talk
-
మరోసారి హోస్ట్‌గా టాలీవుడ్ హీరో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ నటుడు, హీరో రానా దగ్గుబాటి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఇటీవల ఐఫా వేడుకల్లో సందడి చేసిన రానా సరికొత్త షోలో హోస్ట్‌గా కనిపించనున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సరికొత్త 'ది రానా దగ్గుబాటి షో'తో అభిమానులను అలరించనున్నారు.ది రానా దగ్గుబాటి షో పేరుతో నవంబర్ 23 నుంచి ఈ స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. గతంలో ఆయన నెం.1యారి అనే టాక్ షోకు హోస్ట్‌గా చేశారు. ఈ షోకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి బుల్లితెర ప్రియులను ఎంటర్టైన్ చేయనున్నారు. దీంతో రానా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టాలీవుడ్‌కు చెందిన ఎంతోమంది నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ షోకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. The stars you know, the stories you don’t✨🤭Get ready to get real on #TheRanaDaggubatiShowOnPrime, New Series, Nov 23@PrimeVideoIN @SpiritMediaIN pic.twitter.com/295MUNP30Z— Rana Daggubati (@RanaDaggubati) November 13, 2024 -
ఆటగాళ్లను ప్రోత్సహించాలి: ప్రధాని మోదీ
‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) తన మసులోని మాటను దేశ ప్రజల ముందు ఉంచారు. ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలంపిక్స్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు, దేశానికి ఘనత సాధించిపెట్టేందుకు ఒలింపిక్స్ మన ఆటగాళ్లకు మంచి అవకాశం కల్పిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.దేశ ప్రజలంతా ఒలింపిక్ ఆటగాళ్లను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ విద్యార్థులతో ముచ్చటించారు. కొద్ది రోజుల క్రితం ప్రపంచ మ్యాథ్స్ ఒలింపిక్స్ నిర్వహించామని, వీటిలో భారత విద్యార్థులు అద్భుత ప్రదర్శన చూపారన్నారు. ఇందులో మన జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని సాధించిందని పేర్కొన్నారు.అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో 100కు పైగా దేశాలకు చెందిన యువతీయువకులు పాల్గొన్నారని, ఓవరాల్‌గా మొదటి ఐదు స్థానాల్లో మన బృందం చోటు దక్కించుకుందని ప్రధాని పేర్కొన్నారు. దేశానికి కీర్తిని తీసుకువచ్చిన విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు. పూణేకు చెందిన ఆదిత్య వెంకట్ గణేష్, సిద్ధార్థ్ చోప్రా, ఢిల్లీకి చెందిన అర్జున్ గుప్తా, గ్రేటర్ నోయిడాకు చెందిన కనవ్ తల్వార్, ముంబైకి చెందిన రుషిల్ మాథుర్, గౌహతికి చెందిన ఆనందో భాదురితో ప్రధాని మాట్లాడారు.మన తల్లి కోసం, మాతృభూమి కోసం మనం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని ప్రధాని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మొక్కలు నాటే ప్రచారంలో మనమంతా భాగస్వాములు కావాలన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం కింద ఒకే రోజు రెండు లక్షల మొక్కలను నాటి, సరికొత్త సృష్టించామని మోదీ చెప్పారు. దేశ ప్రజలు ఖాదీ దుస్తులను కొనుగోలు చేయాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఎవరైనా ఖాదీ దుస్తులు కొనకుంటే ఇప్పుడే కొనుగోలు చేయాలని కోరారు. ఆగస్ట్ నెల వచ్చేస్తోందని, ఇది స్వాతంత్ర్య మాసమని, ఇది విప్లవానికి గుర్తు అని, ఖాదీని కొనడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
సరికొత్త టాక్ షోకు హోస్ట్‌గా టాలీవుడ్ హీరో.. ఏ ఓటీటీలో తెలుసా!
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి పరిచయం అక్కర్లేదు. గతేడాది బాబాయ్ వెంకటేశ్‌తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్‌లో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాగా.. ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం రానా రజినీకాంత్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతే కాకుండా రానా ప్రధానపాత్రలో హిరణ్య కశ్యప అనే మూవీని కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. రానా సరికొత్త టాక్ షోతో ప్రేక్షకులను అలరించనున్నారు. సెలెబ్రిటీలతో రానా ఈ టాక్ షో చేయనున్నారని అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్వహించిన ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. తన ప్రొడక్షన్ హౌస్ స్పిరిట్ మీడియాలో ఈ షోను ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే ఈ టాక్ షో ఎప్పటి నుంచి మొదలవుతుందని మాత్రం రివీల్ చేయలేదు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. గతంలో నంబర్ వన్ యారీ టాక్ షో టాలీవుడ్ హీరో రానా గతంలో నంబర్ 1 యారీ పేరుతో ఓ టాక్ షో హోస్ట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీ సెలెబ్రిటీలతో ఈ టాక్ షో నిర్వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రానున్న టాక్ షో ది రానా కనెక్షన్ అనే పేరును ఖరారు చేశారు. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన సెలెబ్రిటీలు ఈ టాక్ షోకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. An exciting and curiosity-piquing talk show hosted by celebrated actor Rana Daggubati, featuring his friends and contemporaries from Indian cinema. #TheRanaConnectionOnPrime #AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/Gg7fcqqeNi — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 -
కొత్త ఏడాది యువతరం ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే..?
కొత్త సంవత్సరం దగ్గరలో ఉంది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ‘హ్యాపీ న్యూ ఇయర్’ పాట పాడగానే సరిపోతుందా? ‘పాటతోపాటు ప్రణాళిక కూడా ఉంది’ అంటుంది మన జెన్ జెడ్. కొత్త సంవత్సరంలో జెన్ జెడ్ లక్ష్యాలు, ప్రణాళికలు, అభిరుచులకు సంబంధించి ‘ట్రెండ్ టాక్ రిపోర్ట్–2024’ అద్దం పడుతోంది. ఇండియా, యూఎస్, యూకే, బ్రెజిల్, సౌత్ కొరియా దేశాలలోని జెన్ జెడ్ ట్రెండ్స్‌కు సంబంధించి ‘ట్రెండ్ టాక్ రిపోర్ట్’ను విడుదల చేసింది ఇన్స్టాగ్రామ్. వర్త్ గ్లోబల్ స్టైల్ నెట్వర్క్ (డబ్ల్యూజీఎస్ఎన్)తో కలిసి నిర్వహించిన ఈ సర్వేలో 2024 సంవత్సరానికి సంబంధించి ఫ్యాషన్, బ్యూటీ, సోషల్ మీడియా, ఫ్రెండ్షిప్కు సంబంధించిన ప్రశ్నలు జెన్ జెడ్‌ను అడిగారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఫ్యాషన్ ట్రెండ్స్, బ్యూటీ అండ్ ఫుడ్ విభాగాలలో మన దేశం ట్రెండ్ సెట్టర్‌గా ఉంది. ఫుడ్ విషయానికి వస్తే కొత్త రుచులను ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇతరుల కంటే భిన్నంగా కనిపించే వస్త్రధారణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త హెయిర్‌స్టైల్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. 2024కు సంబంధించి ‘జెన్ జెడ్’ ప్రాధాన్యతలలో హెల్త్, ట్రావెల్, కెరీర్లు మొదటి స్థానంలో ఉన్నాయి. తమ కెరీర్‌పై ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నట్లు 43 శాతం మంది తెలియజేశారు. ఇతర దేశాలతో పోల్చితే మన ‘జెన్ జెడ్’ వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. సంపద సృష్టికి వ్యాపారమే మార్గం అని చెబుతోంది. మన దేశంలో ‘జెన్ జెడ్’లో ఎక్కుమంది స్పోర్ట్స్‌కు సంబంధించి సూపర్‌ఫ్యాన్స్ ఉన్నారు. లైఫ్ అడ్వైజ్, తమ ప్రొఫెషన్‌కు సంబంధించి కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. జీఆర్డబ్ల్యూఎం(గెట్ రెడీ విత్ మీ)లాంటి క్రియేటివిటీతో కూడిన ఫ్యాషన్ ట్రెండ్స్‌పై అమిత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మన దేశంలో జెన్ జెడ్‌లో 44 శాతం మంది సొంత ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చే డీఐవై(డూ–ఇట్–యువర్సెల్ఫ్) విధానాన్ని ఇష్టపడుతున్నారు. సంగీతం విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్, శ్రేయా ఘోషల్, అనిరుథ్ నుంచి సౌత్ కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ ‘బీటీఎస్ ఆర్మీ’ వరకు ఇష్టపడుతున్నారు. వారికి నచ్చిన వీడియో గేమ్స్‌లో ఫోర్ట్‌నైట్, కాల్ ఆఫ్ డ్యూటీ, రాబ్లక్స్... మొదలైనవి ఉన్నాయి. జెన్ జెడ్‌లోని పదిమందిలో తొమ్మిదిమంది వారు ఇష్టపడే రంగాలకు సంబంధించి సెలబ్రిటీల అభిమానగణంలో ఉన్నారు. తమ అభిమాన సెలబ్రిటీలు, అథ్లెట్లు, క్రియేటర్ నుంచి జెన్ జెడ్ రాబోయే కాలంలో ఆశిస్తున్నది ఏమిటి? అనే ప్రశ్నకు వినిపించే జవాబు... లైఫ్ అడ్వైజెస్, వారి ప్రొఫెషన్‌కు సంబంధించిన కంటెంట్... ఇక మీమ్స్ విషయానికి వస్తే మూడింట ఒక వంతుమంది ‘బ్యాడ్ టేస్ట్ మీమ్స్’ను తమ ‘టాప్ టర్న్ ఆఫ్’గా ఎంచుకున్నారు. గతం సంగతి ఎలా ఉన్నా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో యువతరం ముందు ఉంటుంది. అభిరుచుల నుంచి కెరీర్ ఆప్షన్స్ వరకు కొత్తగా ఆలోచిస్తోంది. ‘కాలేజీ చదువు పూర్తయిన తరువాత వైట్–కాలర్ జాబ్ తెచ్చుకోవాలి’ అనేది సంప్రదాయ ఆలోచన. అయితే యువతరంలో అందరూ ఇలాగే ఆలోచించడం లేదు.‘కంఫర్టబుల్ లైఫ్‌స్టైల్’కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీనికి కారణం జెనరేటివ్ ఏఐ. జెనరేటివ్ ఏఐ ప్రభావంతో వైట్–కాలర్ జాబ్స్‌కు ఉద్యోగభద్రత తక్కువ అనే అభిప్రాయం ఉంది. పియర్సన్ రిపోర్ట్ ప్రకారం జెనరేటివ్ ఏఐ వల్ల వైట్–కాలర్ ఉద్యోగాలలో 30 శాతం రిప్లేస్మెంట్ జరుగుతుంది. వైట్–కాలర్ జాబ్‌లతో పోల్చితే బ్లూ–కాలర్ జాబ్లకు అధిక ఉద్యోగ భద్రత ఉంది. రోబోట్స్ చేయలేని పనులు వీటిలో ఉండడమే కారణం. ఈ పనులు చేయడానికి ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం అవసరం. అయితే జెన్ జెడ్‌లో ఎక్కువమంది ఈ హై–డిమాండ్ ఫీల్డ్‌పై ఆసక్తి ప్రదర్శించడం లేదు. వైట్–కాలర్ జాబ్, బ్లూ–కాలర్ జాబ్ అనేదానితో సంబంధం లేకుండా ప్రతి ఉద్యోగికి విశ్లేషణాత్మక ఆలోచన విధానం, సమస్య పరిష్కార నైపుణ్యం, సమర్థవంతమైన కమ్యూనికేషన్, స్ట్రెస్ మెనేజ్మెంట్ స్కిల్స్... మొదలైన వాటికి సంబంధించి ప్రొఫెషనల్ స్కిల్స్ అవసరం. వీటిపై జెన్ జెడ్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. నిర్ణయాలు తీసుకోవడంలో ‘లైఫ్‌స్టైల్’ అనేది కీలకపాత్ర పోషిస్తోంది. డబ్బు నుంచి ఫ్రీ టైమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ వరకు ఎన్నో విషయాలను దృష్టిలో పెట్టుకుంటుంది జెన్ జెడ్. గుడ్ ప్లానింగ్ 2024లో యువతరం ఆసక్తి చూపుతున్న రంగాలలో ట్రావెల్ ఒకటి. ట్రావెల్ ప్రేమికులకు టాన్యాలాంటి ట్రావెల్ వ్లోగర్ల సలహాలు ఉపయోగపడుతున్నాయి. అడ్వర్టైజింగ్ రంగంలో ఉద్యోగం చేసిన టాన్యా సోలోగా ట్రావెలింగ్ మొదలుపెట్టి తాను వెళ్లిన ప్రదేశాలకు సంబంధించి వ్లోగింగ్ మొదలు పెట్టింది. యూట్యూబ్, ఎయిర్‌టెల్‌లాంటి పెద్ద కంపెనీలతో కలిసి పనిచేసింది. ట్రావెలింగ్‌పై ఆసక్తి ఉన్నవారికి గుడ్ ప్లానింగ్ అనేది ముఖ్యం అంటుంది టాన్యా. ‘గుడ్ ప్లానింగ్’కు సంబంధించి టిప్స్ చెబుతుంటుంది. ప్రణాళిక ఉండాలి దిల్లీకి చెందిన మౌనికా మాలిక్ బిజినెస్ అండ్ ఫైనాన్స్‌కు సంబంధించి కంటెంట్ క్రియేటర్‌గా చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకుంది. పర్సనల్ ఫైనాన్స్ నుంచి స్టాక్‌మార్కెట్ వరకు ఎన్నో విషయాలను సులభంగా అర్థమయ్యేలా చెబుతోంది. ‘ఒక రంగంపై ఇష్టం ఉన్నంత మాత్రాన విజయం చేరువ కాదు. భవిష్యత్ ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. పరిశ్రమకైనా, వ్యక్తికైనా ఇది ముఖ్యం’ అంటుంది మాలిక్. (చదవండి: జుట్టు లేకపోయినా మోడల్‌గా రాణించి శభాష్ అనిపించుకుంది! హెయిర్‌లెస్ మోడల్‌గా సత్తా చాటింది) -
‘మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు’ అనగానే బామ్మ ఆగ్రహంతో..
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక బామ్మకు సంబంధించిన వీడియో అందరినీ తెగ నవ్విస్తోంది. ఈ వీడియోలో బామ్మ ఫోనులో మాట్లాడుతూ కనిపిస్తుంది. ఆమె మాటలను విన్నవారంతా తెగ నవ్వుకుంటున్నారు.ఆ బామ్మ హరియాణాకు చెందినది. వీడియోలో బామ్మ ఏమి మాట్లాడుతున్నదో తెలిస్తే ఎవరైనా విస్తుపోవలసిందే. వీడియోలో కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వినిపిస్తుంటుంది. ‘మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు’ అని దానిలో వినిపిస్తుండగా, ఆ వాయిస్ విన్న బామ్మ కోపంతో తన ధోరణిలో మాట్లాడుతుంటుంది. వీడియోలో ముందుగా బామ్మ ఫోన్ చేస్తూ కనిపిస్తుంది. అటువైపు నుంచి రింగ్ వినిపిస్తుంది గానీ, ఎవరూ లిఫ్ట్ చేయరు. ఇంతలో కంప్యూటర్ రికార్డెడ్ వాయిస్ వినిపిస్తుంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదంటూ బామ్మకు ఒక యువతి గొంతు వినిపిస్తుంది. అంతే ఆ బామ్మ ఆగ్రహంతో ఆ కంప్యూటర్ వాయిస్ నిజమైనదేనని భావిస్తూ క్లాస్ పీకుతుంది. ఇది విన్న ఎవరైనా తమ నవ్వును అదుపుచేసుకోలేరు. అయితే ఆ బామ్మకు అసలు విషయం తెలియక ఫోనులో ఎవరో యువతి మాట్లాడుతున్నదని భావిస్తూ, ఆపకుండా మాట్లాడుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ChatBot भाई, संभलकर आइयो India में, अम्मा तुमको भी ना छोड़ने वाली हैं. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/YKjGC5ajoW — Rahul Prakash, IPS (@rahulprakashIPS) March 18, 2023 ఇది కూడా చదవండి: యువకుని ప్రాణాలు తీసిన మూమూస్ ఈటింగ్ ఛాలెంజ్ -
సీఎం జగన్ వైపే కాపు సామజిక వర్గం..!
