లక్ష్మయ్యను పరామర్శిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
గోదావరిఖని : బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి, సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య తల్లి పోచమ్మ ఈనెల 24న అనారోగ్యంతో మృతిచెందగా రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, హరీష్‌రావు, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డి తదితరులు సోమవారం సాయంత్రం జనగామలోని వారి నివాసానికి వెళ్లి లక్ష్మయ్యను పరామర్శించారు. పోచమ్మ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు.