భోపాల్: పోలీసు ఉద్యోగం అంటేనే ప్రతి రోజు నేరాలు, నేరగాళ్లతో సావాసం చేయక తప్పదు. రోజు పొద్దున లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయేవరకు నేరాలు, నేరస్తుల గురించే ఆలోచిస్తుంటారు. ఇక పోలీసులు దగ్గరకు రకరకాల ఫిర్యాదులు వస్తుంటాయి. అప్పుడప్పుడు కొన్ని వింత ఫిర్యాదులు కూడా వస్తుంటాయి. వాటిని చూసి పోలీసులు కూడా సరదాగా నవ్వుకుంటారు. ఈ కోవకు చెందిన ఫిర్యాదు ఒకటి మధ్యప్రదేశ్ పోలీసుల చెంతకు వచ్చింది. బాయ్‌ఫ్రెండ్ నాతో మాట్లాడటం లేదు.. సాయం చేయండి సార్ అని కోరింది ఓ మహిళ. ఆవివరాలు..
మధ్యప్రదేశ్ చింద్వారాకు చెందిన ఓ మహిళకు సారానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి... అది కాస్త ప్రేమగా మారింది. నెల రోజుల క్రితం వరకు వీరిద్దరి ప్రేమాయణం బాగానే సాగింది. ఈ క్రమంలో ఓరోజు లవర్స్ ఇద్దరు గొడవపడ్డారు. ఆ తర్వాత రెండు రోజులకు బాయ్‌ఫ్రెండ్ పుట్టినరోజు వచ్చింది. అంతకుముందే గొడవపడి ఉండటం మూలానా సదరు మహిళ బాయ్‌ఫ్రెండ్‌కి బర్త్‌డే విషేస్ చెప్పలేదు.
(చదవండి: వింత ఘటన: గేదె పాలు ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు.. 4 గంటల తర్వాత)
ఆ తర్వాత గొడవ ఇలానే కొనసాగింది. ఇక సదరు వ్యక్తి ప్రియురాలితో మాట్లాడటం పూర్తిగా మానేశాడు. సదరు మహిళ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. అతడు ఆమెతో మాట్లాడలేదు. ఈ క్రమంలో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. గత కొన్ని రోజులుగా బాయ్‌ఫ్రెండ్ తనతో మాట్లాడటం లేదని.. కావాలనే తనను దూరం పెడుతున్నానడి ఆరోపించింది.
(చదవండి: అసలేం జరిగింది? సూసైడ్ నోట్ రాసి ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య)
ఈ క్రమంలో పోలీసులు ఇద్దరిని స్టేషన్‌కు పిలిపించి.. కొన్ని గంటల పాటు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఇంట్లో వారికి వీరి విషయం చెప్పి.. పెళ్లి చేసుకోవాల్సిందిగా సూచించారు. పోలీసులు సూచన మేరకు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పారు సదరు లవర్స్. ఇరువైపులా పెద్దలు వారికి పెళ్లికి అంగీకరించడమే కాక.. ఆర్యసమాజ్‌లో వివాహం చేశారు. అలా వారి ప్రేమ కథ సుఖాంతం అయ్యింది.
చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌కు 11 రూల్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు
Comments
Please login to add a commentAdd a comment