-
బాయ్‌ఫ్రెండ్ మాట్లాడటం లేదని పోలీసులకు ఫిర్యాదు.. కట్ చేస్తే
భోపాల్: పోలీసు ఉద్యోగం అంటేనే ప్రతి రోజు నేరాలు, నేరగాళ్లతో సావాసం చేయక తప్పదు. రోజు పొద్దున లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయేవరకు నేరాలు, నేరస్తుల గురించే ఆలోచిస్తుంటారు. ఇక పోలీసులు దగ్గరకు రకరకాల ఫిర్యాదులు వస్తుంటాయి. అప్పుడప్పుడు కొన్ని వింత ఫిర్యాదులు కూడా వస్తుంటాయి. వాటిని చూసి పోలీసులు కూడా సరదాగా నవ్వుకుంటారు. ఈ కోవకు చెందిన ఫిర్యాదు ఒకటి మధ్యప్రదేశ్ పోలీసుల చెంతకు వచ్చింది. బాయ్‌ఫ్రెండ్ నాతో మాట్లాడటం లేదు.. సాయం చేయండి సార్ అని కోరింది ఓ మహిళ. ఆవివరాలు.. మధ్యప్రదేశ్ చింద్వారాకు చెందిన ఓ మహిళకు సారానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి... అది కాస్త ప్రేమగా మారింది. నెల రోజుల క్రితం వరకు వీరిద్దరి ప్రేమాయణం బాగానే సాగింది. ఈ క్రమంలో ఓరోజు లవర్స్ ఇద్దరు గొడవపడ్డారు. ఆ తర్వాత రెండు రోజులకు బాయ్‌ఫ్రెండ్ పుట్టినరోజు వచ్చింది. అంతకుముందే గొడవపడి ఉండటం మూలానా సదరు మహిళ బాయ్‌ఫ్రెండ్‌కి బర్త్‌డే విషేస్ చెప్పలేదు. (చదవండి: వింత ఘటన: గేదె పాలు ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు.. 4 గంటల తర్వాత) ఆ తర్వాత గొడవ ఇలానే కొనసాగింది. ఇక సదరు వ్యక్తి ప్రియురాలితో మాట్లాడటం పూర్తిగా మానేశాడు. సదరు మహిళ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. అతడు ఆమెతో మాట్లాడలేదు. ఈ క్రమంలో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. గత కొన్ని రోజులుగా బాయ్‌ఫ్రెండ్ తనతో మాట్లాడటం లేదని.. కావాలనే తనను దూరం పెడుతున్నానడి ఆరోపించింది. (చదవండి: అసలేం జరిగింది? సూసైడ్ నోట్ రాసి ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య) ఈ క్రమంలో పోలీసులు ఇద్దరిని స్టేషన్‌కు పిలిపించి.. కొన్ని గంటల పాటు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఇంట్లో వారికి వీరి విషయం చెప్పి.. పెళ్లి చేసుకోవాల్సిందిగా సూచించారు. పోలీసులు సూచన మేరకు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పారు సదరు లవర్స్. ఇరువైపులా పెద్దలు వారికి పెళ్లికి అంగీకరించడమే కాక.. ఆర్యసమాజ్‌లో వివాహం చేశారు. అలా వారి ప్రేమ కథ సుఖాంతం అయ్యింది. చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌కు 11 రూల్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు -
రొమాంటిక్ మూవీ ప్రీమియర్ షో టాక్
-
స్ట్రెయిట్ టాక్ విత్ బండి సంజయ్
-
దేవుడితో మాట్లాడే సమయం
‘‘మంత్రజపాలు చేసినా, హోమాలు నిర్వహించినా, యజ్ఞయాగాదులు చేసినా, గొప్ప గొప్ప శాస్త్రాలు చదివినా బుద్ధి కుదురుగా లేకపోతే, ప్రవర్తన సరిగా లేకపోతే మోక్షం కలుగదు’’ అని తనను దర్శించడానికి వచ్చే భక్తులకు తరచు బోధించేవారు సాయి. ఒక గింజ మొలకెత్తి, చిగురులు తొడిగి, వృక్షం కావాలంటే ఎన్నో శక్తులు, ఎన్నో విధాల సాయం చేస్తాయి. నేల, నీరు, గాలి, సూర్యుడు.. ఇవన్నీ ఊపిరులూదితే కానీ ఆ గింజ ప్రాణం పోసుకోదు. ఎదగదు. అయినా ఇవన్నీ ఆ మొక్క నుంచి ఏమీ ఆశించవు. మీరూ ఎవరినుంచీ ఏమీ ఆశించకండి. చేతనైతే ఎవరికైనా మేలు చేయండి లేదంటే కనీసం కీడు చేయకుండా ఉండండి’’ అని బాబా బోధించేవారు. ఎల్లవేళలా దైవనామస్మరణ చేసేవారిని మాత్రమే కాదు, కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవటం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకపోవటం, మంచి భావనలతో మనసును నిష్కల్మషంగా ఉంచుకోవటం.. వీటిని ఆచరించేవారిని కూడా బాబా సదా అంటిపెట్టుకుని ఉంటారు. బాబా చూపిన ఆధ్యాత్మిక బాట కేవలం భక్తిపరమైనదే కాదు, అది మంచి జీవనశైలిని కూడా అలవరుస్తుంది. దానిని ఆచరించిన వారు అన్నింటా మంచి ఫలితాలను పొందుతారు. ఎందుకంటే ఆయన ఆచరణ సాధ్యం కాని విషయాలను ఆచరించమని చెప్పలేదు. ఫలానా నియమాలను పాటించాలని, యజ్ఞయాగాదులు చేయమని సూచించలేదు. తననే పూజించమని చెప్పలేదు. మరేం చేశారంటే.. మనిషి మోక్షం పొందడానికి సరికొత్త జీవన విధానాన్ని ప్రచారం చేశారు. అంతేకాదు, ఆ విధానంలో ఎలా జీవించాలో అందరికీ జీవించి చూపారు. అలాంటి జీవన శైలిని అలవరచుకుంటే ఎవరయినా ఎంతటి స్థాయికి చేరుకోగలరో తెలిసేలా జీవించారు. సాయి చెప్పిన దానిని బట్టి ప్రార్థన అంటే దేవుడితో బేరం కుదుర్చుకోవడం కాదు. ‘ఫలానా పని అయితే నీ దగ్గరకు వస్తాను, అదిస్తాను, ఇదిస్తాను, నాకు ఈ పని అయ్యేలా చూడు’ అని మొక్కుకోవడం కాదు. నిజమైన ప్రార్థనలో ప్రతిఫలాపేక్ష ఉండదు. మనకు జీవితమనే గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవడం ప్రార్థనలోని పరమార్థం. ఇంకా సూటిగా చెప్పాలంటే – ‘ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడే సమయం’అన్నమాట. నిజంగా దేవుడి కోసం చేసే ప్రార్థనలో కోరికలు ఉండకూడదు. ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండకూడదు. నిజమైన భక్తి ఎలా ఉండాలంటే.. మనసులో మంచిని తలుచుకోవాలి. కళ్లతో మంచిని చూడాలి. నాలుకతో మంచిని మాట్లాడాలి. చెవులతో మంచిని వినాలి. మనసును నిర్మలంగా ఉంచుకోవాలి. ఎందుకంటే నిర్మలం కాని మనసులోకి భగవంతుడు ప్రవేశించలేడు. కాబట్టి పైన చెప్పిన మంచి పనులన్నింటినీ చేస్తూ, మనసును పూర్తిగా భగవంతుడి పైన లగ్నం చేయాలి. -
లండన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు
లండన్: అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను టాక్ ఆధ్వర్యంలోలండన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ అజ్మీర్గారేవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని వీరవనితలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబీషన్‌ను ప్రారంభించారు. లండన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణ మహిళలు అంతా ఒకేచోట సమావేశమై కార్యక్రమం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూర్మాచలం అనిల్, టాక్ అధ్యక్షురాలు కంది పవిత్రారెడ్డి, సభ్యులు బుడుగం స్వాతి, జాహ్నవి, శ్రావ్య, సుప్రజ, సుమ, శ్రీలత, విజయలక్ష్మి, ప్రవళిక, ప్రవాసభారతీయులు పాల్గొన్నారు. -
