MLA Sampath
-
రేవంత్ రాజీనామా ఎక్కడ ఆగింది: ఎ.జీవన్‌రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘రేవంత్ రాజీనామా ఎక్కడ ఆగింది. ఎక్కడ తట్టుకుంది. స్పీకర్ అయితే.. రాలేదన్నారు. రేవంత్.. ఆట మొదలయింది అన్నడు. ఎక్కడ పోయాడు?’అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంపత్‌ను ప్రశ్నించారు. ప్రతిగా ఎమ్మెల్యే సంపత్.. ‘అసలు రేవంత్ రాజీనామా గురించి అడిగే దమ్ము టీఆర్ఎస్కు లేదు. అసలు టీఆర్ఎస్ దగ్గర ఆయుధాలు లేవు..’అంటూ స్పందించారు. -
ఆపార్టీలో చేరితే అక్రమ సంబంధం పెట్టుకున్నట్లే
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి బాహుబలా.. లేక సముద్రంలో నీటి బిందువా అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ జరగింది. రేవంత్ రెడ్డి రాజీనామాపై కాంగ్రెస్సే స్పందించాలని, రేవంత్ అందరికీ సినిమా చూపించాడని, ఇపుడు కాంగ్రెస్‌కి చూపిస్తారని జీవన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో చేరడం అంటే అక్రమ సంబంధం పెట్టుకోవడమేనంటూ వ్యాఖ్యానించారు. దీంతో ‘అక్రమ సంబంధం పునాదుల మీద పుట్టిన పార్టీ టీఆర్ఎస్. అది ఒక కిచిడి పార్టీ. అమరావతికి పోయి టీడీపీతో సంబంధాలు పెట్టుకున్న పార్టీ టీఆర్ఎస్’అంటూ సంపత్ తిప్పికొట్టారు. టీఆర్ఎస్కు ముందుంది ముసళ్ల పండగ అంటూ వ్యాఖ్యానించిన సంపత్.. అలంపూర్‌లో తన మీద పోటీ చేయడానికి టీఆర్ఎస్కు అభ్యర్థికే దిక్కు లేదని, రాష్ట్రమంతా వెతికినా తన మీద పోటీకి ఎవరు దొరకరని అన్నారు. అలంపూర్‌లో తనకు తానే పోటీ అని, తన మీద గెలిచే సత్తా టీఆర్ఎస్కు లేదని సవాల్ చేశారు. గడ్డం ఎప్పుడు తీస్తావన్నా? ఉత్తమ్‌తో.. ఎర్రబెల్లి సరదా సంభాషణ తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. లాబీల్లో తనకు ఎదురైన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని.. ‘గడ్డం ఎప్పుడు తీస్తావ్ అన్నా’.. అని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. 2019లో ఎలాగూ అధికారంలోకి వస్తాం గనుక అప్పుడు గడ్డం తీసేస్తా అని సమాధానం ఇచ్చారు. ‘చాలా కూల్‌గా ఉన్నావేంటి..’అని ఉత్తమ్ తిరిగి ఎర్రబెల్లిని అడిగారు. ‘నా టెన్షన్లన్నీ తీరిపోయాయి.. ఇప్పుడు ఆ టెన్షన్లు మీకు మొదలయ్యాయి..’అంటూ ఎర్రబెల్లి చమత్కరించారు. -
నా జాతికి లేని రక్షణ నాకెందుకు?
గన్మెన్లను వెనక్కి పంపుతున్నా: ఎమ్మెల్యే సంపత్ గద్వాల అర్బన్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో దళితులపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ‘‘నా జాతికి లేని పోలీసు రక్షణ నాకెందుకు?.. అందుకే రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి సాక్షిగా ప్రభుత్వ గన్మెన్లను వెనక్కి పంపు తున్నాను’’అని ఆయన ప్రకటించారు. గద్వాలలో జరిగిన అంబేడ్కర్ 126వ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే డీకే అరుణతో కలసి ఆయన పాల్గొన్నారు. సంపత్ మాట్లాడుతూ ఒక దళిత మహిళ శాంతినగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళితే బట్టలు ఊడదీసి కొడతానని ఎస్ఐ అసభ్య పదజాలంతో దూషిం చాడని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో మరికొన్ని చోట్ల దళితులపై దాడులు జరిగిన విషయాన్ని ఎస్పీ, డీఎస్పీ, సీఐల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
మీడియా పాయింట్
పాడి ఆదాయం పెంచండి: చిన్నారెడ్డి సాక్షి, హైదరాబాద్: పాడి రైతుల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయాలని, లీటరు పాలకు రూ.4 ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు ఎన్.పద్మావతీ రెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్ రెడ్డితో కలసి మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన పోత్సాహకాన్ని వెంటనే చెల్లించే విధంగా, పాడిరైతుల తలసరి ఆదాయం పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దళితుల సంక్షేమం ఎక్కడ?: సంపత్ సాక్షి, హైదరాబాద్: దళితులకు సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ విమర్శించారు. సంక్షేమం విషయంలో అసెంబ్లీని తప్పుదోవ పట్టించేవిధంగా ప్రభుత్వం తప్పుడు లెక్కలను చూపిందన్నారు. 2012–16లో ప్రభుత్వం ఇప్పటిదాకా మార్జిన్‌మనీ విడుదల చేయలేదన్నారు. నిమ్స్‌లో ఎమ్మెల్సీకే వైద్యం చేయలేదు సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యరంగంలో ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి విమర్శించారు. సాక్షాత్తూ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో కూడా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కాంగ్రెస్ నుంచి ఇటీవలనే టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ వైద్యం కోసం నిమ్స్‌కు వెళ్తే చికిత్సలు అందలేదన్నారు. చట్టసభ సభ్యునికే వైద్యం అందించలేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో అంచనా వేయవచ్చన్నారు. కాంట్రాక్టర్లను బెదిరిస్తున్న రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆరోపణ సాక్షి, హైదరాబాద్: వర్షాలకు కల్లాల్లో ధాన్యం మొలకలు వచ్చిన పరిస్థితి ఒకప్పుడు ఉండేదని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు అన్నారు. తెలంగాణ వచ్చాక రైతుల కష్టాలు గుర్తించి రూ.1,024 కోట్లతో 330 గోదాంలు నిర్మించినట్లు పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో వారు మాట్లాడుతూ, టీడీపీ నేత రేవంత్ రెడ్డి సమాచార చట్టం ద్వారా వివరాలు తెలుసుకుని కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని విమర్శించారు. ఆధారాలు లేకుండా విమర్శలు చేయొద్దని రేవంత్‌ను హెచ్చరించారు. -
'అసెంబ్లీని 15 రోజులపాటు నిర్వహించాలి'
హైదరాబాద్: ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో చర్చించాల్సిన సమస్యలు ఎక్కువగా ఉన్నందున సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కోరారు. సోమవారం హైదరాబాద్‌లో మూడున్నర గంటల పాటు తెలంగాణ సీఎల్పీ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పలు సమస్యలపై పార్టీ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా గ్యాంగ్‌స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించాలని సంపత్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు కూడా చర్చకు రానున్న సందర్భంగా.. అసెంబ్లీ కేవలం జీఎస్టీ బిల్లు కోసమే అంటే సరికాదన్నారు. సభను ఎక్కువ రోజులు నిర్వహించే అంశంపై అధికారపక్షాన్ని ప్రశ్నిస్తామని ఎమ్మెల్యే సంపత్ తెలిపారు. -
గద్వాల జిల్లా కోసం హైవే దిగ్బంధం
- రాజకీయ కోణంలోనే గద్వాలను జిల్లా కాకుండా అడ్డుకుంటున్నారు: డీకే అరుణ - ప్రజాభిప్రాయానికి సర్కార్ విలువ ఇవ్వడం లేదు: ఎమ్మెల్యే సంపత్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గద్వాలను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బెంగళూర్- హైదరాబాద్ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. గద్వాల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్‌కుమార్‌లు నాయకత్వం వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో ఉదయం 10.30 గంటకు ప్రారంభమైన రాస్తారోకో మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగింది. జాతీయ రహదారిపై పెద్దఎత్తున వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ట్రాఫిక్ స్తంభించడంతో డీకే అరుణ, సంపత్‌కుమార్, ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య పెనుగులాట జరిగింది. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సంపత్‌కుమార్‌ను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా చేయికి దెబ్బ తగిలింది. అతి కష్టం మీద ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇతర నేతలను పోలీసులు ఇటిక్యాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. రాజకీయ కోణంలో అడ్డుకుంటున్నారు: డీకే అరుణ రాజకీయ కోణంలో గద్వాలను జిల్లా కాకుండా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కివేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజల తరఫున పోరాడుతానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు బాసటగా నిలిచి కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాంను సైతం ఇప్పుడు శత్రువుగా చూస్తూ దూరం పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో శక్తి పీఠమైన జోగుళాంబ పేరుతో గద్వాల జిల్లా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రభుత్వం రెఫరెండం నిర్వహించాలని, గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో ప్రజల ఆకాంక్ష ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు విధివిధానాలను రూపొందించిన ప్రభుత్వం వాటిని ఆధారంగా చేసుకుని జిల్లాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా గద్వాల జిల్లాను సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయానికి టీఆర్ఎస్ ప్రభుత్వం విలువనివ్వడం లేదని లక్షలాది మంది ప్రజలు గద్వాల జిల్లాను కోరుకుంటున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని ధ్వజమెత్తారు. గద్వాల జిల్లా వల్ల అలంపూర్ నియోజకవర్గానికి పాలన సౌలభ్యం కలుగుతుందని ఆయన చెప్పారు.