
జీఎస్టీ బిల్లుకు మద్దతిస్తాం: ఎంపీ వినోద్
న్యూఢిల్లీ: పార్లమెంట్లో వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుకు టీఆర్ఎస్ మద్దతిస్తుందని ఎంపీ వినోద్ వెల్లడించారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆదివారం టీఆర్ఎస్ ఎంపీలు సమావేశమయ్యారు. అనంతరం వినోద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అపరిష్కృత సమస్యలపై సోమవారం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుస్తారని తెలిపారు. పార్లమెంట్లో హైకోర్టు విభజన అంశంపై పోరాడుతామని మరో ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. అంశాలవారిగా కేంద్రానికి సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.