టీడీపీ కార్యకర్తల త్యాగాలు మరచిపోలేనివి
-
'సెంచరీ కొట్టి.. షాపింగ్ చేసేవాడు'
కోల్ కతా: ఈడెన్ గార్డెన్ లో భారత్-న్యూజిలాండ్ ల మధ్య రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసిన తర్వాత భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత దిగ్గజ ఆటగాళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ టెస్టు మ్యాచ్ లో సెంచరీ కొట్టిన మరుసటి రోజు షాపింగ్ కు వెళ్లి తనకు ఇష్టమైన బ్రాండ్ల దుస్తులను కొనుగోలు చేసేవాడని దాదా చెప్పుకొచ్చాడు. సచిన్ కు దుస్తులపై మక్కువ ఎక్కువని తెలిపాడు. తనతో జట్టులో ఉన్న సమయంలో సచిన్ వార్డ్ రోబ్ నిండా చక్కని దుస్తులు ఉండేవని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ నిత్యం ఆలస్యంగా వచ్చేవాడని తెలిపాడు. నాలుగు, ఐదు స్ధానాల్లో బ్యాటింగ్ కు దిగాల్సిన పరిస్ధితి ఉన్నా చివరి నిమిషంలో బస్సు వద్దుకు చేరుకునేవాడని చెప్పాడు. తాను కెప్టెన్ గా ఉన్న సమయంలో రాహుల్ ద్రవిడ్, సచిన్, హర్భజన్, సెహ్వాగ్, కుంబ్లేలు అనుకున్న పనిని తమదైన శైలిలో పూర్తి చేసేవారని కొనియాడాడు. వారి కృషే భారతీయ క్రికెట్ ను ప్రపంచదేశాల వరుసలో అగ్రభాగాన నిలబెట్టిందని అన్నాడు. -
‘మల్లేపల్లి’ని పరామర్శించిన మంత్రులు
గోదావరిఖని : బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి, సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య తల్లి పోచమ్మ ఈనెల 24న అనారోగ్యంతో మృతిచెందగా రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, హరీష్‌రావు, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డి తదితరులు సోమవారం సాయంత్రం జనగామలోని వారి నివాసానికి వెళ్లి లక్ష్మయ్యను పరామర్శించారు. పోచమ్మ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. -
నేడు కొత్త జిల్లాల ఏర్పాటుపై మరోసారి చర్చ
-
జీఎస్టీపై బి-టౌన్ టాక్
ముంబై: సుదీర్ఘ కాలంగా ఆసక్తికర చర్చ నడుస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ బిల్లుకు బుధవారం పెద్దల సభ ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ పరిణామాలపై హిందీ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, దర్శకులు, ఇతర నటులు సోషల్ మీడియాలో స్పందించారు. బాలీవుడ్ కు చెందిన ఆయుష్మాన్ ఖురానా, బాలాజీ టెలీ మాజీ సీఈఓ తనూజ్ గార్గ్ తదితరులు ట్విట్టర్ లో తమ అభప్రాయాలను పోస్ట్ చేశారు. నటుడు పూరబ్ కోహ్లీ దీనిపై స్పందిస్తూ తాము ఇంకా జిఎస్టి బిల్లు తరువాత స్వచ్ఛ్ భారత్ పన్ను చెల్లించవలసి ఉంటుందా తెలుసుకోవాలని ఉందన్నారు. జీఎస్ టీ బిల్లు విప్లవాత్మక సాహసోపేతమైన అడుగు అని ఆయుష్మాన్ ట్విట్ చేశారు. 