీవుడ్, బాలీవుడ్‍తో పాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన సెలెబ్రిటీలు ఈ టాక్ షోకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement