హ్యూమన్‌రైట్స్ సంఘ సభ్యులతో కలిసి íసీఐ నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేస్తున్న ఉషారాణి
రామభద్రపురం: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మిర్తివలస గ్రామానికి చెందిన సువ్వాడ ఉషారాణి అదే గ్రామానికి చెందిన పొట్నూరు గోపాలకృష్ణ 2019 నుంచి ప్రేమించుకుంటున్నారు. గోపాలకృష్ణ హైదరాబాద్ సెంట్రల్ పోలీస్ లైన్స్‌లో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. అయితే 2020లో ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో గ్రామపెద్దల వద్దకు పంచాయితీ చేరింది.
దీంతో గోపాలకృష్ణ నుంచి కొంత మొత్తాన్ని ఉషారాణికి ఇప్పించి రాజీ కుదిర్చారు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. గోపాలకృష్ణ డిప్యుటేషన్‌పై విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తూ, అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి ఉషారాణితో గడుపుతుండేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని గోపాలకృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజయనగరం హ్యూమన్ రైట్స్ సంఘం సభ్యులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు గ్రామ పెద్దలతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ ఎం. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: ఇంటి దొంగ గుట్టురట్టు.. అసలు సూత్రధారి బ్యాంకు మేనేజరే!)
Comments
Please login to add a commentAdd a comment