1992 నుంచి అత్యంత ముఖ్యమైన ఆర్థిక సంస్కరణ అనీ, ఇదొక "వీర విప్లవ అడుగు" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక దేశం... ఒకపన్ను స్వాతంత్ర్యం అనంతరం ఇది అతిపెద్ద సంస్కరణ అంటూ తనూజ్ గూర్గ్ ప్రశంసించారు. జీఎస్టీ ఫైనల్లీ.. ఆహ్వానించ దగిన పరిణామమని దర్శకుడు కునాల్ కోహ్లీ తన సంతోషాన్ని షేర్ చేశారు. అయితే హాస్యనటుడు అశ్విన్ ముష్రాన్ తనకు సంబంధించి జీఎస్టీలో ప్రధాన లోపం అధిక సేవా పన్ను కావచ్చన్నారు. కానీ మిగతా అంతా ప్రామాణీకరింబడిందని ట్విట్ చేశార. అటు బాలీవుడ్ సూపర్ స్టార్లు అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. పెద్దగా ఏమీ తెలియకపోయినా... చాలా ఉత్సాహంగా అనిపించిందని ట్విట్ చేశారు. కాగా రాజ్యసభ అమోదంతో జీఎస్టీ బిల్లు చట్టం రూపం దాల్చడానికి ఒక ప్రధాన అడుగు ముందుకు పడినట్టు అయింది. ఇక ఇది బిల్లుగా మారడానికి లోకసభలో గ్రీన్ సిగ్నల్ పడడమే తరువాయి. -
లోక్‌సభలో ప్రత్యేక హోదాపై YSRCP
-
‘చంద్రముఖి-2’లో...?
లక లక లక అంటూ ‘చంద్రముఖి’లో జ్యోతికను తమకంగా చూస్తూ, రజనీకాంత్ అనే డైలాగ్‌ను అంత సులువుగా మర్చిపోలేం. యాంటీ షేడ్స్ ఉన్న కింగ్‌గా ఆ డైలాగ్‌ని రజనీ అద్భుతంగా పలికితే, జ్యోతిక అంతే అద్భుతంగా నటించారు. పి. వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి అందరికీ తెలుసు. దీనికి సీక్వెల్ చేయాలని వాసు అనుకున్నారు కానీ, కుదరలేదు. అందుకేనేమో తమిళంలో తాను చేయ నున్న తాజా చిత్రానికి ‘చంద్రముఖి-2’ అని పెట్టుకుని ఉంటారని చెన్నై చిత్రపరిశ్రమ వారు అంటున్నారు. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా ఇటీవల పి. వాసు ‘శివలింగ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్నే తమిళంలో రీమేక్ చేయాలను కుంటున్నారట. దీనికే ‘చంద్రముఖి-2’ అని టైటిల్ అనుకుంటున్నారట. తమిళంలో లారెన్స్, అనుష్క జంటగా ఈ చిత్రాన్ని రూపొందించాలను కుంటున్నారని సమాచారం. ‘చంద్రముఖి’లో సందడి చేసిన వడివేలు ఈ చిత్రంలో కూడా నటిస్తారని టాక్. -
జేఏసీ నేతలపై దాడిని ఖండీస్తున్నం
-
ఆమె మాజీ భర్తతో మాట్లాడదట
లాస్ ఎంజిల్స్: తన మాజీ భర్తతో మాట్లాడాలని తనకు లేదని ప్రముఖ పాప్ గాయని కేటి పెర్రీ అన్నారు. మూడేళ్లుగా భర్త రస్సెల్ బ్రాండ్‌తో విడిపోయి ఉంటున్న ఆమెను ఓ మీడియా ప్రశ్నించగా కాస్త అసహనంగా మాట్లాడింది. తాను ఇప్పుడు మీ నుంచి ఎలాంటి వినాలనుకోవడం లేదని, ఏదైనా వినాలకున్నా.. నేర్చుకోవాలనుకున్నా అది మ్యూజిక్ ద్వారానే చేస్తానని చెప్పింది. తనకు ఏం కావాలో తన పాటలే చెప్తాయని బదులిచ్చారు. 'నేను విడాకుల దరఖాస్తు పూర్తి చేస్తున్నాను అని ఆయన(రస్సెల్ బ్రాండ్) మెస్సేజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అతడు కూడా నాతో మాట్లాడలేదు. ఏదేమైన ఒక మహిళకు ప్రేమ ఎంత ముఖ్యమో విజయం అంతముఖ్యం అని అవి రెండు ఖచ్చితంగా కావాల్సిందే' అని చెప్పారు.