'అసెంబ్లీని 15 రోజులపాటు నిర్వహించాలి' | Telangana assembly sessions should be held for 15 days, says Telangana congress MLA sampath | Sakshi
Sakshi News home page

'అసెంబ్లీని 15 రోజులపాటు నిర్వహించాలి'

Published Mon, Aug 29 2016 8:38 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

'అసెంబ్లీని 15 రోజులపాటు నిర్వహించాలి' - Sakshi

'అసెంబ్లీని 15 రోజులపాటు నిర్వహించాలి'

హైదరాబాద్: ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో చర్చించాల్సిన సమస్యలు ఎక్కువగా ఉన్నందున సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కోరారు. సోమవారం హైదరాబాద్లో మూడున్నర గంటల పాటు తెలంగాణ సీఎల్పీ సమావేశం కొనసాగింది.

ఈ సమావేశంలో పలు సమస్యలపై పార్టీ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా గ్యాంగ్స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించాలని సంపత్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు కూడా చర్చకు రానున్న సందర్భంగా.. అసెంబ్లీ కేవలం జీఎస్టీ బిల్లు కోసమే అంటే సరికాదన్నారు. సభను ఎక్కువ రోజులు నిర్వహించే అంశంపై అధికారపక్షాన్ని ప్రశ్నిస్తామని ఎమ్మెల్యే సంపత్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement