కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. బుధవారం ఏర్పాటు చేసిన కేబినెట్ సమావేశంలో జీఎస్‌టీ బిల్లులో మార్పులపై చర్చ జరిగింది.
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. బుధవారం ఏర్పాటు చేసిన కేబినెట్ సమావేశంలో జీఎస్‌టీ బిల్లులో మార్పులపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో జీఎస్‌టీ బిల్లులో మార్పులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక శాతం అదనపు పన్ను తొలగించాలన్న రాష్ట్రాల ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదించింది.
ఐదేళ్లపాటు అన్ని రాష్ట్రాలకు వంద శాతం పరిహారం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. రాష్ట్రాల్లో తయారీ రంగంపై ఒక శాతం పన్నును కేంద్రం తొలగించింది. స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల పరిమితి 15 శాతానికి పెంచుతున్నట్టు పేర్కొంది.