ప్రియుడు మోసం చేశాడంటూ వివాహిత ఫిర్యాదు | married woman complaint to her lover | Sakshi
Sakshi News home page

ప్రియుడు మోసం చేశాడంటూ వివాహిత ఫిర్యాదు

Jun 10 2016 3:15 AM | Updated on Mar 28 2018 11:26 AM

ప్రియుడు తనను నమ్మించి మోసం చేశాడంటూ ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది.

 శంషాబాద్ రూరల్ : ప్రియుడు తనను నమ్మించి మోసం చేశాడంటూ ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ అహ్మద్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. హమీదుల్లానగర్ నివాసి పెంటయ్య కూతురు రాజేశ్వరి(19) వివాహం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ వాసి యాదయ్యతో మే 1న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత రాజేశ్వరి భర్తతో సఖ్యతగా లేకపోవడంతో పాటు తనకు ఇంతకు ముందు ప్రేమికుడు ఉన్నట్లు చెప్పింది.

దీంతో యాదయ్య తన భార్య రాజేశ్వరిని పుట్టింటికి పంపించాడు. రాజేశ్వరి పాఠశాలలో చదువుకునే సమయంలో చిన్నగోల్కొండ వాసి చాకలి గౌతంప్రదీప్(21)తో ప్రేమ వ్యవహారం ఉండగా.. భర్త నుంచి విడిపోయిన ఆమె 15 రోజుల కిందట గౌతం వద్దకు వెళ్లింది. తనను పెళ్లి చేసుకోమని అడగగా.. అందుకు అతను నిరాకరించాడు. దీంతో రాజేశ్వరి పోలీసులను ఆశ్రయించింది. తనకు సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు పంపించడమే కాకుండా భర్తను వదిలిరమ్మని చెప్పాడని.. తీరా ఇంటికి వెళ్తే కులం పేరుతో దూషించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏసీపీ అనురాధ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ అహ్మద్ పాషా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement